Woman Allegedly Hits Cab Driver: వీడియో ఇదిగో, విమానం మిస్సయిందని క్యాబ్ డ్రైవర్‌ను చితకబాదిన మహిళ, ముంబై పోలీసులు ఏమన్నారంటే..
ముంబై విమానాశ్రయంలో ఇటీవల షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఓ మహిళ క్యాబ్ డ్రైవర్‌ను దుర్భాషలాడుతూ, చితకబాదింది. ఎయిర్‌పోర్టుకు ఆలస్యంగా తీసుకురావడంతో విమానం మిస్సయిందని ఆరోపిస్తూ ఇలా క్యాబ్ డ్రైవర్‌పై దాడికి పాల్పడింది. అయితే, ఇందులో డ్రైవర్ తప్పు ఏమీ లేదని ఆ మహిళే ఆలస్యంగా ఇంటి నుంచి బయలుదేరినట్లు సమాచారం
ముంబై విమానాశ్రయంలో ఇటీవల షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఓ మహిళ క్యాబ్ డ్రైవర్‌ను దుర్భాషలాడుతూ, చితకబాదింది. ఎయిర్‌పోర్టుకు ఆలస్యంగా తీసుకురావడంతో విమానం మిస్సయిందని ఆరోపిస్తూ ఇలా క్యాబ్ డ్రైవర్‌పై దాడికి పాల్పడింది. అయితే, ఇందులో డ్రైవర్ తప్పు ఏమీ లేదని ఆ మహిళే ఆలస్యంగా ఇంటి నుంచి బయలుదేరినట్లు సమాచారం.
దీంతో సదరు మహిళపై చర్యలు తీసుకోవాలని ముంబయి ట్రాఫిక్ పోలీసులను కోరారు. బాధిత క్యాబ్ డ్రైవర్ వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని నెటిజన్లు సూచించారు. వైరల్ వీడియోపై ముంబై ట్రాఫిక్ పోలీసులు స్పందిస్తూ, " సంఘటన జరిగిన సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఈ విషయాన్ని నివేదించమని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను " అని ట్వీట్ చేశారు.
Woman Allegedly Hits Cab Driver at Airport
Request you to report the matter at nearest police station where the incident occurred.
— Mumbai Traffic Police (@MTPHereToHelp) January 24, 2025
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 28, 2025 11:31 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

