తల్లిదండ్రుల శృంగారంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబడియాతో పాటు సమయ్ రైనా, ఇతరులకు జాతీయ మహిళా కమిషన్ (NCW) సమన్లు (NCW Summons Ranveer Allahabadia) జారీ చేసింది. ఫిబ్రవరి 17వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో తెలిపింది. జాతీయ మానవ హక్కుల కమీషన్ సభ్యురాలు ప్రియాంక్ కనూంగ్ వీడియోను డిలీట్ చేయాలని డిమాండ్ చేశారు.దీంతో ఈ వివాదాస్పద వీడియోను వారు యూట్యూబ్ నుంచి తొలగించారు. ఇండియాస్ గాట్ లేటెంట్ ఎపిసోడ్‌లో రణ్‌వీర్ .. తల్లితండ్రులపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ర్‌బైసెప్స్ గయ్‌గా గుర్తింపు పొందిన అల్లాబడియా ఓ షోలో తల్లితండ్రుల శృంగారం గురించి కంటెస్టెంట్‌కి తీవ్ర అభ్యంతరకరమైన ప్రశ్న వేశాడు.ఆ ప్రశ్నపై సోషల్ మీడియాతో పాటు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అల్లాబడియాతో పాటు ఇండియాస్ గాట్ లేటెంట్ షోలో పాల్గొన్న ఇతర వ్యక్తులపై కూడా అస్సాం, ముంబైలో పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు నమోదు అయ్యాయి.ఇక పోడ్‌కాస్టర్ రణ్‌వీర్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 45 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్‌లో కోటి మందికిపై సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
NCW Summons Ranveer Allahabadia:
National Commission for Women (NCW) summons YouTuber Ranveer Allahabadia, Samay Raina, and others over derogatory remarks; hearing scheduled for February 17 pic.twitter.com/m7Y9Xmez5q
— ANI (@ANI) February 11, 2025
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)