క్రికెట్

IPL 2022: ముంబై పని అయిపోయినట్లేనా.. 8వ ఓటమిని మూటగట్టుకున్న రోహిత్ సేన, 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన లక్నో, సెంచరీతో చెలరేగిన కేఎల్‌ రాహుల్‌

Hazarath Reddy

ఐపీఎల్‌ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరు తెచ్చుకున్న రోహిత్‌ సేన.. ఇప్పుడు వరుసగా 8 ఓటములతో చెత్త రికార్డును కూడా మూటగట్టుకుంది. ఐదుసార్లు టైటిల్‌ చేజిక్కించుకున్న ముంబై ఇండియన్స్‌ ఈ సీజన్ లో (IPL 2022) గెలుపు కోసం నానా తంటాలు పడుతోంది.

IPL 2022: బుల్లెట్ కన్నా వేగం.. 139 కి.మీ స్పీడు, అద్భుత‌మైన యార్క‌ర్‌తో బ్యాట్స్‌మెన్‌కి చెమటలు పట్టించిన ముఖేష్ చౌద‌రి, బంతిని ఆప‌లేక కిందపడిన కిష‌న్ వీడియో వైరల్

Hazarath Reddy

ఐపీఎల్‌-2022లో భాగంగా ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే య‌వ పేస‌ర్ ముఖేష్ చౌద‌రి అద్భుత‌మైన యార్క‌ర్‌తో మెరిశాడు. ముంబై ఇన్నింగ్స్ తొలి ఓవ‌ర్‌లో ముఖేష్ చౌదరి వేసిన ఐదో బంతికి కిష‌న్‌ డిఫెన్స్ ఆడటానికి ప్ర‌య‌త్నించాడు. అయితే బంతి మిస్స్ అయ్యి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది.

IPL 2022: దటీజ్ ఫ్రెండ్‌షిప్.. పొలార్డ్ కాళ్లకు దండం పెట్టిన డ్వేన్ బ్రావో, అనంత‌రం ఆత్మీయ ఆలింగ‌నం, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

ఐపీఎల్‌-2022లో భాగంగా ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆరంభానికి ముందు ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది. ముంబై విధ్వంస‌క‌ర ఆల్ రౌండ‌ర్ కీర‌న్ పొలార్డ్ బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు వెళ్తుండ‌గా.. సీఎస్‌కే స్టార్ ఆల్‌రౌండ‌ర్ డ్వేన్ బ్రావో అత‌డి కాళ్ల‌కు దండం పెట్టాడు.

IPL 2022: వ‌య‌సు కేవ‌లం సంఖ్య మాత్ర‌మే, ధోనీ ఓ ఛాంపియ‌న్ క్రికెట‌ర్ అంటూ ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్

Hazarath Reddy

ముంబైతో జ‌రిగిన మ్యాచ్‌లో ధోనీ త‌న ఫినిషింగ్ ట‌చ్‌తో ఐపీఎల్‌కు కొత్త కిక్ తెచ్చాడు. వ‌య‌సు పెరిగినా.. త‌న ప‌వ‌ర్ గేమ్‌లో ట్యాలెంట్ త‌గ్గ‌లేద‌ని ధోనీ మ‌రోసారి నిరూపించాడు. ఎంఎస్ ధోనీ ఛాంపియ‌న్ ఇన్నింగ్స్‌పై ఇవాళ మంత్రి కేటీఆర్ త‌న ట్విట్ట‌ర్‌లో స్పందించారు.

