వరంగల్ జిల్లాలో బ్యాంకు ఉద్యోగి దారుణ హత్యకు గురైన ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని రంగంపేట (Rangampet)లో కాకతీయ గ్రామీణ బ్యాంక్‌ (Kaktiya Grameen Bank)లో విధులు నిర్వర్తిస్తున్న రాజమోహన్ (Rajamohan) దారుణ హత్యకు గురయ్యాడు. ఏకంగా అతడి కాళ్లు, చేతులను తాళ్లతో బంధించి దుండగులు అతి కిరాతకంగా కత్తులు, ఇనుప రాడ్లతో హతమార్చారు.

అనంతరం మృతదేహాన్ని రోడ్డుపై ఉన్న కారులో వదిలి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే, నిందితులు పారిపోతున్న దృశ్యాలు అక్కడునున్న సీసీ కెమెరా (CC Cameras)లో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

షాకింగ్ సీసీటీవీ ఫుటేజ్, ఆర్టీసీ బస్సు నుంచి జారిపడిన విద్యార్థిని, కాళ్ళపై నుండి బస్సు వెళ్లడంతో తీవ్రగాయాలు

Unidentified persons killed retired Bank Manager

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)