క్రీడలు

JaiShah for ICC Chairman: ఐసీసీ ఛైర్మన్‌గా జైషా?...నెక్ట్స్ టార్గెట్ బీసీసీఐ చీఫ్ పదవేనా?

Arun Charagonda

ఐసీసీకి త్వరలో కొత్త అధ్యక్షుడు రానున్నారా? ఆ అధ్యక్షుడు బీసీసీఐ కార్యదర్శి జై షానా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి(ICC) వార్షిక సమావేశాలు రేపటి(జూలై 19)

Latest ICC T20I Rankings: లేటెస్ట్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్, టాప్ టెన్‌ బౌలర్లలో భారత్ ఆటగాళ్లకు దక్కని చోటు, బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో 6వ ప్లేసులోకి దూసుకొచ్చిన యశస్వి జైస్వాల్

Vikas M

ఇటీవల జింబాబ్వేతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అద్భుతంగా రాణించిన భారత యంగ్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మాన్ గిల్ ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అదరగొట్టారు. ముఖ్యంగా డాషింగ్ ఓపెనర్ జైస్వాల్ నాలుగు స్థానాలు మెరుగుపరచుకొని 6వ ర్యాంకులో నిలిచాడు. భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన శుభమాన్ గిల్ కూడా ఏకంగా 36 స్థానాలు ఎగబాకి 37వ ర్యాంక్‌లో నిలిచాడు.

Paris Olympics List: పారిస్ ఒలింపిక్స్ కోసం భార‌త ఆట‌గాళ్ల లిస్ట్ విడుద‌ల‌, అంద‌రి చూపు అత‌నిపైనే..మహిళా షాట్ పుటర్ అబా కథువా పేరు మిస్సింగ్

VNS

ప్రపంచ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఈవెంట్లలోనూ భారత అథ్లెట్లు రాణిస్తున్నారు. ఈ క్రమంలో పారిస్ ఒలింపిక్స్‌లో పలు అంశాల్లో పతకాలపై అంచనాలున్నాయి. రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్, బ్యాడ్మింటన్, హాకీ, ఆర్చరీతో పాటు మరికొన్ని క్రీడాంశాల్లో పతకాలపై భారత్‌ ఆశలు పెట్టుకున్నది. టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశం 119 మంది సభ్యుల బృందాన్ని పంపింది.

Dhammika Niroshana Shot Dead: భార్యాపిల్లల ముందే శ్రీలంక మాజీ క్రికెటర్ దారుణ హత్య, తుపాకీతో కాల్చి చంపిన దుండగుడు,

Vikas M

శ్రీలంక మాజీ క్రికెటర్ ధమ్మిక నిరోషణ (41) భార్యాపిల్లల ముందే దారుణహత్యకు గురయ్యాడు. మంగళవారం రాత్రి అంబలంగోడాలోని అతడి నివాసంలో ఓ దుండగుడు తుపాకీతో కాల్చి చంపాడు. హత్యకు పాల్పడ్డ దుండగుడిని గుర్తించేందుకు పోలీసులు రంగంలోకి దిగి, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

61 Runs in 2 Overs: వీడియో ఇదిగో, అసలైన ఛేజింగ్ అంటే ఇదే, ఆఖరి రెండు ఓవర్లలో 61 రన్స్ కొట్టి సంచలన విజయం సాధించిన ఆస్ట్రియా

Hazarath Reddy

టీ10 మ్యాచుల్లో ప‌సికూన ఆస్ట్రియా (Austria) జ‌ట్టు సంచలన రికార్డుతో మెరిసింది. రొమేనియా (Romania)తో జ‌రిగిన మ్యాచ్‌లో ఆఖ‌రి రెండు ఓవ‌ర్లలో 61 ర‌న్స్ బాదేసి క్రికెట్‌లో కొత్త రికార్డు నెలకొల్పింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Shubman Gill New Record: విరాట్ కోహ్లీ తర్వాత కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ సంచలన రికార్డు, ఓ ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో విదేశీ గడ్డపై నాలుగు విజయాలు సాధించిన కెప్టెన్‌గా అరుదైన ఘనత

Vikas M

జింబాబ్వేతో (Zimbabwe) జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత జట్టు 4-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్‌లో అనూహ్య ఓటమి చవిచూసిన భారత్ (Team India).. ఆ తర్వాత నాలుగు మ్యాచ్‌ల్లో గెలుపొందింది.తాజాగా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది.

