క్రికెట్

Vijay Hazare Trophy 2022: వరుసగా మూడో సెంచరీ నమోదు చేసిన రుతురాజ్ గైక్వాడ్, విజయ్ హజారే ట్రోఫీ 2022 ఫైనల్‌ మ్యాచ్‌లో చెలరేగిన బ్యాటర్

Hazarath Reddy

రుతురాజ్ గైక్వాడ్ విజయ్ హజారే ట్రోఫీ 2022 ఫైనల్‌లో సెంచరీతో తన చక్కటి ఫామ్‌ను కొనసాగించాడు, ఇది టోర్నమెంట్‌లో అతనికి మూడోది. సౌరాష్ట్ర vs మహారాష్ట్ర ఫైనల్‌లో బ్యాటింగ్ చేసిన రైట్ హ్యాండర్ 125 డెలివరీలలో మూడు అంకెల మార్క్ను చేరుకున్నాడు. అతను 131 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 108 పరుగుల వద్ద ఔటయ్యాడు.

Rajeshwari Gayakwad: వీడియో, దుకాణదారుడిని కొట్టిన భారత మహిళా క్రికెటర్ రాజేశ్వరి గయక్వాడ్, ఆమె స్నేహితురాళ్లు, సీసీటీవీ పుటేజీ వైరల్

Hazarath Reddy

భారత మహిళా క్రికెటర్ రాజేశ్వరి గయక్వాడ్, ఆమె స్నేహితులు సూపర్ మార్కెట్ వద్ద వాగ్వాదానికి దిగారు. సిబ్బందితో కొంత వాగ్వాదం తర్వాత రాజేశ్వరి స్నేహితులు దుకాణదారుడిని కొట్టడం కనిపించింది. రిపోర్టు ప్రకారం, సిసిటివి ఫుటేజీ వైరల్ అయిన తర్వాత రెండు పార్టీలు సమస్యను పరిష్కరించాయి. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

Virat Kohli: విరాట్ కోహ్లీ మరో సంచలన రికార్డు, మూడు సోషల్‌ మీడియా ఖాతాలలో 50 మిలియన్ల ఫాలోవర్లను కలిగిన ఏకైక క్రికెటర్‌గా గుర్తింపు

Hazarath Reddy

టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి సోషల్ మీడియాలో మరో ఘనత సాధించాడు. ఫేస్‌బుక్‌లో విరాట్‌ పాలోవర్ల సంఖ్య 50 మిలియన్లకు చేరింది. తద్వారా విరాట్‌ కోహ్లి ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ట్విటర్‌, ఇనస్ట్రాగమ్‌, ఫేస్‌బుక్‌ మూడు సోషల్‌ మీడియా ఖాతాలలో 50 మిలియన్ల ఫాలోవర్లను కలిగి ఉన్న తొలి క్రికెటర్‌గా కోహ్లీ రికార్డులకెక్కాడు.

PAK vs ENG: పాక్‌లో 13 మంది ఇంగ్లండ్ ఆటగాళ్లకు అంటుకున్న అంతుచిక్కని వైరస్, అందరూ ఇంటి లోపలే ఉండాలని తెలిపిన వైద్యులు

Hazarath Reddy

మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రావల్పిండి వేదికగా పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. చారిత్రాత్మక టెస్ట్‌కు ముందు, బెన్ స్టోక్స్, పలువురు ఇతర ఆటగాళ్లు, సిబ్బంది తెలియని వైరస్ కారణంగా అస్వస్థతకు గురవుతున్నారు. ఇంటి లోపల ఉండమని వైద్యులు సలహా ఇచ్చారు. ఈ వ్యాధితో ఆటకు ముందు ఆటగాళ్ళు చివరి ప్రాక్టీస్ సెషన్‌ను కోల్పోతారు.