Advertisement

IPL 2022: ధోనీకి సలాం కొట్టిన జడేజా వీడియో వైరల్, న‌డుం ముందుకు వంచి.. జీ హుజూర్ అన్న రీతిలో విష్ చేసిన చెన్నై కెప్టెన్ రవీంద్ర జ‌డేజా

Hazarath Reddy

చెన్నై సూప‌ర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. ముంబైతో జ‌రిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ధోనీ చివ‌రి ఓవ‌ర్‌లో 16 ర‌న్స్ చేసి చెన్నై జ‌ట్టుకు అద్భుత విజ‌యాన్ని అందించాడు. అదిరిపోయే ఫినిషింగ్ ట‌చ్‌తో ముంబైకి ధోనీ షాకిచ్చాడు. ఇక ఆ ఫైన‌ల్ ఓవ‌ర్ త‌ర్వాత ధోనీపై ప్ర‌శంస‌లు కురిశాయి

IPL 2022: వీడియో ఇదే..నాలుగు బంతుల్లో 16 పరుగులు, కేక పుట్టించిన ధోనీ ఫినిషింట్ ట‌చ్‌, సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న మహేంద్ర సింగ్ ధోనీ ఫినిషింగ్ టచ్ వీడియో

Hazarath Reddy

నాలుగు బంతుల్లో 16 పరుగులు కావాల్సి ఉండగా.. ఆ ద‌శ‌లో ధోనీ త‌న స్ట‌యిల్లో చెలరేగిపోయాడు. మూడో బంతికి బౌలర్‌ తల మీదుగా భారీ సిక్సర్‌ అరుసుకున్న ధోనీ.. నాలుగో బాల్‌కు ఫైన్‌ లెగ్‌ దిశగా బౌండ్రీ రాబట్టాడు. ఐదో బంతికి రెండు పరుగులు రాగా.. ఆఖరి బాల్‌కు ఫోర్‌ కొట్టిన ధోనీ తనదైన శైలిలో మ్యాచ్‌కు ఫినిషింగ్ ఇచ్చేశాడు.

IPL 2022: చాలా రోజులకు ధోనీ ఫినిషింగ్‌ టచ్‌, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌ ఆశలు గల్లంతు, ఐపీఎల్‌ 15వ సీజన్‌లో రెండో విజయం నమోదు చేసిన చెన్నై

Hazarath Reddy

మహేంద్రసింగ్‌ ధోనీ మునుపటి మెరుపులు మెరిపించడంతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ (Chennai Super Kings) ఐపీఎల్‌ 15వ సీజన్‌లో రెండో విజయం (Second Victory of Season) నమోదు చేసుకుంది.

IPL 2022: కేఎల్‌ రాహుల్‌కు మళ్లీ షాక్‌, 20 శాతం జరిమానా విధిస్తూ ఐపీఎల్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయం, జరిమానా ఎదుర్కొవడం ఇది రెండోసారి

Hazarath Reddy

లక్నో సూపర్‌ జెయింట్స్‌ సారథి కేఎల్‌ రాహుల్‌కు మళ్లీ షాక్‌ తగిలింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ)తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్‌ నిబంధనలు అతిక్రమించిన కారణంగా అతడి మ్యాచ్‌ ఫీజులో కోత పడింది. రాహుల్‌కు 20 శాతం జరిమానా విధిస్తూ ఐపీఎల్‌ మేనేజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకుంది.

Advertisement

Kieron Pollard Retires: ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టిన పొలార్డ్ వీడియో వైరల్, అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వెస్టిండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్‌

Hazarath Reddy

అంతర్జాతీయ క్రికెట్‌కు వెస్టిండీస్‌ పరిమిత ఓవర్ల కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు బుధవారం ప్రకటించాడు. కానీ టీ20, టీ10 లీగ్‌లు ఆడుతానని పొలార్డ్‌ స్పష్టం చేశాడు. 2007లో వన్డేల్లో అరంగేట్రం చేసిన పొలార్డ్‌ విధ్వంసకర ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందాడు.