13 Runs From 1 Ball: ఒక బాల్‌కి 13 పరుగులు, ప్రపంచ రికార్డు నెలకొల్పిన భారత యువ సంచలనం యశస్వీ జైస్వాల్, వీడియో ఇదిగో..

Vikas M

Pakistan Kid Imitates Jasprit Bumrah: పాకిస్తాన్ జస్ప్రీత్‌ బుమ్రాని చూశారా, అచ్చుగుద్దినట్లు బుమ్రాలా బౌలింగ్‌ చేస్తూ ఆశ్చర్యపరుస్తున్న దాయాది దేశం కిడ్

Vikas M

టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌ యాక్షన్‌ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్తాన్ పిల్లాడు అచ్చుగుద్దినట్లు బుమ్రాలా బౌలింగ్‌ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. వీడియోలో చిన్నారి బుమ్రా బౌలింగ్‌ శైలిని పోలి ఉండటంతో పాటు అచ్చం బుమ్రాలాగే యార్కర్లు సంధిస్తున్నాడు.

Advertisement

Harbhajan Yuvraj and Raina Viral Dance: యువీ, భజ్జీ, రైనా డ్యాన్స్ వీడియో ఇదిగో, ఇతరుల వైకల్యాన్ని ఎత్తిచూపేలా ఇంత చెత్తగా వ్యవహరిస్తారా అంటూ విమర్శలు

Hazarath Reddy

సంతోషాన్ని సెలబ్రేట్‌ చేసుకునే క్రమంలో యువీ, భజ్జీ, రైనా కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. ‘‘లెజెండ్స్‌ క్రికెట్‌లో పదిహేను రోజుల పాటు ఒళ్లు హూనమైంది. శరీరంలోని ప్రతీ అవయవం నొప్పితో విలవిల్లాడుతోంది’’ బాలీవుడ్‌ స్టార్‌ విక్కీ కౌశల్‌ పాట తౌబ.. తౌబకు తమ స్టెప్పులు ఇలాగే ఉంటాయంటూ కుంటుతూ నడుస్తున్నట్లుగా అభినయించారు.

Harbhajan Singh on Viral Video: వైరల్ వీడియోపై వివరణ ఇచ్చిన హర్భజన్ సింగ్, ఎవరి మనసులు అయినా గాయపడి ఉంటే చింతిస్తున్నామని వెల్లడి

Hazarath Reddy

విక్కీ కౌశల్ యొక్క 'బాడ్ న్యూజ్'లోని 'తౌబా తౌబా' పాటలో తాను, ఇతర భారత ఛాంపియన్స్ క్రికెటర్లు డ్యాన్స్ స్టెప్పులు వేస్తున్న వీడియోను షేర్ చేసిన తర్వాత హర్భజన్ సింగ్ సోషల్ మీడియాలో ఒక వివరణ ఇచ్చాడు.

Police Complaint Against Ex-Indian Cricketers: వికలాంగులను ఎగతాళి చేస్తూ వీడియో, యువరాజ్‌తో సహా టీమిండియా మాజీ క్రికెటర్లపై పోలీసులకు ఫిర్యాదు

Hazarath Reddy

ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసిన వీడియోలో వికలాంగులను ఎగతాళి చేసినందుకు మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, యువరాజ్ సింగ్, గురుకీరత్ మాన్‌లపై పోలీసులకు ఫిర్యాదు నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఫర్ డిసేబుల్డ్ పీపుల్ (NCPEDP) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్మాన్ అలీ ఇక్కడి అమర్ కాలనీ పోలీస్ స్టేషన్ SHOకి ఫిర్యాదు చేశారు.

