తమిళనాడు రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఐఎండీ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది బుధవారం నాటికి నైరుతి బంగాళాఖాతంలోకి చేరుకోనుంది. దీని ప్రభావంతో డిసెంబర్ 8న తమిళనాడు రాష్ట్రంతో పాటు పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఈ మేరకు తమిళనాడు రాష్ట్రంలోని విల్లుపురం, చెంగల్పట్టు, కడలూర్‌, కాంచీపురం, తిరువళ్లూరు, అరియలూరు, పెరంబలూర్‌, చెన్నై, కళ్లకురిచ్చి, మైలదుతురై, తంజావూర్‌, తిరువరూర్‌, నాగపట్నం జిల్లాలకు ఐఎండీ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆరు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు రాష్ట్రానికి చేరుకున్నాయి.

Here;s IMD Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)