తమిళనాడులో ఫెంగల్ తుఫాను కల్లోలం రేపుతోంది. బుధవారం ఉదయం నుంచి రాష్ట్రంలో పలు జిల్లాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. మైలాదుత్తురై జిల్లా కేంద్రంలోని ఓ పాత భవనం ఫెంగల్ దెబ్బకు కుప్పకూలింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర-వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాలవైపు పయనిస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఇది బుధవారం సాయంత్రానికి నాగపట్టణానికి 370 కిలోమీటర్లు, చెన్నైకి 550 కిమీ, పుదుచ్చేరికి 470 కిలోమీటర్ల ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమైవుంది.
old house collapsed in Tamil Nadu
VIDEO | An old house collapsed in Tamil Nadu's Mayiladuthurai due to heavy rains earlier today.
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7)#TamilNaduRains pic.twitter.com/sYHwEFfO5W
— Press Trust of India (@PTI_News) November 27, 2024
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)