క్రీడలు
Yuzvendra Chahal: అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన యుజవేంద్ర చాహల్‌, తరువాతి బంతికే వికెట్ తీసి కసి తీర్చుకున్న రాజప్థాన్ రాయల్స్ స్పిన్నర్, వీడియో వైరల్
Hazarath Reddyఫీల్డ్‌లో ఎప్పుడూ ప్రశాంతంగా కన్పించే యుజవేంద్ర చాహల్‌.. లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం కోపంతో ఊగిపోయాడు. లక్నో ఇన్నింగ్స్‌ 18 ఓవర్‌ వేసిన చాహల్‌ ఐదో బంతిని ఫుల్‌ ఆఫ్‌ సైడ్‌ వేశాడు. అయితే ఆనూహ్యంగా అంపైర్‌ ఆ బంతిని వైడ్‌గా ప్రకటించాడు.
IPL 2022, PBKS vs GT: ఉత్కంఠపోరులో గుజరాత్ థ్రిల్లింగ్ విక్టరీ, చివరి రెండుబాల్స్ సిక్స్‌లు కొట్టిన తెవాటియా, లాస్ట్ ఓవర్‌లో మలుపుతిరిగిన మ్యాచ్, వరుస విక్టరీలతో జోష్‌లో గుజరాత్
Naresh. VNSఐపీఎల్‌లో సూపర్ మజా వచ్చే మ్యాచ్ జరిగింది. గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ చివరివరకు ఉత్కంఠగా సాగింది. లాస్ట్ రెండు బాల్స్ సిక్స్ లు కొట్టి గుజరాత్‌కు సూపర్ విక్టరీ అందించాడు తెవాటియా. గుజరాత్ గెలవాలంటే చివరి ఓవర్లో 19 పరుగులు.. చివరి రెండు బంతుల్లో 12 పరుగులు అవసరం.. అలాంటి సమయంలో రాహుల్ తెవాటియా వరుసగా సిక్సర్లు బాది గుజరాత్‌ను గెలిపించాడు.
Rishabh Pant: ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో భారీ షాక్‌, స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసిన కారణంగా ఢిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌కు రూ. 12 లక్షలు జరిమానా
Hazarath Reddyవరుస ఓటములతో నిరాశలో కూరకుపోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు మరో భారీ షాక్‌ తగిలింది. స్లో ఓవర్‌ రేటు మెయింటెన్‌ చేసిన కారణంగా ఐపీఎల్‌ నిర్వాహకులు ఢిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌కు జరిమానా విధించారు. నిర్ణీత సమయంలో తమ బౌలింగ్‌ కోటా పూర్తి చేయనందున పంత్‌కు 12 లక్షల రూపాయల ఫైన్‌ విధించారు.
DC vs LSG, IPL 2022: లక్నో సూపర్‌ జెయింట్స్‌ హ్యాట్రిక్‌ విజయం, డికాక్‌ మెరుపులతో సునాయాసంగా విజయతీరాలకు చేరిన కొత్త ఫ్రాంచైజీ
Hazarath Reddyఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లుగా గుర్తింపు పొందిన చెన్నై సూపర్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ బోణీ కొట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న చోట కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్‌ జెయింట్స్‌ హ్యాట్రిక్‌ విజయం నమోదు చేసుకుంది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఢిల్లీ హిట్టర్లను కట్టడి చేసిన లక్నో.. డికాక్‌ మెరుపులతో సునాయాసంగా విజయతీరాలకు చేరింది.
Yuzvendra Chahal: ఆ తాగుబోతు 15వ అంతస్తు నుంచి నన్ను వేలాడదీశాడు, సంచలన వ్యాఖ్యలు చేసిన లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్
Hazarath Reddyటీంమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్.. తనపై జరిగిన హత్యాయత్నాన్ని, ఒళ్లు గగుర్పొడిచే ఘటన గురించి వెల్లడించాడు. బెంగళూరుతో మ్యాచ్ అనంతరం జరిగిన పార్టీలో ‘ఆ తాగుబోతు ఆటగాడు’ తథేకంగా తనవైపే చూశాడని, తనను రమ్మని పిలిచి హోటల్ 15వ అంతస్తు నుంచి తనను వేలాడేశాడని చెప్పాడు.
IPL 2022, KKR vs MI Highlights: హ్యట్రిక్ విన్ కొట్టిన కోల్‌కతా, కుమ్మేసిన కమిన్స్, ముంబైపై ఘనవిజయం సాధించిన కేకేఆర్, వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ఓడిపోయిన ముంబై
Naresh. VNSపీఎల్ 2022 (IPL 2022) సీజన్ 15లో భాగంగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians), కోల్ కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో ముంబైపై కోల్ కతా ఘన విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 162 పరుగుల టార్గెట్ ను కోల్ కతా జట్టు 16 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి చేధించింది. దీంతో 5 వికెట్ల తేడాతో ముంబైపై గెలుపొందింది.
