Sports

Paris Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం, మిక్స్‌డ్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్తల్‌ విభాగంలో కాంస్యం, అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ

Hazarath Reddy

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. మిక్స్‌డ్‌ 10 మీటర్ల ఎయిర్‌ పిస్తల్‌ విభాగంలో సరబ్‌జోత్‌ సింగ్‌, మను బాకర్‌ జోడీ దక్షిణ కొరియాతో పోటీపడి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మనుబాకర్‌ జోడి 16 పాయింట్లు సాధించగా.. దక్షిణ కొరియా ఆటగాళ్లు 10 పాయింట్లు సాధించారు.

IND Win By Seven Wickets: సిరీస్ కైవసం చేసుకున్న భారత్, రెండో టీ 20లో 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించిన టీమిండియా

Vikas M

శ్రీలంక పర్యటనలో టీమిండియా మరో మ్యాచ్‌ మిగిలుండగానే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. ఆదివారం పల్లెకెలె వేదికగా వర్షం అంతరాయం కలిగించిన రెండో టీ20ని టీమ్‌ఇండియా 7 వికెట్ల తేడాతో గెలుచుకుంది. టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన లంకేయులు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేశారు.

2025 Men's Asia Cup: 34 ఏళ్ల తర్వాత ఆసియా కప్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న భారత్ , T20 ఫార్మాట్‌లోనే మ్యాచ్‌లు, 1990లో విజేతగా నిలిచిన భారత్, తర్వాత ఇదే టోర్నీ

Vikas M

2025 పురుషుల ఆసియా కప్‌కు భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది, ఇది T20 ఫార్మాట్‌లో ఆడబడుతుంది, అయితే బంగ్లాదేశ్ 2027 ఎడిషన్ టోర్నమెంట్‌ను 50 ఓవర్ల వెర్షన్‌లో నిర్వహిస్తుంది. 2023 పురుషుల ఆసియా కప్‌ను పాకిస్తాన్, శ్రీలంక హైబ్రిడ్ ఫార్మాట్‌లో నిర్వహించాయి. 50 ఓవర్ల టోర్నమెంట్‌గా ఆడబడ్డాయి, భారత్ విజేతలుగా నిలిచింది.

Rohan Bopanna Retirement: టెన్నిస్ రంగంలో భారత్‌కు షాక్, రిటైర్మెంట్ ప్రకటించిన రోహన్ బోపన్న, పారిస్ ఒలింపిక్స్ 2024 ఫ్లాప్ షో తర్వాత కీలక నిర్ణయం

Vikas M

పారిస్ ఒలింపిక్స్ 2024 పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో ఫ్రెంచ్ ద్వయం ఎడ్వర్డ్ రోజర్-వాసెలిన్ మరియు గేల్ మోన్‌ఫిల్స్‌పై ఘోర పరాజయం పాలైన తర్వాత రోహన్ బొప్పన భారతదేశం కోసం తన చివరి మ్యాచ్‌ను ఆడినట్లు ధృవీకరించారు. ఒలింపిక్ పతకం భారత్‌కు దూరమైంది.

Advertisement

Love Proposal at Paris Olympics: పారిస్ ఒలింపిక్స్ లో అంతా చూస్తుండానే తోటి అథ్లెట్ కు ల‌వ్ ప్ర‌పోజ్ చేసిన మ‌రో అథ్లెట్, వైర‌ల్ గా మారిన ల‌వ్ స్టోరీ

VNS

పారిస్ ఒలింపిక్స్ (Aris Olympics) ఓ ప్రేమజంటకు వేదికగా మారింది. ఇద్దరు అర్జెంటీనా అథ్లెట్ల లవ్ ప్రపోజల్‌తో ఈ మెగా టోర్నీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ జంటకు సంబంధించిన ఫొటోను ఒలంపిక్ గేమ్స్ అధికారిక ట్విట్టర్ అకౌంట్ షేర్ చేయడంతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియా యూజర్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు

Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ బోణి,తొలి మహిళగా చరిత్ర సృష్టించిన భాకర్, కాంస్యంతో పతకాల పట్టిక ప్రారంభం

Arun Charagonda

పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత్ బోణి కొట్టింది.మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‍లో షూటర్ మనూ భాకర్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో షూటింగ్‍ వ్యక్తిగత విభాగంలో పతకం సాధించిన తొలి భారత మహిళగా భాకర్ చరిత్ర సృష్టించింది

Asia cup 2024: ఆసియా కప్ విజేతగా శ్రీలంక మహిళ జట్టు, తొలిసారి ఆసియా కప్‌ను సొంతం చేసుకున్న శ్రీలంక

Arun Charagonda

ఆసియా కప్ విజేతగా నిలిచింది శ్రీలంక మహిళ క్రికెట్ జట్టు. ఫైనల్లో టీమిండియా మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ విధించిన 166 పరుగుల లక్ష్యాన్ని 8 బంతులు మిగిలి ఉండగానే చేధించింది. 18.4 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కొల్పోయి టార్గెట్‌ను చేధించింది శ్రీలంక.

