Sports
Tokyo Paralympics 2020: పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట, భారత్‌కు తొలి స్వర్ణ పతకం అందించిన అవని లేఖారా, టోక్యోలో ఏడుకు చేరిన భారత్ పతకాల మొత్తం సంఖ్య
Hazarath Reddyటోక్యో వేదికగా జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకాల పంట పండుతోంది. పారాలింపిక్స్‌లో (Tokyo Paralympics 2020) భారత్‌కు తొలి స్వర్ణ పతకం లభించింది. మహిళల షూటింగ్‌ 10 మీటర్ల విభాగంలో విజయం సాధించి అవని లేఖారా గోల్డ్‌ మెడల్‌ గోల్డ్‌ మెడల్‌ (Avani Lekhara’s Gold) కైవసం చేసుకుంది. పారాలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన తొలి భారత మహిళగా అవని లేఖారా చరిత్ర సృష్టించింది.
Bhavina Patel Wins Silver Medal: పారా ఒలంపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం, రజతం సాధించిన భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనాబెన్, ఫైనల్లో చైనా క్రీడాకారిణి యింగ్ ఝో చేతిలో 0-3 తేడాతో భవీనా ఓటమి
Hazarath Reddyటోక్యోలో జరుగుతున్న పారా ఒలంపిక్స్‌లో భారత టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి భవీనాబెన్ రజతం దక్కించుకున్నారు. ఫైనల్‌లోకి దూసుకెళ్లిన ఆమె భారత్ నుంచి ఈ స్థాయి వరకూ చేరిన తొలి ప్యాడ్లర్‌గా నిలిచి చరిత్ర సృష్టించారు. ఈరోజు జరిగిన ఫైనల్స్‌లో ఆమె చైనాకు చెందిన వరల్డ్ నంబర్ వన్ క్రీడాకారిణి యింగ్ ఝోతో పోటీపడ్డారు.
Nishad Kumar Wins Silver Medal: భారత్‌ ఖాతాలో మరో పతకం, పురుషుల హై జంప్‌ T47 విభాగంలో రజత పతకం సాధించిన నిషద్‌ కూమార్‌
Hazarath Reddyటోక్యో వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్‌ లో భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. పురుషుల హై జంప్‌ T47 విభాగంలో నిషద్‌ కూమార్‌ రజత పతకం సాధించాడు. 24 మంది సభ్యుల అథ్లెటిక్స్ జట్టులో నిషిద్‌ కూమార్‌ 2.06 మీటర్లు ఎత్తు ఎగిరి రెండో స్థానం లో నిలిచాడు.
Vinod Kumar Wins Bronze Medal: పారాలింపిక్స్‌లో మరో పతకం, డిస్కస్‌త్రో విభాగంలో కాంస్య పతకం సాధించిన వినోద్‌ కుమార్‌, భారత్‌కు ఇప్పటివరకు మొత్తంగా మూడో పతకాలు
Hazarath Reddyపారాలింపిక్స్‌లో పతకాల పరంపర కొనసాగుతోంది. పురుషుల హైజంప్‌ T47 పోటీల్లో భారత అథ్లెట్‌ నిషాద్‌ కుమార్‌ 2.06 మీటర్ల ఎత్తు దూకి రజతం సాధించిన విషయం తెలిసిందే.
India vs England 3rd Test 2021: మూడో టెస్టులో భారత్ ఓటమి, ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఇంగ్లండ్, రెండో ఇన్నింగ్స్‌లో 278 పరుగులకే ఆలౌటైన టీంఇండియా, సిరీస్‌ 1-1తో సమం
Hazarath Reddyఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో టీంఇండియా ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో 278 పరుగులకే ఆలౌటైంది. దాంతో ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో ఘన విజయం (ENG Win By An Innings And 76 Runs) సాధించింది. ఈ క్రమంలోనే సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
Blast at Kabul Airport: ఆఫ్ఘ‌న్ల‌ను చంప‌డం ద‌య‌చేసి ఆపండి, ట్విట్టర్ ద్వారా వేడుకున్న ఆఫ్ఘ‌నిస్థాన్ క్రికెట‌ర్లు ర‌షీద్ ఖాన్‌, మ‌హ్మ‌ద్ న‌బీ, ఆఫ్ఘ‌న్ల‌ను ఆదుకోవాల‌ని ప్ర‌పంచ నేత‌ల‌ను వేడుకుంటున్న స్టార్ క్రికెటర్లు
Hazarath Reddyఆఫ్ఘ‌నిస్థాన్( Afghanistan ) పేలుళ్ల‌పై ఆ దేశ స్టార్ క్రికెట‌ర్లు ర‌షీద్ ఖాన్‌, మ‌హ్మ‌ద్ న‌బీ ట్విటర్ ద్వారా స్పందించారు. ఈ దాడుల‌పై వాళ్లు తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. గురువారం సాయంత్రం జ‌రిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో వంద మందికిపైగా మ‌రణించిన విష‌యం తెలిసిందే. దీనిపై ర‌షీద్ ఖాన్ స్పందిస్తూ.. కాబూల్ మ‌ళ్లీ ర‌క్త‌మోడుతోంది.
