గుజరాత్‌ లో (Gujarat state) అహ్మదాబాద్‌ (Ahmedabad) లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ (Sardar Patel) అంతర్జాతీయ విమానాశ్రయం (International Airport) ను బాంబులతో పేల్చివేస్తామని గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. ఈ మేరకు ఎయిర్‌పోర్టుకు లేఖ పంపారు. ఈ విషయాన్ని అహ్మదాబాద్‌ క్రైమ్‌ బ్రాంచ్‌ జాయింట్ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ శరద్‌ సింఘాల్‌ మీడియాకు వెల్లడించారు. బెదిరింపు లేఖ వార్త ఎయిర్‌పోర్టులో తీవ్ర కలకలం రేపింది.

ఎయిర్‌పోర్టు భద్రతాసిబ్బంది అప్రమత్తమయ్యారు. బాంబు స్క్వాడ్‌ రంగంలోకి దిగి తనిఖీలు చేస్తున్నారు. ఈ మధ్య ఎయిర్‌పోర్టుల (Airports) ను, స్కూళ్ల (Schools) ను పేల్చివేస్తామంటూ ఫోన్‌ల ద్వారా, లేఖల ద్వారా బెదిరింపులకు పాల్పడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది.

హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం.. 10 ఫైరింజన్లతో మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది (వీడియో)

Here's Ahmedabad Airport Bomb Threat:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)