క్రీడలు

ICC ODI Rankings: పాకిస్తాన్‌కు భారీ షాక్ ఇచ్చిన భారత్, ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో రెండవ స్థానానికి టీమిండియా, మూడవస్థానంలోకి వెళ్లిన పాక్, అగ్రస్థానంలో ఆస్ట్రేలియా

Hazarath Reddy

ఆసియా కప్ 2023 సూపర్ ఫోర్ దశలో అద్భుతమైన విజయాలు సాధించిన తర్వాత టీమ్ ఇండియా ICC ODI ర్యాంకింగ్స్‌లో రెండో స్థానానికి చేరుకుంది. కొలంబోలో గురువారం జరిగిన వర్చువల్ నాకౌట్ పోరులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయిన పాకిస్థాన్ జట్టు మూడో స్థానానికి పడిపోయింది.

Asia Cup 2023: వీడియో ఇదిగో, భారత్ విక్టరీ తర్వాత ప్రేమ‌దాస్ స్టేడియంలో కొట్టుకున్న ఇండియా, శ్రీలంక క్రికెట్ ఫ్యాన్స్‌

Hazarath Reddy

ఆసియాక‌ప్(Asia Cup 2023) సూప‌ర్ ఫోర్ లో శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఇండియా 41 ర‌న్స్ తేడాతో నెగ్గిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ ఆదివారం జ‌రిగే ఫైన‌ల్‌కు భార‌త్ అర్హ‌త సాధించింది. ఇదిలా ఉంటే మంగ‌ళ‌వారం రాత్రి మ్యాచ్ ముగిసిన త‌ర్వాత రెండు దేశాల‌కు చెందిన క్రికెట్ అభిమానులు కొట్టుకున్నారు.

Asia Cup IND vs SL: శ్రీలంకపై భారత్‌ విజయం.. 41 పరుగుల తేడాతో విక్టరీ కొట్టిన టీమిండియా.. శ్రీలంక 172 పరుగులకు ఆలౌట్

ahana

ఆసియా కప్‌ లో శ్రీలంకపై భారత్‌ విజయం సాధించింది. 41 పరుగుల తేడాతో టీమిండియా విజయపతాకం ఎగురవేసింది. వివరాల్లోకి వెళితే భారత్ నిర్దేశించిన 214 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన శ్రీలంక జట్టు 172 పరుగులకే కుప్పకూలింది.

Dunith Wellalage: లంక క్రికెట్‌కు దునిత్‌ రూపంలో మరో మిస్టరీ స్పిన్నర్‌, భారత టాప్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన శ్రీలంక యువ స్పిన్నర్‌

Hazarath Reddy

ఆసియా కప్‌-2023లో భాగంగా కొలొంబో వేదికగా టీమిండియాతో ఇవాళ (సెప్టెంబర్‌ 12) జరుగుతున్న సూపర్‌-4 మ్యాచ్‌లో శ్రీలంక యువ స్పిన్నర్‌ దునిత్‌ వెల్లలగే చెలరేగిపోయాడు. కెరీర్‌లో తొలిసారి ఐదు వికెట్ల ఘనత సాధించి సత్తా చాటాడు. పట్టుమని 15 మ్యాచ్‌లు కూడా ఆడని 20 ఏళ్ల వెల్లలగేను ఎదుర్కొనేందుకు టీమిండియా దిగ్గజ బ్యాటర్లు నానా తంటాలు పడ్డారు.

Advertisement

Shubman Gill Wicket Video: దునిత్ స్పిన్ మాయాజాలం, క్లీన్ బౌల్డ్ అయిన శుభమాన్ గిల్, వీడియో ఇదిగో

Hazarath Reddy

సెప్టెంబర్ 12, మంగళవారం కొలంబోలోని ఆర్.ప్రేమదాస క్రికెట్ స్టేడియంలో జరిగే ఆసియా కప్ 2023 సూపర్ ఫోర్‌లో భారత్ శ్రీలంక మధ్య పోరు మొదలైంది. భారత్ మొదట బ్యాటింగ్ చేసింది.భారత్ తమ శుభారంభాన్ని పునరావృతం చేసింది, ఎందుకంటే వారు మొదటి పది ఓవర్లలో ఏ వికెట్ కూడా కోల్పోలేదు.

Rohit Sharma Wicket Video: దునిత్ స్పిన్ మాయాజాలానికి చిక్కిన రోహిత్ శర్మ వీడియో ఇదిగో, తక్కువ ఎత్తులో వచ్చి వికెట్లను గిరాటేసిన బంతి

Hazarath Reddy

16వ ఓవర్‌లో, దునిత్ వెల్లలాగే తన అద్భుతమైన బౌలింగ్ తో భారత కెప్టెన్‌ను బోల్తా కొట్టించాడు. ఈ ఆటలో అతని మూడవ వికెట్‌ను తీసుకున్నాడు. బంతి తక్కువగా ఎత్తులో వచ్చి వికెట్లను గిరాటేసింది. రోహిత్ 48 బంతుల్లో 53 పరుగులు చేశాడు

