ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి సమావేశం ముగిసింది. మిత్రపక్షాలతో కలిసి సుధీర్ఘ చర్చలు జరిపిన అనంతరం.. ప్రతిపక్షంలోనే కొనసాగాలని ఇండియా కూటమి తీర్మానం చేసుకుంది. బీజేపీ, నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఏకతాటిపై పోరాటం చేస్తాయని ఖర్గే పేర్కొన్నారు. బీజేపీని గద్దె దింపేందుకు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ప్రతిపక్షానికి మద్దతిచ్చిన దేశ ప్రజలందరికీ కూటమి తరపున ధన్యవాదాలు తెలిపారు. వీడియో ఇదిగో, నరేంద్ర మోదీ నివాసంలో ముగిసిన ఎన్డీయే కూటమి సమావేశం, పూర్తిస్థాయి కేంద్ర మంత్రి మండలితోనూ ప్రధాని భేటీ కానున్నట్లు వార్తలు
ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ అఖిలేష్ యాదవ్, తేజస్వీ యాదవ్, ఆప్ నేత సంజయ్ సింగ్, రాఘవ్ చద్దా, డీ రాజా, ఏచూరి హాజరయ్యారు. ఇండియా కూటమిలోకి కొత్త పార్టీలను ఆహ్వానిస్తున్నాం. ఈ ఎన్నికల ఫలితాలు మోదీకి వ్యతిరేకంగా వచ్చాయి. నైతికంగా ప్రధాని ఓడిపోయారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం అన్ని పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.
Here's Video
#WATCH | Delhi: Congress president Mallikarjun Kharge says "...This is our decision and we altogether agreed on these points and we will keep up with the promises we have given to the people..." pic.twitter.com/Cl2CHmWUEg
— ANI (@ANI) June 5, 2024
#WATCH | Congress president Mallikarjun Kharge says, " The constituents of INDIA bloc thank the people of India for the overwhelming support received by our alliance . The people's mandate has given befitting reply to the BJP and their politics of hate, corruption. This is a… pic.twitter.com/MAsOHP2YBD
— ANI (@ANI) June 5, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)