తెలంగాణలో మహబూబాబాద్ స్టేషన్ సమీపంలో వేగంగా వెళుతున్న గూడ్స్ ట్రైన్ రెండుగా విడిపోయింది.. మధ్యలో లింక్ తెగిపోవడంతో కొన్ని బోగీలు వెనకే ఉండిపోయాయి. సిగ్నల్ పడకున్నా రైలు స్లో అవుతోంది ఏంటని చూసిన గార్డ్ కు బోగీల మధ్య లింక్ తెగిపోయి కనిపించింది. దీంతో లోకో పైలట్ ను అప్రమత్తం చేయగా.. అతను రైలును నిలిపేసి అధికారులకు సమాచారం అందించారు. రైల్వే అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం డోర్నకల్ రైల్వే స్టేషన్ నుంచి కాజీపేటకు వెళ్తున్న గూడ్స్ రైలు మహబూబాబాద్ స్టేషన్ సమీపంలో రెండుగా విడిపోయింది.
బోగీల మధ్య లింక్ తెగడంతో వేగంగా వెళుతున్న గూడ్స్ రైలు ఇంజన్ నుంచి కొన్ని పెట్టెలు దూరమయ్యాయి. గూడ్స్ గార్డ్ వాకీటాకీ ద్వారా లోకో పైలట్ కు సమాచారం అందించి రైలును ఆపేశాడు. విషయం తెలిసి ఆ మార్గంలో వెళ్లాల్సిన రైళ్లను ఉన్నతాధికారులు నిలిపివేశారు. దీంతో ప్రమాదం తప్పినట్లయింది. ముందుకు వెళ్లిపోయిన రైలును వెనక్కి తీసుకువచ్చి లింక్ కలిపాక అధికారులు రైలును పంపించారు. కాగా, ఈ ఘటనపై అంతర్గత విచారణ జరిపిస్తామని, లింక్ తెగిపోవడానికి కారణాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
Goods Train Breaks Into 2 Near Mahabubabad Station,
Telangana: A goods train broke into two near Mahabubabad station, causing a 45-minute halt and delaying several passenger trains. Officials repaired and rejoined the separated coaches, resuming operations pic.twitter.com/1MTzWNv6o8
— IANS (@ians_india) December 3, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)