IPL 2022: రూ.6.5 కోట్లు పెట్టి కొంటే గల్లీ క్రికెట్‌ కంటే దారుణంగా ఆడుతున్నాడు, అభిషేక్‌ శర్మపై విమర్శలు గుప్పిస్తున్న ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు
Hazarath Reddyఅభిషేక్‌ శర్మపై ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. "హైదరాబాద్‌ తీరు మారదు. రూ. 6.5 కోట్లు పెట్టి అభిషేక్‌ శర్మను ఎందుకు కొన్నారో.. గల్లీ క్రికెట్‌ కంటే దారుణంగా ఆడుతున్నాడు. ఎస్‌ఆర్‌హెచ్‌కు రూ. 6.5 కోట్లు దండగ’’ అని అభిమానులు మండిపడుతున్నారు
IPL 2022: కోహ్లీ అవుట్, ఎగిరి గంతేసిన యజువేంద్ర చహల్‌ భార్య, కసి ఆ విధంగా తీర్చుకున్నారా అంటూ నెటిజన్ల ట్వీట్, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Hazarath Reddyరాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్తాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. ఆర్సీబీ స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి... . అనవసరపు సింగిల్‌కు ప్రయత్నించి అనూహ్య రీతిలో అవుటైన సంగతి తెలిసిందే.
IPL 2022: దుమ్మురేపిన బెంగుళూరు, రాజస్థాన్‌పై అద్బుత విజయం సాధించిన రాయల్ ఛాలెంజర్స్, చివర్లో మెరుపులు మెరిపించిన షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్
Hazarath Reddyరాజస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అద్భుత విజయం సాధించింది. రాజస్థాన్ విసిరిన 170 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆ జట్టుకు డుప్లెసిస్ (29), అనూజ్ రావత్ (26) మంచి ఆరంభమే అందించారు. అయితే ఇద్దరూ భారీ స్కోర్లు చేయకుండానే వెనుతిరిగారు.
Ross Taylor: క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కివీస్‌ స్టార్‌ బ్యాటర్‌ రాస్‌ టేలర్‌, సొంత గ్రౌండ్‌లో మ్యాచ్‌ ద్వారా కెరీర్‌కు గుడ్ బై, ఘనంగా వీడ్కోలు పలికిన న్యూజీలాండ్ టీం
Hazarath Reddyకివీస్‌ స్టార్‌ బ్యాటర్‌ రాస్‌ టేలర్‌ నెదర్లాండ్స్‌తో మూడో వన్డేతో క్రికెట్‌ నుంచి రిటైరయ్యాడు. ఆఖరి మ్యాచ్‌లో అతడు 14 పరుగులే చేసినా.. వన్డేలో ఘన విజయం సాధించిన న్యూజిలాండ్‌..టేలర్‌కు ఘనమైన వీడ్కోలు పలికింది. 16 ఏళ్ల సుదీర్ఘ అంతర్జాతీయ కెరీర్‌లో రాస్‌కిది 450వ మ్యాచ్‌ కావడం విశేషం.
IPL 2022: హైదరాబాద్‌కు ఏమైంది, వరుసగా రెండో మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో పరాజయం, సన్‌రైజర్స్‌ బ్యాటర్ల భరతం పట్టిన లక్నో బౌలర్ అవేశ్‌ ఖాన్‌
Hazarath Reddyఐపీఎల్‌ 15వ సీజన్‌ తొలి పోరులో రాజస్థాన్‌ చేతిలో ఓడిన హైదరాబాద్‌.. సోమవారం జరిగిన రెండో పోరులో (SRH vs LSG Stat Highlights, IPL 2022) సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 12 పరుగుల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ చేతిలో ఓడింది
IPL 2022: దుమ్మురేపిన గుజరాత్ టైటాన్స్, వరుసగా రెండో విక్టరీ సాధించిన గుజరాత్, అదరగొట్టిన బౌలర్స్, రిషబ్ పంత్ పోరాడినా దక్కని గెలుపు
Naresh. VNSఢిల్లీ కేపిటల్స్ పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. 14 పరుగుల తేడాతో ఢిల్లీని చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. 172 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 157 పరుగులే చేసింది.
IPL 2022: ఆండ్రీ రసెల్‌ విధ్వంసం, పంజాబ్‌పై ఘన విజయం సాధించిన కేకేఆర్‌, 14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించిన కోలకతా నైట్ రైడర్స్
Hazarath Reddyపంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్‌ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆండ్రీ రసెల్‌ (31 బంతుల్లో 70, 2 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో కేకేఆర్‌ 14.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. 51 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన రసెల్‌ మెరుపులు మెరిపించాడు.
IPL 2022: అరుపులతో హడలెత్తించిన గౌతమ్ గంభీర్, లక్నో సూపర్‌ జెయింట్స్‌ విజయం తర్వాత గౌతం గంభీర్ సెలబ్రేషన్స్ వైరల్
Hazarath Reddyఐపీఎల్‌-2022లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ బోణీ కొట్టింది. గురువారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో లక్నో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో డగౌట్‌లో కూర్చోన్న లక్నో సూపర్‌ జెయింట్స్‌ మెంటార్ గౌతమ్ గంభీర్ తమ జట్టు మ్యాచ్‌ గెలవగనే తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాడు.