Carlos Alcaraz Wins Wimbledon: రెండోసారి వింబుల్డ‌న్ మెన్స్ టైటిల్ సొంతం చేసుకున్న యువ సంచ‌న‌లం, ఒకే ఏడాది మ‌ట్టి కోర్టులో, గ్రాస్ కోర్టులో గెలిచిన కార్లోస్ అల్క‌రాజ్

VNS

స్పెయిన్ యువ కెర‌టం కార్లోస్ అల్క‌రాజ్(Carlos Alcaraz) అంచ‌నాల‌ను అందుకుంటూ వింబుల్డ‌న్ (Wimbledon) టైటిల్‌ను ముద్దాడాడు. డిఫెండింగ్ చాంపియ‌న్‌గా బ‌రిలోకి దిగిన ఈ యంగ్‌స్ట‌ర్ త‌న‌ గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల సంఖ్య‌ను పెంచుకున్నాడు.

Advertisement

India vs Zimbabwe 5th T20I 2024: చెల‌రేగి ఆడిన సంజూ శాంస‌న్, జింబాబ్వేతో ఐదో టీ-20లో టీమిండియా ఘ‌న విజ‌యం, 4-1 తేడాతో సిరీస్ కైవ‌సం

VNS

టీ- 20 సిరీస్ కైవ‌సం చేసుకున్న టీమిండియా (Team India) ఆఖ‌రి మ్యాచ్‌లోనూ పంజా విసిరింది. నామ‌మాత్ర‌మైన ఐదో టీ20లో జింబాబ్వేపై 42 ప‌రుగుల తేడాతో గెలుపొందింది (India Win). భారీ ఛేద‌న‌లో భార‌త బౌల‌ర్ ముకేశ్ కుమార్(4/22) విజృంభ‌ణ‌కు ఆతిథ్య జ‌ట్టు బ్యాట‌ర్లు విల‌విల‌లాడారు.

Barbora Krejcikova Wins Wimbledon: వింబ‌ల్డ‌న్ ఉమెన్స్ ట్రోఫీ విజేత‌గా బార్బొరా క్రెజికోవా, కెరీర్‌లోనే తొలి వింబుల్డ‌న్ ట్రోఫీని కైవ‌సం చేసుకున్న సంచ‌ల‌నం

VNS

వింబుల్డ‌న్‌లో (Wimbledon 2024) కొత్త యువ‌రాణి కిరీటం అందుకుంది. మ‌హిళ‌ల సింగిల్స్‌లో బార్బొరా క్రెజికోవా (Barbora Krejcikova) విజేత‌గా అవ‌త‌రించింది. శ‌నివారం జ‌రిగిన ఉత్కంఠ పోరులో జాస్మినె ప‌వోలిని (Jasmine Paolini)కి షాకిచ్చి కెరీర్‌లోనే తొలి వింబుల్డ‌న్ ట్రోఫీని (Wimbledon 2024) కైవ‌సం చేసుకుంది.

IND Win By 10 Wickets: చిత‌క్కొట్టిన య‌శస్వీ జైశ్వాల్, జింబాబ్వేపై 10 వికెట్ల తేడాతో టీమిండియా గ్రాండ్ విక్టరీ, టీ-20 సిరీస్ భార‌త్ కైవ‌సం

VNS

ఆతిథ్య‌ జింబాబ్వే నిర్దేశించిన 153 ప‌రుగుల ఛేద‌న‌లో ఓపెన‌ర్లు య‌శ‌స్వీ జైస్వాల్(93 నాటౌట్)(Yashasvi Jaiswal), శుభ్‌మ‌న్ గిల్(58 నాటౌట్)లు (Shubman Gill) బౌల‌ర్ల‌పై నిర్దాక్షిణ్యంగా విర‌చుకుప‌డ్డారు. బౌల‌ర్ మారినా బంతి వెళ్లాల్సిందే బౌండ‌రీయే అన్న‌ట్టు చితక్కొట్టారు. దాంతో, మ‌రో నాలుగు ఓవ‌ర్లు ఉండ‌గానే టీమిండియా జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది.

