మహా కుంభమేళా (Mahakumbh) కు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన విషాదకర ఘటన వారణాసిలో చోటు చేసుకుంది. భక్తులు ప్రయాణిస్తున్న క్రూయిజర్‌ జీపు (Cruiser Jeep) ను లారీ (Lorry) ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారణాసి జిల్లా (Waranasi district) లోని మీర్జా మురారా (Mirza Murara) పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.

అపార్టుమెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కున్న ఆరేళ్ల బాలుడు.. మాసాబ్ ట్యాంక్ శాంతినగర్‌లో ఘటన, బాలుడిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది, వీడియో ఇదిగో

కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలోని లడగేరి ఏరియాకు చెందిన 14 మంది క్రూయిజర్‌ జీపులో మహా కుంభమేళాకు బయలుదేరారు.వారు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి జిల్లా మీర్జా మురారా పోలీస్‌స్టేషన్ పరిధిలోని రూపాపూర్‌ గ్రామం వద్ద ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్రూయిజర్‌ జీపులోని ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్‌ సహా మిగతా ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

6 Devotees Killed & Several Injured In Road Accident

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)