IPL 2022: ఎంత పనిచేశావయ్యా రాహుల్, షూని అలా పిచ్ మధ్యలో వదిలేస్తావా, డికాక్ షూ తీసుకువస్తున్న వీడియో వైరల్
Hazarath Reddyఐపీఎల్‌ 2022లో భాగంగా సీఎస్‌కే, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌ సమయంలో కేఎల్‌ రాహుల్‌ తొలి ఓవర్‌లోనే తన షూను పోగొట్టుకున్నాడు. వాస్తవానికి మ్యాచ్‌ జరుగుతున్న ముంబైలో అధిక వేడిమి కారణంగా కేఎల్‌ రాహుల్‌కు చెమట విపరీతంగా వచ్చింది.
IPL 2022: ఉత్కంఠ రేపిన మ్యాచ్, 6 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను చిత్తు చేసిన లక్నో సూపర్‌ జెయింట్స్‌, ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారిగా ఆరంభ రెండు మ్యాచ్‌లను కోల్పోయిన చెన్నై
Hazarath Reddyరెండు సూపర్‌ పవర్‌ల మధ్య జరిగిన పోరులో లక్నో సూపర్‌ జెయింట్స్‌దే (LSG vs CSK Stat Highlights, IPL 2022) పైచేయి అయింది. ఇక ఐపీఎల్‌ చరిత్రలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ మొదటిసారిగా తమ ఆరంభ రెండు మ్యాచ్‌లను కోల్పోయింది.
Pornstar Kendra Lust: మహ్మద్‌ షమిపై పోర్న్ స్టార్ ప్రశంసలు, ఎందుకు అభినందించిందో అర్ధంకాని అయోమయంలో ఫ్యాన్స్
Hazarath Reddyగుజరాత్‌ టైటాన్స్‌ పేసర్‌ మహ్మద్‌ షమిని అమెరికన్‌ పోర్న్‌స్టార్‌ కెండ్రా లస్ట్‌ ప్రశంసలతో ముంచెత్తింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెలరేగిన షమి (3/25) జట్టు విజయంలో కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే.
Rahul Mankad Dies: భారత క్రికెట్‌ దిగ్గజం వినూ మన్కడ్‌ కుమారుడు రాహుల్‌ మన్కడ్‌ మృతి, అనారోగ్యంతో బాధపడుతూ లండన్‌లో కన్నుమూత
Hazarath Reddyభారత క్రికెట్‌ దిగ్గజం వినూ మన్కడ్‌ కుమారుడు, మాజీ క్రికెటర్‌ రాహుల్‌ మన్కడ్‌ (66) కన్నుమూశాడు. అనారోగ్యంతో బాధపడుతూ లండన్‌లో తుదిశ్వాస విడిచాడు. వినూ మన్కడ్‌ మూడో కుమారుడు రాహుల్‌ 1972 నుంచి 85 వరకు రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ప్రాతినిధ్యం వహించాడు.
IPL 2022: కోల్‌కతాపై బెంగళూరు విజయం, నాలుగు వికెట్లతో కోల్‌కతాను కట్టడి చేసిన డిసిల్వా
Hazarath Reddyరాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు పాయింట్ల ఖాతా తెరిచింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన స్వల్ప స్కోరింగ్‌ మ్యాచ్‌లో (RCB vs KKR Stat Highlights, IPL 2022) బెంగళూరు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇది ఆర్‌సీబీకి తొలి విజయం కాగా ఆరంభ మ్యాచ్‌లో చెన్నైని ఓడించిన కేకేఆర్‌కు మొదటి ఓటమి
Virat Kohli: విరాట్ కోహ్లీనే మళ్లీ నంబర్ వన్, వరుసగా ఐదో ఏడాదీ భారత్‌ తరఫున అత్యంత విలువైన సెలెబ్రిటీగా రికార్డు, రూ. 1404 కోట్ల బ్రాండ్‌ వాల్యూతో అగ్రస్థానం
Hazarath Reddyకొన్నాళ్లుగా ఫామ్‌లో లేకపోయినా, జట్టు కెప్టెన్సీ కోల్పోయినా విరాట్‌ కోహ్లీ బ్రాండ్‌ ఇమేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. భారత్‌ తరఫున అత్యంత విలువైన సెలెబ్రిటీల జాబితాలో వరుసగా ఐదో ఏడాదీ కోహ్లీనే నెంబర్‌వన్‌గా నిలిచాడు. 2021 ఏడాదికిగాను డఫ్‌ అండ్‌ ఫెల్ఫ్స్‌ సంస్థ ప్రకటించిన భారత మోస్ట్‌ వాల్యుబుల్‌ సెలెబ్రిటీల్లో విరాట్‌.. రూ. 1404 కోట్ల బ్రాండ్‌ వాల్యూతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు.