సూడాన్ లో మంగళవారం నాడు రాజధాని ఖార్టూమ్ శివార్లలో సైనిక విమానం కూలిపోయి, అనేక మంది అధికారులు, పౌరులు మరణించారని సైన్యం తెలిపింది. సూడాన్ లోని ఆర్మీ ఎయిర్ బేస్ లో మంగళవారం రాత్రి ఈ విమాన ప్రమాదం (Sudanese Military Plane Crash) చోటుచేసుకుంది. టేకాఫ్ కు ప్రయత్నిస్తూ కుప్పకూలిన తర్వాత మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో పైలట్ తో పాటు విమానంలోని ప్రయాణికులలో పదిమంది దుర్మరణం పాలయ్యారని సూడాన్ అధికార వర్గాలు తెలిపాయి. అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

రన్ వేపై ల్యాండ్ అవుతూ తిరగబడిన విమానం.. తీవ్రంగా గాయపడిన 18 మంది ప్రయాణికులు.. కెనడాలో ఘటన.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో!

విమానాశ్రయంలోని అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపు చేసి, పలువురు ప్రయాణికులను కాపాడారు. ఖార్టూమ్ సమీపంలోని వాది సీద్నా ఆర్మీ ఎయిర్ బేస్ లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో నుంచి గాయాలతో బయటపడ్డ ప్రయాణికులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా, ప్రాథమిక దర్యాఫ్తులో విమానం టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

మంగళవారం ఆలస్యంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో, ఏప్రిల్ 2023 నుండి పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF)తో యుద్ధంలో ఉన్న సూడాన్ సైన్యం, వైమానిక స్థావరం నుండి టేకాఫ్ సమయంలో విమానం కూలిపోయిందని, సైనిక సిబ్బంది మరియు పౌరులు ఇద్దరూ మరణించారని మరియు గాయపడ్డారని తెలిపింది.దక్షిణ డార్ఫర్ రాజధాని నైలాలో ఒక యుద్ధ విమానాన్ని కూల్చివేసినందుకు పారామిలిటరీ రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF) బాధ్యత వహించిన ఒక రోజు తర్వాత ఈ సంఘటన జరగడం గమనార్హం.

Sudanese military plane crashes near Khartoum

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)