మహారాష్ట్ర చరిత్రలో తొలిసారిగా బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి భారీ విజయం తర్వాత శాసనసభలో ప్రతిపక్ష నేత లేకపోవచ్చు. 288 స్థానాలున్న అసెంబ్లీలో అధికార కూటమి 230 స్థానాలను కైవసం చేసుకోగా, MVA కేవలం 46 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. మహారాష్ట్ర అసెంబ్లీ నిబంధనల ప్రకారం మొత్తం 288 సీట్లలో 10 శాతం లేదా 29 సీట్లు సాధించిన పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కుతుంది. అయితే ఎంవీఏలోని ఏ పార్టీ కూడా ఆ మేరకు సీట్లు గెలువలేదు. దీంతో శాసనసభలో ప్రతిపక్ష నాయకుడి పదవికి ఏ పార్టీ కూడా అర్హత సాధించలేదు. ఈ నేపథ్యంలో ఎంవీఏ కూటమి ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. అలాగే ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ), శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) తమ నిజమైన పార్టీల ఉనికిని కూడా కోల్పోయాయి.
In a First, No Leader of Opposition in State Assembly
First Time In 60 Years, #Maharashtra May Not Have A Leader Of Opposition #MaharashtraElection2024
— Ratnesh Mishra 🇮🇳 (@Ratnesh_speaks) November 24, 2024
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)