తెలంగాణలోని జనగామ జిల్లాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. జిల్లా కేంద్రంలో సూర్యాపేట రోడ్డులో అత్యంత ర్యాష్ డ్రైవింగ్ తో కార్ హల్ చల్ చేయడం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. మద్యం మత్తులో నలుగురు యువకులు అత్యంత వేగంతో కారు నడపడంతో అదుపు తప్పి రోడ్డుకు అడ్డం తిరుగుతూ దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో పాదచారులు గాయపడగా, షోరూమ్ ముందుట పార్కింగ్ ప్లేస్ లో ఉన్న వాహనాలు ధ్వంసమయ్యాయి.

ఈ బుడ్డోడిలా అదృష్టం వరించదంటూ షాకింగ్ వీడియో షేర్ చేసిన సజ్జనార్, రెప్పపాటులో ఘోర రోడ్డు ప్రమాదం నుంచి బయటపడిన పిల్లవాడు

జనగామ వైపు నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి, అదుపుతప్పి బజాజ్ షోరూమ్ ముందు పార్కింగ్ ప్లేస్ లో ఉన్న వాహనాలపైకి దూసుకొని పోగా 9 ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి.అక్కడ నిల్చున్న వాహనదారులు తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. కానీ కొంతమందికి స్వల్ప గాయాలు కాగా వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్టుగా స్థానికులు తెలిపారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Accident Caught on Camera in jangaon

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)