Shoaib Akhtar: నీకంత సీన్ లేదని ఇద్దరు ఆంటీలు నన్ను రెచ్చగొట్టేవారు, వారి వల్లే నాలో కసి పెరిగి మరింతగా ప్రాక్టీస్ చేశా, తన కెరీర్ అనుభవాలను చెప్పుకొచ్చిన పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌
Hazarath Reddyరావల్పిండి ఎక్స్‌ప్రెస్‌గా ప్రసిద్ధి చెందిన పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ (Former Pakistan Speedster Shoaib Akhtar) తన కెరీర్ లో జరిగిన ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. ఓ స్పోర్ట్స్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఫాస్ట్ బౌలర్ మాట్లాడుతూ తాను స్టార్‌ క్రికెటర్‌గా ఎదగడానికి ఇద్దరు ఆంటీలు (opens up on story of two aunts) కారణమని తెలిపాడు.
IND vs ENG 3rd Test: తొలి ఇన్నింగ్స్‌లో 432 పరుగులకు ఇంగ్లాండ్ ఆలౌట్, 354 పరుగుల ఆధిక్యంలో ఆతిథ్య జట్టు, ప్రారంభమైన భారత్ రెండో ఇన్నింగ్స్
Team Latestlyలీడ్స్‌లోని హెడింగ్లీ వేదికగా ఇంగ్లండ్‌ మరియు ఇండియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ జట్టు భారీ స్కోర్ సాధించింది. 132.2 ఓవర్లు ఆడిన ఇంగ్లీష్ టీమ్ తొలి ఇన్నింగ్స్ లో 432 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా ఆ జట్టుకు భారత్ మీద 354 పరుగుల ఆధిక్యం లభించింది...
IND vs ENG 3rd Test: మూడో టెస్టులో తొలిరోజుకే కుప్పకూలిన టీమిండియా, 78 పరుగులకే ఆలౌట్; ప్రారంభమైన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్, మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్ వివరాల కోసం ఇక్కడ చూడండి
Vikas Mandaలీడ్స్‌లోని హెడింగ్లీ వేదికగా ఇంగ్లండ్‌ మరియు ఇండియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బ్యాట్స్ మెన్ చేతులెత్తేశారు. బుధవారం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా 40.4 ఓవర్లలోనే కేవలం 78 పరుగులకే ఆలౌట్ అయ్యారు. 105 బంతులు ఆడిన రోహిత్ శర్మ 19 పరుగులు...
India Win Lord’s Test: లార్డ్స్ టెస్టులో అద్భుతం చేసిన భారత్, 151 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం, ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో టీమిండియా ముందంజ
Vikas Mandaచివరి రోజు 272 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లండ్ జట్టు డ్రా కోసమే ఆడాలనుట్టుగా ఆట మొదలుపెట్టింది. అయితే పరుగులేమి చేయకుండానే ఇంగ్లండ్ ఒపెనర్లు ఇద్దరూ డకౌట్లుగా వెనుదిరిగారు. ఈ అవకాశాన్ని భారత్ వదులుకోలేదు....
IPL 2021: అయోమంలో అప్ఘాన్ క్రికెట‌ర్లు, ర‌షీద్ ఖాన్‌, న‌బీలు ఐపీఎల్‌కు అందుబాటులో ఉంటారని తెలిపిన సన్‌రైజ‌ర్స్, తమ దేశాన్ని కాపాడాలంటూ ట్విట్టర్లో ట్వీట్ చేసిన స్పిన్నర్ ర‌షీద్ ఖాన్
Hazarath Reddyత‌మ టీమ్‌కు ఆడాల్సిన ర‌షీద్ ఖాన్‌, మ‌హ్మ‌ద్ న‌బీ మాత్రం యూఏఈలో జ‌రిగే ఐపీఎల్‌కు అందుబాటులో ఉంటార‌ని స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ( SRH CEO) సోమ‌వారం ప్ర‌క‌టించింది.
IND vs ENG 2nd Test 2021 Day1 Highlights: రెండో టెస్ట్ మొదటిరోజు అదరగొట్టిన ఓపెనర్స్, కేఎల్ రాహుల్ సెంచరీ నాటౌట్, భారీస్కోర్ దిశగా పయనిస్తున్న భారత్, తొలిరోజు ఆట ముగిసే సమయానికి 276/3 స్కోర్ చేసిన టీమిండియా
Team Latestly1952లో లార్డ్స్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్‌ తరఫున చివరిసారిగా వినోద్‌ మన్కడ్‌-పంకజ్‌ రాయ్‌ల జోడి వందకు పైగా పరుగుల ఓపెనింగ్‌ భాగస్వామ్యాన్ని నెలకొల్పిన తర్వాత వారి సరసన రోహిత్‌-రాహుల్‌ల జోడి చేరింది....
