India's First Glass Bridge: దేశంలోనే మొట్టమొదటి గ్లాస్ బ్రిడ్జ్ వీడియో ఇదిగో, బంగాళాఖాతం మధ్యన ఏర్పాటు చేసిన స్టాలిన్ సర్కారు
తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా గ్లాస్ బ్రిడ్జ్ (Indias First Glass Bridge)ను నిర్మించింది. బంగాళాఖాతం మధ్యన ఏర్పాటు చేసిన ఈ గాజు వంతెన (Glass Bridge)ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ సోమవారం ప్రారంభించారు.
తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా గ్లాస్ బ్రిడ్జ్ (Indias First Glass Bridge)ను నిర్మించింది. బంగాళాఖాతం మధ్యన ఏర్పాటు చేసిన ఈ గాజు వంతెన (Glass Bridge)ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ సోమవారం ప్రారంభించారు. కన్యాకుమారి (Kanyakumari) తీరంలో వివేకానంద స్మారక మండపానికి 77 మీటర్ల దూరంలో 2000 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి హయాంలో తిరువళ్లువర్ విగ్రహాన్ని (Thiruvalluvar statue) ప్రతిష్టించారు. ఆ విగ్రహ ప్రతిష్టాపన జరిగి జనవరి 1వ తేదీకి 25 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో వివేకానంద మండపం, తిరువళ్లువర్ విగ్రహాన్ని కలిపేలా దేశంలోనే మొదటిసారి సముద్రం మధ్యన ఈ గాజు వంతెనను తమిళనాడు ప్రభుత్వం నిర్మించింది.
77 మీటర్ల పొడవు ఉన్న ఈ అద్దాల వంతెన.. 10 మీటర్ల వెడల్పుతో నిర్మించగా.. గ్లాస్ బ్రిడ్జి నిర్మాణ వ్యయం.. రూ.37 కోట్లు అయింది. దీనికి గత ఏడాది మే 24వ తేదీన శంకుస్థాపన చేయగా ఇటీవలే పూర్తయింది. రేపటి నుంచి సిల్వర్‌జూబ్లీ వేడుకల నేపథ్యంలో ఈ గాజు వంతెనను సీఎం స్టాలిన్ ప్రారంభించారు.ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తమిళనాడు ప్రభుత్వం రెండు రోజులపాటు సిల్వర్‌జూబ్లీ వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది.
2024 సంవత్సరంలో చివరి సూర్యోదయం.. చూసేందుకు ఎగబడ్డ జనం.. మీరూ ఆ వీడియోలు చూడండి..
India's First Glass Bridge
India gets first glass bridge over sea in Kanyakumari, Tamil Nadu.#TamilNadu CM @mkstalin unveils the classic glass bridge that connects the 133 ft tall Saint Tiruvalluvar statue and the Vivekananda Rock Memorial. pic.twitter.com/dw1nyfYcSy
— All India Radio News (@airnewsalerts) December 31, 2024
#WATCH | Kanniyakumari: Tamil Nadu Chief Minister MK Stalin inaugurated a glass bridge over the sea, connecting Tiruvalluvar Statue and Vivekananda Rock Memorial, in Kanniyakumari yesterday
(Source: Tamil Nadu DIPR) pic.twitter.com/86src7srTI
— ANI (@ANI) December 31, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 01, 1970 05:30 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