Paris Olympics 2024: ఇవాళ భారత్ పతకాల వేట ప్రారంభించేనా? భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే, పీవీ సింధు తొలి మ్యాచ్‌కు సిద్ధం

Arun Charagonda

పారిస్ వేదికగా ఒలింపిక్స్ 2024 ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఎన్నో ఆశలతో పారిస్‌కు చేరుకున్న భారత అథ్లెట్లు తొలి రోజు పలు విభాగాల్లో ఆడిన నిరాశ పర్చారు. బాక్సర్ మను బాకర్ మాత్రం చక్కటి ప్రదర్శన కనబ్చి ఫైనల్‌కు దూసుకెళ్లింది.

Advertisement

Paris Olympics 2024: హాకీలో భారత్ బోణీ.. తొలి పోరులో 3-2తో న్యూజిలాండ్‌ పై టీమిండియా విజయం

Rudra

పారిస్‌ ఒలింపిక్స్‌ హాకీలో భారత్‌ అదిరిపోయే ఆరంభం చేసింది. తొలి పోరులో టీమిండియా 3-2తో న్యూజిలాండ్‌ పై విజయం సాధించింది.

India vs Sri Lanka, 1st T20: టీమిండియా-శ్రీలంక తొలి టీ20 మ్యాచ్... 43 పరుగుల తేడాతో శ్రీలంకపై టీమిండియా అద్భుత విజయం

Rudra

శ్రీలంకతో టీ20 సిరీస్ లో భాగంగా శనివారం జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా గెలుపుతో బోణీ కొట్టింది. పల్లెకెలెలో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీమిండియా 43 పరుగుల తేడాతో ఆతిథ్య శ్రీలంకను ఓడించింది.

Paris Olympics 2024 Opening Ceremony: అట్టహాసంగా ఒలింపిక్స్‌ ప్రారంభం.. ప్రత్యేక ఆకర్షణగా భారత్.. ఫ్లాగ్ బేరర్స్‌ గా కనువిందు చేసిన టేబుల్ టెన్నిస్ స్టార్ శరత్ కమల్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు

Rudra

విశ్వక్రీడలకు తెరలేచింది. అద్భుత క్షణం ఆవిష్కృతమైంది. గతానికి భిన్నంగా, చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో చారిత్రక సీన్‌ నది ఒడ్డును తమ దేశ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ ఫ్రాన్స్‌ ప్రారంభ వేడుకలను అదిరిపోయే రీతిలో రూపకల్పన చేసింది.

Paris 2024 Olympics: ఒలింపిక్స్ అథ్లెట్ల కోసం 2 లక్షల ఉచిత కండోమ్‌లు, యాంటీ సెక్స్ బెడ్స్ ఏర్పాటు చేసినా శృంగారం కోసం తపిస్తున్న ఆటగాళ్లు

Hazarath Reddy

పారిస్ 2024 ఒలింపిక్స్‌కు ముందు అథ్లెట్లు "సరదా" సమయాన్ని గడపకుండా "యాంటీ సెక్స్" బెడ్‌లు ఉన్నా శృంగారంలో మునిగిపోయారని తెలుస్తోంది. శృంగారం కట్టడి కోసం అథ్లెట్ల గదుల్లో తక్కువ సామర్ధ్యమున్న బెడ్‌లు అంటే.. ‘యాంటీ సెక్స్‌ బెడ్స్‌’ ఏర్పాటు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

Women’s Asia Cup T20 2024: మ‌హిళ‌ల ఆసియా క‌ప్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసి ఫైనల్‌కు చేరిన శ్రీలంక, భారత్‌తో తాడేపేడో తేల్చుకోనున్న లంక ఉమెన్స్

Hazarath Reddy

సొంత‌గ‌డ్డ‌పై జ‌రుగుతున్న మ‌హిళ‌ల ఆసియా క‌ప్‌లో శ్రీ‌లంక(Srilanka) ఫైన‌ల్లో అడుగుపెట్టింది. శుక్ర‌వారం ఆఖ‌రి ఓవ‌ర్ వ‌ర‌కూ ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌(Pakistan)పై 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Women's Asia Cup T20 2024: ఆసియా క‌ప్‌ 8వ టైటిల్‌కు అడుగు దూరంలో భారత్, సెమీఫైన‌ల్లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించిన టీమ్ ఉమెన్ ఇండియా

Hazarath Reddy

మ‌హిళ‌ల ఆసియా క‌ప్‌లో దంబుల్లా స్టేడియంలో శుక్రవారం జ‌రిగిన‌ సెమీఫైన‌ల్లో బంగ్లాదేశ్‌ను చిత్తుగా ఓడించి భార‌త జ‌ట్టు ఫైన‌ల్‌కు దూసుకెళ్లింది. తొలుత పేస‌ర్ రేణుకా సింగ్‌(3/10), రాధా యాద‌వ్‌(3/14)లు ప్ర‌త్య‌ర్థిని స్వ‌ల్ప స్కోర్‌కే క‌ట్ట‌డి చేయ‌గా.. అనంత‌రం ఓపెన‌ర్లు స్మృతి మంధానా(55 నాటౌట్), ష‌ఫాలీ వ‌ర్మ‌( 26 నాటౌట్‌)లు చిత‌క్కొట్టారు