Advertisement

Danish Kaneria Slams BCCI: అంబటి రాయుడుని నాశనం చేశారు, ఇప్పుడు శాంసన్‌కు కూడా అన్యాయం చేస్తున్నారు, బీసీసీఐపై మండిపడిన పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా

Hazarath Reddy

Notice to BCCI President Roger Binny: బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నెలకే రోజర్ బిన్నీకి షాక్, మ్యాచ్‌ల ప్రసార హక్కులు స్టార్ స్పోర్ట్స్‌ కు ఇవ్వడంపై ఎథిక్స్ ఆఫీసర్ నోటీసులు, కోడలు కోసమే అలా చేశారంటూ ఫిర్యాదు

Naresh. VNS

భారత్‌లో బీసీసీఐ మ్యాచ్‌ల (BCCI Matches) ప్రసార హక్కులు ఉన్న స్టార్ స్పోర్ట్స్‌లో రోజర్ బిన్నీ కోడలు మయంతి లాంగర్ (Mayanthi Launger) పనిచేస్తోంది. ఇది కాన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రస్ట్ కిందకే వస్తుందని మధ్యప్రదేశ్ క్రికెట్ సంఘానికి చెందిన సంజీవ్ గుప్తా (Sanjeev Gupta) ఫిర్యాదు చేశాడు.

Lankan Cricketers Marriage: ఒకే రోజు పెళ్లి చేసుకున్న ముగ్గురు శ్రీలంక క్రికెటర్లు.. ఆఫ్ఘనిస్థాన్ తో వన్డే సిరీస్ ఆడుతున్న లంక.. సిరీస్ మధ్యలోనే పెళ్లి బాజాలు.. కొలంబోలో వేర్వేరు ప్రాంతాల్లో వివాహాలు

Rudra

శ్రీలంక క్రికెట్ లో ఆశ్చర్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఒకే రోజు ముగ్గురు క్రికెటర్లు వైవాహిక జీవితంలోకి ప్రవేశించారు. పథుమ్ నిస్సంక, కసున్ రజిత, చరిత్ అసలంక నేడు కొలొంబో నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో పెళ్లి చేసుకున్నారు.

Ruturaj Gaikwad 7 Sixes Video: ఒకే ఒవర్‌లో ఏడు సిక్సర్లు బాదిన రుతురాజ్ గైక్వాడ్, ఆరు బంతుల్లో 43 పరుగులు పిండుకున్న మహారాష్ట్ర ఓపెనింగ్ బ్యాటర్

Hazarath Reddy

విజయ్ హజారే ట్రోఫీ 2022లో సంచలనం నమోదైంది. మహారాష్ట్ర ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఉత్తరప్రదేశ్‌పై డబుల్ సెంచరీ సాధించాడు. అంతే కాకుండా మరో అద్భుతాన్ని సాధించాడు. ఒకే ఓవర్‌లో ఏడు సిక్సర్లు కొట్టాడు.

Advertisement

Sanju Samson Fans Protest: సంజూ శాంసన్‌ను ఇండియా టీంలోకి తీసుకోవాల్సిందే, FIFA ప్రపంచకప్ 2022లో బ్యానర్లతో మద్ధతుగా నిలుస్తున్న అభిమానులు

Hazarath Reddy

సంజూ శాంసన్ అభిమానులు భారత్ మ్యాచ్‌లు,సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా ప్రస్తుతం జరుగుతున్న FIFA ప్రపంచ కప్ 2022లో కూడా అతనికి మద్దతునిస్తున్నారు. అభిమానులు ప్రత్యేక బ్యానర్‌లను ప్రదర్శించడం, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కోసం సందేశాలు ఇవ్వడం కనిపించింది,

India vs New Zealand, 2nd ODI: ఆటను ఆపేసిన వరుణుడు.. 4.5 ఓవర్ల వద్ద ఆగిన ఆట.. భారత్‌కు ఈ మ్యాచ్ కీలకం.. మ్యాచ్ కొనసాగడం కష్టమే!