Glenn Phillips Catch Video: సోషల్‌మీడియాను షేక్‌ చేస్తోన్న గ్లెన్‌ ఫిలిప్స్‌ క్యాచ్, కళ్లు చెదిరే విన్యాసం చేసి సిక్సర్‌ వెళ్లకుండా అడ్డుకున్న వీడియో ఇదిగో..

Hazarath Reddy

శ్రీలంక ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా డంబుల్లా సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కొలొంబో స్ట్రయికర్స్‌ ఆటగాడు గ్లెన్‌ ఫిలిప్స్‌ పట్టిన క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్‌ ఆరో ఓవర్‌లో కుశాల్‌ పెరీరా కొట్టిన భారీ షాట్‌ను ఫిలిప్స్‌ కళ్లు చెదిరే విన్యాసం చేసి సిక్సర్‌ వెళ్లకుండా అడ్డుకున్నాడు.

Advertisement

James Anderson Wicket Video: జేమ్స్ అండర్సన్ అవుట్-స్వింగింగ్ డెలివరీ వీడియో ఇదిగో, జాషువా డా సిల్వాను పెవిలియన్ సాగనంపిన ఇంగ్లండ్ స్పీడ్ స్టర్

Vikas M

ఇంగ్లండ్ జాతీయ క్రికెట్ జట్టు తరపున తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన జేమ్స్ ఆండర్సన్ ఈ ఫార్మాట్‌లో తన 704వ వికెట్‌ను సాధించాడు. అతను ట్రేడ్‌మార్క్ అవుట్-స్వింగింగ్ డెలివరీతో జాషువా డా సిల్వాను అవుట్ చేశాడు.

James Anderson Retires: నా బెస్ట్ బ్యాటర్ సచిన్, చెత్త బంతులు వేస్తే బౌండరీ లైన్ అవతలే, జేమ్స్ అండ‌ర్స‌న్ కీలక వ్యాఖ్యలు

Vikas M

తన బౌలింగ్‌ ఎదుర్కొన్న వారిలో భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ అత్యుత్తమ బ్యాటర్‌ అంటూ ఇంగ్లండ్‌ వెటరన్‌ పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో తొలి టెస్టు ద్వారా తన సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌కు వీడ్కోలు పలుకబోతున్న అండర్సన్‌ తన అనుభవాలను పంచుకున్నాడు. ‘నేను చూసిన అత్యుత్తమ బ్యాటర్లలో సచిన్‌ టెండ్కూలర్‌.

James Anderson Retires: క్రికెట్ చరిత్రలో ముగిసిన యోధుడి ప్రస్థానం, టెస్ట్‌ కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికిన జేమ్స్ అండ‌ర్స‌న్, ఎమోషనల్‌ అయిన ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్

Vikas M

ఇంగ్లండ్‌ ప్లేయర్‌ జేమ్స్ అండ‌ర్స‌న్ తన 22 ఏళ్ల సుదీర్ఘ టెస్ట్‌ కెరీర్‌కు ఘనంగా వీడ్కోలు పలికాడు. వెస్టిండీస్‌తో ఇవాళ (జులై 12) ముగిసిన టెస్ట్‌ మ్యాచ్‌ ఆండర్సన్‌ కెరీర్‌లో చివరిది. తన చివరి మ్యాచ్‌ను జిమ్మీ గెలుపుతో ముగించాడు. ఈ మ్యాచ్‌లో అతను నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్‌ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అనంతరం గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు.

Champions Trophy 2025: భారత్–పాక్ మ్యాచ్‌లకు దుబాయ్ లేదా శ్రీలంక అయితే ఒకే, చాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియా దాయాది దేశంలో కాలుపెట్టదని బీసీసీఐ స్పష్టం

Hazarath Reddy

2025 ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య పాక్ లో చాంపియన్స్ ట్రోఫీ జరగనున్న సంగతి విదితమే. అయితే పాకిస్థాన్ వేదికగా జరగబోయే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ–2025 కోసం టీమిండియా దాయాది దేశంలో కాలుపెట్టదని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేశాయి.

Advertisement
Advertisement