IPL 2022: వారెవ్వా అనిపించిన వార్నర్, విపత్కర పరిస్థితుల్లో జూలు విదిల్చిన ఢిల్లీ, తొమ్మిది వికెట్లతో పంజాబ్‌ కింగ్స్‌ను చిత్తుచేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌

Hazarath Reddy

ఇద్దరు క్రికెటర్లు సహా ఆరుగురికి కరోనా..ఆందోళన గుప్పిట జట్టు..అసలు పంజాబ్‌తో మ్యాచ్‌ జరుగుతుందో లేదోననే అనుమానాలు..ఇలాంటి విపత్కర పరిస్థితులను అధిగమించి ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals Produce Complete Display) అద్భుత ఆటతో అదరగొట్టింది.

IPL 2022: ర‌వీంద్ర జ‌డేజా, బ్రావో ఆవేశం మాములుగా లేదండోయ్, క్యాప్‌ను తీసి నేల‌కేసి కొట్ట‌బోయి ఆగిపోయిన చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్, సోసల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

ఐపీఎల్‌-2022లో భాగంగా గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ మూడు వికెట్ల తేడాతో ఓట‌మి చెందిన సంగతి విదితమే. కాగా ఈ మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ కెప్టెన్ ర‌వీంద్ర జ‌డేజా అస‌హనానికి గురై త‌న క్యాప్‌ను తీసి నెల‌కేసి కొట్ట‌బోయాడు.

IPL 2022: డేవిడ్ వార్నర్ ఔటయ్యాడని గుక్కపెట్టి ఏడ్చిన ఇద్దరు కూతుర్లు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న డేవిడ్‌ వార్నర్‌ పోస్ట్

Hazarath Reddy

Advertisement

IPL 2022: గోల్డెన్‌ డకౌట్‌గా వెనుదిరిగిన కోహ్లీ, కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న ఫాఫ్‌ డుప్లెసిస్‌, లక్నోపై 18 పరుగుల తేడాతో ఘన విజయాన్ని ఆర్‌సీబీ

Hazarath Reddy

ఐపీఎల్‌ 2022లో ఆర్‌సీబీ అదరగొడుతుంది. ఐపీఎల్‌ 15వ సీజన్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన బెంగళూరు.. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.

IPL 2022: శ్రేయాస్‌ అయ్యర్‌కు అనుకోని షాక్.. నన్ను పెళ్లి చేసుకో..మా అమ్మ అబ్బాయిని వెతుక్కోమని చెప్పిందంటూ పెళ్లి ప్రపోజల్‌ పెట్టిన అమ్మాయి

Hazarath Reddy

‘అబ్బాయిని వెతుక్కోమని మా అమ్మ చెప్పింది. మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా శ్రేయస్‌ అయ్యర్‌?’’ అన్న అక్షరాలు రాసి ఉన్న ప్లకార్డుతో ఆమె.. అయ్యర్‌కు పెళ్లి ప్రపోజల్‌ పెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోను కేకేఆర్‌ తమ అధికారిక ట్విటర్‌లో షేర్‌ చేసింది.

IPL 2022: నీ భార్య కన్నా నిన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాం చాహల్, ధనశ్రీని ఉద్దేశించి సరాదా వ్యాఖ్యలు చేసిన రాజస్థాన్ రాయల్స్ సిబ్బంది, చహల్‌ సతీమణి ధనశ్రీ వర్మ ఇంటర్యూ వైరల్

Hazarath Reddy

ఐపీఎల్‌-2022లో యజువేంద్ర చహల్‌ అదరగొడుతున్నాడు. ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో 176 పరుగులు ఇచ్చి 17 వికెట్లు పడగొట్టాడు.కోలకతాతొ జరిగిన మ్యాచ్ లో 4 ఓవర్లలో 40 పరుగులు ఇచ్చి 5 వికెట్లు కూల్చాడు.