Rudra

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ మధ్య హమిల్టన్‌లోని సెడాన్‌ పార్క్‌లో జరుగుతున్న రెండో వన్డేకు వరుణుడు అడ్డు తగిలాడు. 4.5 ఓవర్ల వద్ద వర్షం ప్రారంభం కావడంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. ఆట ఆగిపోయే సమయానికి టీమిండియా వికెట్ నష్టపోకుండా 22 పరుగులు చేసింది.

Virat Kohli Fitness Video: వైరల్ వీడియో, జిమ్‌లో పరుగులు పెడుతున్న విరాట్‌ కోహ్లీ, ఫిట్‌నెస్‌కి సంబంధించిన క్లిప్ వైరల్

Hazarath Reddy

విరాట్‌ కోహ్లీ ఫిట్‌నెస్‌కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలో బంగ్లాదేశ్‌ టూర్‌ వెళ్లనున్న నేపథ్యంలో జిమ్‌లో చమటోడుస్తున్నాడు. ఈ మేరకు వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. ఈ వీడియోలో ట్రెడ్‌మిల్‌పై పరుగులు తీశాడు. అనంతరం చొక్కా లేకుండా బరువులు లాగుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

India vs New Zealand: న్యూజిలాండ్‌తో మొదటి వన్డేలో టీమిండియా ఘోర పరాజయం, ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన కివీస్,మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ

Hazarath Reddy

న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా పరాజయవ పాలైంది. కివీస్‌ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ధావన్‌ సేన ఓటమిని మూటగట్టుకుంది. బ్యాటర్లు రాణించినప్పటికీ బౌలర్లు విఫలం కావడంతో భారత జట్టుకు పరాజయం తప్పలేదు.

Advertisement

IND vs NZ 1st ODI: మళ్లీ నిరాశ పరిచిన భారత వికెట్ కీపర్ పంత్.. న్యూజిలాండ్ తో తొలి వన్డేలో ఫెయిల్.. ఫార్మాట్ మారినా ఆట మారడం లేదని నెటిజన్ల మండిపాటు

Rudra

భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఫార్మాట్ మారినా అతని ఆట మాత్రం మారడం లేదు. న్యూజిలాండ్ పై ఆడిన రెండు టీ20ల్లోనూ పేలవ షాట్లతో వికెట్ పారేసున్నాడు.

Yuvraj Singh: యువ‌రాజ్ సింగ్‌కు నోటీసులు జారీ చేసిన గోవా ప్రభుత్వం, మోర్జిమ్‌లో ఉన్న విల్లా రిజిస్ట్రేష‌న్ చేయ‌కుండానే వాడుకుంటున్న‌ట్లు నోటీసులో వెల్లడి

Hazarath Reddy

భారత మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్‌కు గోవా ప‌ర్యాట‌క శాఖ నోటీసులు జారీ చేసింది. మోర్జిమ్‌లో ఉన్న విల్లా రిజిస్ట్రేష‌న్ చేయ‌కుండానే వాడుకుంటున్న‌ట్లు యువీపై ఫిర్యాదు న‌మోదు అయ్యింది. ఈ కేసులో డిసెంబ‌ర్ 8వ తేదీన విచార‌ణ‌కు హాజ‌రుకావాలంటూ టూరిజం శాఖ ఆదేశించింది

IND vs NZ: న్యూజీలాండ్-భారత్ మూడో టీ20 మ్యాచ్ టై, 1-0 తేడాతో సీరిస్ కైవసం చేసుకున్న టీమిండియా

Hazarath Reddy

నేపియర్‌లోని మెక్లీన్‌ పార్క్‌ వేదికగా నూజిలాండ్‌తో నేడు (నవంబర్‌ 23) జరిగిన మూడో టీ20 టైగా ముగిసింది. భారత ఇన్నింగ్స్‌ సమయంలో (9 ఓవర్ల తర్వాత 75/4) వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం టైగా ప్రకటించారు.