Viral Video: ఈ వీడియో గుర్తు పట్టారా, బాల్ వికెట్లను ముద్దాడుతూ ఉంది చూడు, పాకిస్తాన్ బ్యాటర్‌కి ఆనాటి భారత్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ కౌంటర్, 27 ఏళ్ళ తర్వాత కూడా వైరల్

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వైరల్ అవుతున్న వీడియో భారత్ వర్సెస్ పాకిస్తాన్ జట్టుకు సంబంధించిన వీడియో. ఇందులో పాకిస్తాన్ బ్యాటర్ అమీర్ సోహెయిల్ భారత మాజీ పేసర్ వెంకటేష్ ప్రసాద్ బౌలింగ్ లో ఫోర్ కొట్టి బాల్ బౌండరీ వద్ద ఉంది చూడు అంటూ బ్యాట్ తో సైగ చేస్తాడు

Rohit Sharma: వన్డేల్లో 10 వేల పరుగులు మైలురాయిని దాటిన రోహిత్ శర్మ, ఈ ఘనత సాధించిన 15వ ఆటగాడిగా రికార్డు

Hazarath Reddy

కొలంబోలో శ్రీలంకతో జరిగిన వన్డే క్రికెట్‌లో అతను ఎట్టకేలకు 10000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన 15వ ఆటగాడిగా నిలిచాడు.

Advertisement

IND vs SL Asia Cup 2023: శ్రీలంకతో తలపడే భారత్ జట్టు ఇదిగో, టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, శార్దూల్ ఠాకూర్ స్థానంలో అక్షరపటేల్ ఎంట్రీ

Hazarath Reddy

ఆసియా కప్‌-2023 సూపర్‌-4లో భాగంగా శ్రీలంకతో మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. కాగా పాకిస్తాన్‌తో రిజర్వ్‌ డే మ్యాచ్‌లో ఘన విజయం సాధించిన టీమిండియా తిరిగి 15 గంటలలోపై మళ్లీ మ్యాచ్‌కు సిద్ధమైంది.ఈ మ్యాచ్ లో శార్దూల్ ఠాకూర్ కు విశ్రాంతినివ్వగా అక్షర పటేల్ తుదిజట్టులోకి వచ్చాడు.

Viral Video: చాక్లెట్ బాక్స్ ఇవ్వు అంటూ అభిమానిని ఆటపట్టించిన ధోనీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదిగో..

Hazarath Reddy

భారత క్రికెట్ లో సక్సెస్ ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నాడు. ఇటీవలే ముగిసిన యూఎస్ ఓపెన్ 2023 క్వార్టర్ ఫైనల్ పోటీలను సైతం వీక్షించాడు. అయితే అమెరికాలో ఓ అభిమాని ధోనీని కలుసుకున్న సందర్భంగా చోటు చేసుకున్న సరదా సంభాషణను క్రిక్ వాచర్ పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Kuldeep Yadav 5 Wickets Video: పాక్ బ్యాటర్ల భరతం పట్టిన కుల్‌దీప్‌ యాదవ్‌ 5 వికెట్ల వీడియో ఇదిగో, క్రికెట్‌ను ఆడటం ఆపేసినా ఈ స్పెల్‌ జీవితాంతం గుర్తుండిపోతుందటూ భావోద్వేగం

Hazarath Reddy

ఆసియాకప్‌-2023 సూపర్‌-4లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ భారీ ఓటమిని మూటగట్టుకున్న సంగతి విదితమే.భారత్‌ చేతిలో 228 పరుగుల తేడాతో పాక్‌ చిత్తైంది.పాక్‌ బ్యాటర్లను కట్టడి చేయడంలోస్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్‌ కీలక పాత్ర పోషించాడు

IND vs PAK Asia Cup 2023: వీడియో ఇదిగో, జడ్డూ భాయ్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడబోయి నొప్పితో విలవిలలాడిన పాక్ క్రికెటర్

Hazarath Reddy

ఆసియాకప్‌-2023 సూపర్‌-4లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌ భారీ ఓటమిని మూటగట్టుకున్న సంగతి విదితమే. ఈ మ్యాచ్ లో పాక్ ఆల్‌రౌండర్‌ ఆఘా సల్మాన్‌ గాయపడ్డాడు.57 పరగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 77 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

Advertisement

TSRTC MD Sajjanar: హెల్మెట్ లేకుంటే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి, పాక్ ఆటగాడు సల్మాన్ గాయపడిన వీడియో షేర్ చేసి అలర్ట్ చేసిన టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తాజాగా హెల్మెట్ లేకుంటే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయే చెప్పేందుకు క్రికెట్ మ్యాచ్ కు సంబంధించిన వీడియోని పంచుకున్నారు.