Chris Cairns Health Update: చావుబతుకుల్లో నాటి ప్రపంచ ఉత్తమ ఆల్ రౌండర్, గుండె సంబంధిత వ్యాధితో వెంటిలేటర్‌పై న్యూజిలాండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ కెయిన్స్‌, చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపిన వైద్యులు
Hazarath Reddyన్యూజిలాండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ కెయిన్స్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కొన్నాళ్లుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోన్న 51 ఏళ్ల కెయిన్స్‌ (Former New Zealand All-rounder Chris Cairns) ప్రస్తుతం కాన్‌బెర్రాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Hockey Player Rajini Meet CM YS Jagan: ఏపీ హాకీ క్రీడాకారిణి రజనీకి రూ. 25లక్షల నగదు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన భారత మహిళా హాకీ ప్లేయర్
Hazarath Reddyటోక్యో ఒలింపిక్స్‌లో ప్రతిభ చూపిన భారత మహిళల జట్టు హాకీ క్రీడాకారిణి.. ఏపీకి చెందిన ఇ.రజనీ బుధవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా (Hockey Player Rajini Met CM YS Jagan) కలిశారు.ఈ సందర్భంగా సీఎం జగన్‌ హాకీ ప్లేయర్ రజనీకి (Etimarupu Rajini) పలు ప్రోత్సాహకాలు ప్రకటించారు. రూ. 25లక్షల నగదుతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
Naresh Tumda: భారత్‌కు క్రికెట్లో ప్రపంచ కప్ సాధించి పెట్టాడు, చివరకు కూలీగా బతుకుతున్నాడు, ప్రభుత్వం తనకు ఉద్యోగం కల్పించి ఆదుకోవాలని వేడుకుంటున్న 2018 బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్‌ విన్నర్ ఆటగాడు నరేష్ తుమ్డా
Hazarath Reddy2018 లో బ్లైండ్ క్రికెట్ వరల్డ్ కప్‌ సాధించిన బృందంలో భాగమైన నరేష్ తుమ్దా (Naresh Tumda) నేడు కూరగాయలు అమ్ముకుంటున్నాడు. ప్రభుత్వం నుంచి సహాయం అందక జీవనోపాధి కోసం రోజు కూలిగా మారి పొట్ట పోషించుకుంటుకున్నాడు.
Tokyo 2020: బంగారు పతకంతో నీరజ్‌పై రూ.కోట్ల వర్షం, టోక్యోలో పతకం సాధించిన భారత ఆటగాళ్లకు బీసీసీఐ భారీ నజరానా, 13 ఏళ్ల తరువాత ఒలంపిక్స్‌లో జాతీయ గీతం ఆలాపన, ఈ ఏడాది 7కు చేరిన భారత్ పతకాల సంఖ్య
Hazarath Reddyబజ్‌రంగ్‌ కంచు ‘పట్టు’కు జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా స్వర్ణ సంబరం తోడడంతో పతకాల సంఖ్యలో లండన్ ను భారత్ (India At Tokyo Olympics 2020) దాటేసింది. విశ్వక్రీడల్లో భారత్‌కు ఇదే అత్యుత్తమ పతక ప్రదర్శన కావడం విశేషం. అంతకుముందు ఉత్తమంగా 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ రెండు రజతాలు, నాలుగు కాంస్యాలు సాధించింది.
Neeraj Chopra: 11 ఏళ్లకే 90 కేజీల బరువు, పసిడి పతక విజేత నీరజ్ చోప్రా జీవితం గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు, టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాపై ప్రత్యేక కథనం, తమ రాష్ట్ర ఆటగాడి విజయంతో డ్యాన్స్ వేసిన హర్యానా హోం మంత్రి
Hazarath Reddyనీరజ్ 11 సంవత్సరాల వయస్సులో 90 కిలోల బరువుతో (chubby kid to Gold medal in Tokyo Olympics) ఊబకాయంతో ఇబ్బంది పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని ఖండ్రా నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న పానిపట్ లోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) సెంటర్ దగ్గర జిమ్ లో చేర్పించారు. నీరజ్ కొన్ని కిలోలు తగ్గితే చాలని వారు కోరుకున్నారు.
Tokyo 2020: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం, జావెలెన్ త్రోలో దేశానికి పసిడి పతకం అందించిన నీరజ్ చోప్రా, ఫైనల్‌లో 87.58 మీటర్లు విసిరి ఘనత సాధించిన నీరవ్
Hazarath Reddyవందేళ్ల కలను నిజం అవుతూ.. టోక్యో ఒలింపిక్స్‌లో (Tokyo Olympics 2020) భారత్‌కు తొలి స్వర్ణం లభించింది. జావెలెన్ త్రోలో నీరజ్ చోప్రా దేశానికి స్వర్ణ పతకం (Neeraj Chopra Wins Historic Gold Medal) అందించాడు. ఫైనల్‌లో 87.58 మీటర్లు విసిరి ఈ ఘనత సాధించాడు.