కేంద్ర ఎన్నికల సంఘం (Chief Election Commissioner) కమిషన్‌గా బాధ్యతలు చేపట్టారు జ్ఞానేశ్‌ కుమార్‌ (Gyanesh Kumar). ఈ సందర్భంగా మాట్లాడిన జ్ఞానేశ్‌ కుమార్.... దేశ నిర్మాణానికి మొదటి అడుగు ఓటే అని అన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయుడూ ఓటరుగా మారాలని...ఓటర్లు ఎన్నికల్లో తప్పకుండా ఓటు వేయాలి అని అన్నారు.

కేరళ క్యాడర్‌కు చెందిన ‌1988 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. 2029 జనవరి 26వ తేదీ వరకూ కొనసాగనున్నారు. ఈ ఏడాది చివరిలో బిహార్, వచ్చే ఏడాదిలో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా ఆయన హయాంలోనే 2027లో జరుగనున్నాయి.

పూణేలో బహిరంగంగానే తుపాకులతో సంచారం.. వైరల్‌గా మారిన వీడియో, పోలీసుల దర్యాప్తు ముమ్మరం, వీడియో ఇదిగో 

అమిత్ షాకు అత్యంత సన్నిహితుడు జ్ఞానేశ్‌ కుమార్. ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన సందర్భంలో ప్రవేశపెట్టిన బిల్లును రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు.

 Gyanesh Kumar Takes Charge as Chief Election Commissioner

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)