IPL 2022: చాహల్ హ్యాట్రిక్ వీడియో ఇదిగో, కోలకతా గెలుపు ఆశలను చంపేసిన యుజువేంద్ర చాహల్, ఉత్కంఠ పోరులో ఘనవిజయం సాధించిన రాజస్థాన్

Hazarath Reddy

ఆఖరి ఓవర్‌ వరకూ మజా పంచిన మ్యాచ్‌లో రాజస్థాన్‌దే పైచేయి అయింది. స్పిన్నర్‌ చాహల్‌ (5/40) హ్యాట్రిక్‌తో చెలరేగడంతో రాజస్థాన్‌ ఏడు పరుగులతో కోల్‌కతాను చిత్తు (Rajasthan To Close Win) చేసింది. చాహల్ వేసిన 17వ ఓవర్లో అసలైన నాటకీయత చోటుచేసుకుంది.

Advertisement

IPL 2022: కోల్‌కతాను చిత్తు చేసిన చాహర్, ఏడు పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్, మెరుపులు మెరిపించిన బట్లర్‌

Hazarath Reddy

ఆఖరి ఓవర్‌ వరకూ మజా పంచిన మ్యాచ్‌లో రాజస్థాన్‌దే పైచేయి అయింది. తొలుత బట్లర్‌ (61 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 103) సెంచరీతో కదం తొక్కగా..ఆపై స్పిన్నర్‌ చాహల్‌ (5/40) హ్యాట్రిక్‌తో చెలరేగిన వేళ సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ ఏడు పరుగులతో కోల్‌కతాను చిత్తు (Rajasthan To Close Win) చేసింది.

IPL 2022: కోహ్లీ బ్యాటింగ్‌పై షోయబ్‌ అక్తర్‌ సంచలన వ్యాఖ్యలు, సాధారణ ప్లేయర్‌గా ఫీలవ్వాలని సూచన, నువ్వు ఫామ్‌లోకి వస్తే ఆపడం ఎవరి తరం కాదని తెలిపిన రావల్పిండి ఎక్స్‌ప్రెస్

Hazarath Reddy

కోహ్లి (Royal Challengers Bangalore batsman Virat Kohli) ఆటతీరుపై అక్తర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''బాగా ఆడకపోతే కోహ్లి అయినా సరే టైమ్‌ వస్తే జట్టు నుంచి పక్కకు తప్పుకోవాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టార్‌ హోదా పనికిరాదు.

IPL 2022: ఎందుకంత ప్రస్టేషన్ ఇషాన్ కిష‌న్, అవుడయ్యాడని బౌండ‌రీ రోప్‌ను బ‌లంగా బ్యాట్‌తో బాదిన ముంబై ఇండియ‌న్స్ స్టార్ బ్యాట‌ర్, వీడియో వైరల్

Hazarath Reddy

ఐపీఎల్‌-2022లో ముంబై ఇండియ‌న్స్ స్టార్ బ్యాట‌ర్ ఇషాన్ కిష‌న్ తీవ్రంగా నిరాశ‌ప‌రుస్తున్నాడు. శనివారం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 17 బంతులు ఎద‌ర్కొన్న కిష‌న్ కేవ‌లం 13 ప‌రుగులు మాత్ర‌మే చేసి పెవిలియ‌న్‌కు చేరాడు. ముంబై ఇన్నింగ్స్ 7 ఓవ‌ర్ వేసిన మార్కస్ స్టోయినిస్ బౌలింగ్‌లో.. సింగిల్ తీయ‌డానికి ప్ర‌య‌త్నించిన కిష‌న్ బౌల్డ‌య్యాడు.

IPL 2022: చెన్నై బౌలర్లను ఊచకోత కోసిన రషీద్‌ ఖాన్, గుజరాత్‌ 3 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఘన విజయం, పాయింట్ల పట్టికలో టాప్‌లో దూసుకుపోతున్న టైటాన్స్

Hazarath Reddy

హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో.. గుజరాత్‌ టైటాన్స్‌ను విజయం వరించింది. డేవిడ్‌ మిల్లర్‌ (51 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లతో 94 నాటౌట్‌) దూకుడుకు.. రషీద్‌ (21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40) విధ్వంసం తోడవడంతో.. ఐపీఎల్‌లో (IPL 2022) ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 3 వికెట్ల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై నెగ్గింది.

Advertisement
Advertisement