Olympic Games Paris 2024: విశ్వక్రీడా సంబరానికి వేళాయె.. పారిస్‌ కు వెళ్ళొద్దాం.. నేటి నుంచి ఒలింపిక్స్‌ మహోత్సవం.. 117 మందితో బరిలో భారత్‌.. రాత్రి 11 గంటల నుంచి ప్రారంభోత్సవ వేడుకలు

Rudra

విశ్వక్రీడా సంబరానికి వేళైంది. ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌ కు పారిస్‌ ముస్తాబైంది. దశాబ్దం తర్వాత ఒలింపిక్స్‌ కు ఆతిథ్యమిస్తున్న పారిస్‌.. ప్రపంచ క్రీడాకారులకు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నది.

Kapil Dev Emotional Video: నువ్వో పోరాట యోధుడివి, ధైర్యంగా ఉండు, క్యాన్సర్‌తో పోరాడుతున్న అంశుమన్‌ గైక్వాడ్‌పై కపిల్‌దేవ్‌ ఎమోషనల్‌ పోస్టు ఇదిగో..

Vikas M

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ అంశుమన్‌ గైక్వాడ్‌ క్యాన్సర్‌తో పోరాడుతున్న సంగతి విదితమే. అతడు త్వరగా కోలుకోవాలని మాజీ దిగ్గజం కపిల్‌దేవ్‌ ఎమోషనల్‌ పోస్టు పెట్టాడు. మైదానంలో ఆడిన రోజులను గుర్తు చేసుకుంటూ కపిల్‌ దేవ్‌ వీడియో ఎమోషనల్ వీడియో సందేశం పెట్టాడు

Advertisement

Jayasuriya Disciplines Sri Lanka Cricketers: జుట్టు కత్తిరించుకుని నీట్‌గా ఉండండి, శ్రీలంక క్రికెటర్లకు జయసూర్య క్రమశిక్షణ క్లాసులు

Vikas M

శ్రీలంక క్రికెట్ జట్టు తాత్కాలిక కోచ్, బ్యాటింగ్ దిగ్గజం సనత్ జయసూర్య శ్రీలంక క్రికెటర్లకు క్లాస్ తీసుకున్నాడు. క్రికెట్ అనేది జెంటిల్మన్ క్రీడ అని, యువ ఆటగాళ్లకు క్రమశిక్షణ అవసరమని జయసూర్య అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లందరూ జుట్టు కత్తిరించుకుని, సాధారణ హెయిర్ స్టయిల్ ను అనుసరించాలని సూచించాడు.

Gautam Gambhir: గంభీర్ శాలరీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. లంకలో 16 రోజులకు ఎంత తీసుకోనున్నాడంటే?

Arun Charagonda

టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ నియమితులైన సంగతి తెలిసిందే. తనదైన మార్క్‌తో ముందుకుసాగుతున్నాడు గంభీర్. ముఖ్యంగా జట్టు ఎంపికలో బీసీసీఐకి తన ఆలోచన విధానంపై క్లారిటీ ఇస్తున్నారు గంభీర్. ఇప్పటికే కెప్టెన్‌గా సూర్య కుమార్ యాదవ్ ఎంపిక దగ్గరి నుండి టీమ్ కూర్పు వరకు ఎలాంటి సంకోచం లేకుండా తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పేస్తున్నారు గంభీర్.

India vs Nepal: ఆసియా క‌ప్ లో సెమీస్ కు చేరిన‌ టీమిండియా ఉమెన్స్, చివ‌రి లీగ్ మ్యాచ్ లో ఘ‌న‌ విజ‌యం, మెరిసిన షెఫాలి

VNS

మహిళల టీ20 ఆసియాకప్‌ (Womens Asia Cup T20) మెగా టోర్నీలో భాగంగా నేపాల్‌తో జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. 82 పరుగుల భారీ తేడాతో గెలుపొంది సెమీస్‌కు దూసుకెళ్లింది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయకేతనం ఎగుర వేసింది. 179 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన నేపాల్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 96 పరుగులకే పరిమితమైంది.

Sri Lanka Squad For T20I Series: భారత్‌తో మూడు టీ20లకు శ్రీలంక జట్టు ఇదిగో, కెప్టెన్‌గా చరిత్ అసలంక, లంకలో టీమిండియా ప్రాక్టీస్ వీడియో ఇదిగో..

Vikas M

టిమిండియాతో త్వరలో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌ కోసం శ్రీలంక జట్టును ప్రకటించింది. శ్రీలంక సెలక్షన్ కమిటీ.. చరిత్ అసలంక కెప్టెన్‌గా 16 మంది సభ్యులతో టీమ్‌ని ఎంపిక చేసింది. టీ20 ప్రపంచ కప్‌లో జట్టు వైఫల్యానికి బాధ్యత వహిస్తూ వానిందు హసరంగ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన సంగతి విదితమే.

Advertisement
Advertisement