కర్ణాటక రాష్ట్రం మంగళూరు (Mangaluru)లోని లేడీహిల్ (Ladyhill) ప్రాంతంలో గల నారాయణ గురు సర్కిల్ (Narayana Guru Circle) లో ఉన్న ఓ పెట్రోల్ బంక్ (Petrol Pump) వద్ద కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి (Car Catches Fire). అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.
ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. వారంతా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పెట్రోల్ పంప్ సిబ్బంది నీళ్లు పోసి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటల్లో కారు దగ్ధమవుతున్న దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
Car Catches Fire At Mangaluru Petrol Pump
A Maruti 800 caught fire at a petrol pump in Lady Hill, Mangaluru, on Sunday, creating a moment of panic pic.twitter.com/kq80wvV9Xf
— News Karnataka (@Newskarnataka) November 11, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)