Vijay Hazare Trophy 2022: రికార్డులు బద్దలు, 50 ఓవర్లలో 506/2 స్కోర్ చేసిన తమిళనాడు టీం, విజయ్ హజారే ట్రోఫీ 2022లో ఓపెనింగ్ వికెట్‌కు 416 పరుగులు నమోదు చేసిన బ్యాటర్లు

Hazarath Reddy

తమిళనాడు వర్సెస్ అరుణాచల్ ప్రదేశ్ విజయ్ హజారే ట్రోఫీ 2022 మ్యాచ్ సందర్భంగా రికార్డులు బద్దలయ్యాయి . నిర్ణీత 50 ఓవర్లలో, తమిళనాడు 506/2 స్కోర్ చేసింది మరియు లిస్ట్ A క్రికెట్‌లో మొత్తం 500+ నమోదు చేసిన మొదటి జట్టుగా నిలిచింది. ఓపెనర్లు సాయి సుదర్శన్, ఎన్ జగదీశన్ ఓపెనింగ్ వికెట్‌కు 416 పరుగులు నమోదు చేశారు. మరియు వరుసగా 154 మరియు 277 స్కోర్ చేయడం ముగిసింది.

Advertisement

India vs New Zealand: రెండో టీ-20 మ్యాచ్‌లో టీమిండియా సూపర్ విక్టరీ, సెంచరీతో అదరొట్టిన సూర్యకుమార్ యాదవ్, చెలరేగిన టీమిండియా బౌలర్లు

Naresh. VNS

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమ్‌ఇండియా (India) 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత స్టార్‌ బ్యాటర్‌, మిస్టర్ 360 ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) (111: 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీతో అదరగొట్టాడు.

BCCI Sacks Chief Selector: సంచలన నిర్ణయం తీసుకున్న బీసీసీఐ, చీఫ్‌ సెలక్టర్‌తో పాటూ మొత్తం టీమ్‌ను తొలగిస్తూ నిర్ణయం, కొత్త కమిటీ కోసం దరఖాస్తుల ఆహ్వానం

Naresh. VNS

బీసీసీఐ (BCCI) సంచలన నిర్ణయం తీసుకుంది. చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మతో (Chetan Sharma) పాటూ మొత్తం సెలక్షన్ బోర్డును తొలగించింది. ఇటీవల టీ-20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) టీమిండియా ఓటమి ప్రభావంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

IND vs NZ: న్యూజిలాండ్, భారత్ మధ్య తొలి టీ20 భారీ వర్షాల కారణంగా ఆలస్యం, టైం పాస్ చేయడానికి ఫుట్‌వాలీ గేమ్‌ ఆడిన ఇరు దేశాలు ఆటగాళ్లు

Hazarath Reddy

వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్, భారత్ మధ్య జరగాల్సిన తొలి టీ20 భారీ వర్షాల కారణంగా ఆలస్యమైంది. టైం పాస్ చేయడానికి ఇరు జట్ల ఆటగాళ్లు ఫుట్‌వాలీ గేమ్‌లో పోటీ పడ్డారు. భారత జట్టులో యుజ్వేంద్ర చాహల్, సంజూ శాంసన్, దీపక్ హుడ్స్ ఉన్నారు.

Gunathilaka Rape Case: రేప్ కేసులో శ్రీలంక క్రికెటర్ కు ఊరట.. గుణతిలకకు బెయిల్ మంజూరు చేసిన సిడ్నీలోని కోర్టు

Sriyansh S

రేప్ కేసులో శ్రీలంక క్రికెటల్ గుణతిలక అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. టీ20 ప్రపంచకప్ ఆడేందుకు ఆస్ట్రేలియాకు వెళ్లిన ఆయన... సిడ్నీలో అక్కడ ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో, ఆయనను అక్కడ అరెస్ట్ చేశారు. తాజాగా అక్కడి కోర్టులో ఆయనకు ఊరట లభించింది.

Advertisement
Advertisement