Asia Cup India vs Pakistan: పాకిస్తాన్‌పై భారత్‌ ఘన విజయం, 228 పరుగుల తేడాతో పాక్‌పై భారత్ గెలుపు..

ahana

ఆసియాకప్‌ : పాకిస్తాన్‌పై భారత్‌ ఘన విజయం. 228 పరుగుల తేడాతో పాక్‌పై భారత్ గెలుపు. 5 వికెట్లు తీసిన కుల్దీప్‌ యాదవ్‌. సెంచరీలతో రెచ్చిపోయిన విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌. హాఫ్‌ సెంచరీలతో రాణించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌.

Asia Cup 2023: వీడియో ఇదిగో, చాలా కాలం తర్వాత బుమ్రా ఖాతాలో వికెట్, వెన్నునొప్పి కారణంగా సుమారు ఏడాది కాలం జట్టుకు దూరమైన టీమిండియా ప్రధాన పేసర్‌

Hazarath Reddy

వెన్నునొప్పి కారణంగా సుమారు ఏడాది కాలం జట్టుకు దూరమైన టీమిండియా ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఎట్టకేలకు ఫామ్ లోకి వచ్చాడు. సూపర్‌-4 దశలో రిజర్వ్‌ డే అయిన సోమవారం నాటి మ్యాచ్‌లో బుమ్రా మైదానంలో దిగాడు.ఈ క్రమంలో 14 బంతుల తర్వాత.. వికెట్‌ పడగొట్టాడు.

Babar Azam Wicket Video: బాబర్ ఆజం క్లీన్ బౌల్డ్ వీడియో ఇదిగో, హార్దిక్ పాండ్యా ఫాస్ట్ డెలివరినీ సరిగా అర్థం చేసుకోలేక పోయిన పాక్ కెప్టెన్

Hazarath Reddy

ఆసియా కప్ 2023 సూపర్ ఫోర్ పోరులో పాకిస్థాన్‌పై భారత్ 357 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ సెంచరీలు చేసి భారత్‌ను భారీ స్కోర్‌కు నడిపించారు. పాకిస్తాన్ ఛేజింగ్‌కు వచ్చినప్పుడు, వారు భారతదేశం యొక్క కొత్త బంతి దాడి ముప్పును ఎదుర్కొన్నారు

Advertisement

Virat Kohli: అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో 77 సెంచరీలతో దుమ్మురేపిన కోహ్లీ, వన్డేల్లో 13000 పరుగుల మైలురాయిని దాటిన టీమిండియా దిగ్గజం

Hazarath Reddy

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా దిగ్గజం విరాట్‌ కోహ్లి సెంచరీతో మెరిశాడు. 84 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 100 పరుగులు పూర్తి చేసుకున్నాడు. కాగా వన్డేల్లో కోహ్లికిది 47వ శతకం కాగా.. అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలో కలిపి 77వది.తద్వారా సమకాలీన క్రికెటర్లెవ్వరికీ సాధ్యం కాని రీతిలో సెంచరీల రికార్డులో మరో ముందడుగు వేశాడు.

IND vs PAK Asia Cup 2023: పాకిస్తాన్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన భారత్, శతకాలతో మెరిసిన కేఎల్‌ రాహుల్‌, విరాట్ కోహ్లీ

Hazarath Reddy

ఆసియాకప్ సూపర్ 4లో భాగంగా వర్షం కారణంగా అంతరాయం కలిగినప్పటికీ భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ రిజర్వ్ డే లో గంటన్నర ఆలస్యంగా ప్రారంభం అయింది. అయితే ఓవర్లలో ఎలాంటి కోత జరగకుండా పూర్తి మ్యాచ్ జరగనుంది.

IND vs PAK Asia Cup 2023: భారత్-పాక్ మ్యాచ్ మళ్లీ ఆలస్యం, కొలంబోలో మళ్లీ వర్షంతో చిత్తడిగా మారిన ప్రేమదాస స్టేడియం

Hazarath Reddy

శ్రీలంక రాజధాని కొలంబోలో ఇవాళ కూడా వర్షం పడుతోంది. దాంతో దాయాదుల మ్యాచ్ కు వేదికపైన ప్రేమదాస స్టేడియం చిత్తడిగా మారింది. మధ్యలో ఓసారి వర్షం ఆగిపోవడంతో సిబ్బంది కవర్లు తొలగించడంతో మ్యాచ్ మొదలవుతుందన్న ఆశలు మొలకెత్తాయి.

New Zealand Squad for World Cup: విధ్వంసకర ఓపెనర్‌పై వేటు, కేన్‌ మామ సారథ్యంలో ప్రపంచకప్‌కు రెడీ అయిన 15 మంది న్యూజీలాండ్ ఆటగాళ్లు వీళ్లే..

Hazarath Reddy

భారత్‌‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును న్యూజిలాండ్‌ క్రికెట్‌ ప్రకటించింది. కేన్‌ విలియమ్సన్‌ సారథ్యంలో జట్టు ప్రపంచ కప్ ఆడనుంది. గాయం కారణంగా దాదాపు ఆరు నెలలగా జట్టుకు దూరంగా ఉంటున్న విలియమ్సన్‌.. ఇప్పడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించాడు

Advertisement
Advertisement