Cricket

ICC U19 Cricket World Cup 2022: చరిత్ర సృష్టించిన యువ భారత్, అండర్ -19 క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో సూపర్ విక్టరీ, ఐదోసారి కప్ కొట్టిన కుర్రాళ్లు, ప్రశంసిచిన ప్రధాని

Naresh. VNS

యువ భారత్‌ సంచలనం సృష్టించింది. ఐదోసారి అండర్‌–19 వన్డే క్రికెట్‌ ప్రపంచకప్‌ టైటిల్‌ను (ICC U19 Cricket World Cup) సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌తో(England) శనివారం జరిగిన ఫైనల్లో యశ్‌ ధుల్‌ (Yash Dhull) నాయకత్వంలోని భారత జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించి విశ్వవిజేతగా నిలిచింది.

Team India Corona Case: టీమిండియాను పట్టి పీడిస్తున్న కరోనా, భారత స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌కి కరోనా, ఇప్పటికే ధావన్, గైక్వాడ్, శ్రేయాస్, సైనీ‌కి కరోనా పాజిటివ్

Krishna

టీమిండియాను కరోనా కేసులు భయపెడుతున్నాయి. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆదివారం నుంచి వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ ముందు ఈ కేసులు నమోదవుతుండటం కలవరానికి గురి చేస్తోంది. అంతేకాదు టీమిండియా ఈ నెల 16 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో మూడు టీ20ల సిరీస్‌ని ఆడాల్సి ఉంది.

Chris Gayle: ఐపీఎల్ వేలం నుంచి క్రిస్ గేల్ అవుట్, తిరిగి రప్పించేందుకు ప్రయత్నాలు షురూ, ఐపీఎల్ 2022 వేలం నుంచి తప్పుకున్న బెన్ స్టోక్స్, మిచెల్ స్టార్క్

Hazarath Reddy

గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కు ఆడిన గేల్ ఈసారి వేలం నుంచి తప్పుకోవడం అతడి అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. అలాగే, ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్, మిచెల్ స్టార్క్ పేరు కూడా జాబితాలో కనిపించలేదు.

IPL 2022 Player Auction: ఐపీఎల్-15 వేలానికి 590 మంది ఆటగాళ్లు, ఈ నెల 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా వేలం ప్రక్రియను నిర్వహించేందుకు సన్నాహాలు

Hazarath Reddy

మరికొన్ని రోజుల్లో ఐపీఎల్-15 వేలం జరగనుంది. తాజా సీజన్ కోసం ఈ నెల 12, 13 తేదీల్లో బెంగళూరు వేదికగా వేలం ప్రక్రియను నిర్వహించేందుకు ఐపీఎల్ పాలకమండలి సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో వేలంలో పాల్గొనే ఆటగాళ్ల జాబితాను విడుదల చేసింది.

Advertisement

Brendan Taylor Banned By ICC: బ్రెండన్ టేలర్‌పై మూడేళ్ల పాటు నిషేధం, అప్పుడే సమాచారాన్ని అవినీతి నిరోధక విభాగంతో పంచుకోలేదంటూ కొరడా ఝళిపించిన ఐసీసీ

Hazarath Reddy

స్పాట్ ఫిక్సింగ్ చేయాలంటూ భారత వ్యాపారవేత్త నన్ను సంప్రదించారంటూ జింబాబ్వే క్రికెటర్ బ్రెండన్ టేలర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే. బుకీలు తనను సంప్రదించినా, ఆ సమాచారాన్ని అవినీతి నిరోధక విభాగంతో (Anti Corruption Code) పంచుకోలేదంటూ జింబాబ్వే క్రికెటర్ బ్రెండన్ టేలర్ పై ఐసీసీ కొరడా ఝళిపించింది.

Ravindra Jadeja Horse Ridding: గుర్రపు స్వారీ చేస్తున్న భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, సోషల్ మీడియాలో వీడియో వైరల్

Hazarath Reddy

భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు గుర్రాలంటే చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో తన రైడింగ్ స్కిల్స్ చూపించే వీడియోలను అప్‌లోడ్ చేస్తుంటాడు. తాజాగా శుక్రవారం మరో వీడియోను అప్‌లోడ్ చేశాడు. ఇందులో గుర్రపు స్వారీ చేస్తూ కనిపిస్తాడు.

IPL 2022 Mega Auction: చెన్నై చేరిన ధోనీ.. తనకు ఇదే చివరి వేలం కావడంతో సీరియస్‌ దృష్టి

Hazarath Reddy

ఐపీఎల్ 2022 మెగా వేలానికి రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో.. వేలం (IPL 2022 Mega Auction) జరిగి ప్లేస్ ఎక్కడనే దానిపై సస్పెన్స్ వీడటం లేదు. వేలం జరిగే ప్లేస్‌పై ఇప్పటివరకు బీసీసీఐ నుంచి అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు.

Krunal Pandya's Twitter Account Hacked: టీమిండియా ప్లేయర్‌ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్, బిట్‌ కాయిన్లు ఇస్తే అకౌంట్ ఇచ్చేస్తామంటూ ట్వీట్లు, దీపక్ హుడాకు లింక్ పెట్టి నెటిజన్ల ట్వీట్లు

Naresh. VNS

టీమిండియా ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా (Krunal Pandya) ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ (Twitter account gets hacked) అయింది. గురువారం ఉదయం నుంచి ఆయన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ (Twitter Handle) నుంచి పలు రకాలు ట్వీట్లు వస్తున్నాయి. కృనాల్ పాండ్యా ట్విట్టర్ అకౌంట్ ను బిట్ కాయిన్ల కోసం అమ్మేస్తున్నట్లు ట్వీట్లు పెట్టారు హ్యాకర్లు.

Advertisement

BJP MP Gautam Gambhir COVID: బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు కరోనా, తనను కలిసిన ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని సూచన

Hazarath Reddy

India vs South Africa 2022: జై శ్రీ రామ్ అంటూ దక్షిణాఫ్రికా క్రికెటర్ కేశవ్ మహారాజ్ ట్వీట్, సఫారీలతో మూడు వన్డేల సీరిస్ ని కోల్పోయిన ఇండియా

Hazarath Reddy

భారత్ మూడు వన్గేల సీరిస్ కోల్పోయిన సంగతి విదితమే. సఫారీలు వైట్ వాష్ చేశారు. దీనిపై దక్షిణాఫ్రికా ఆటగాడు keshavmaharaj ట్వీట్ చేశాడు, ఇది అద్భుతమైప సీరిస్ అని, భారత్ ఓడిపోవడం చాలా ఆశ్చర్యపరిచిందని అన్నాడు. మేము రీఛార్జ్ చేయడానికి తదుపరి దాని కోసం సిద్ధం చేయడానికి సమయం ఆసన్నమైంది. భారత్ కూడా అదే స్థాయిలో పుంజుకుంటుందని ఆశిస్తున్నాం జై శ్రీ రామ్ అని తెలిపాడు.

Pushpa Movie Fever In Bangladesh: బంగ్లాదేశ్‌ను తాకిన పుష్ప ఫీవర్, క్రికెట్ మ్యాచులో తగ్గేదేలే మ్యానరిజంతో అదరగొట్టిన బంగ్లా బౌలర్..

Krishna

బంగ్లాదేశ్ క్రికెటర్ సైతం పుష్ప రాజ్ మేనరిజంకు ఫిదా అయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఓ బౌలర్ వికెట్ తీసిన ఆనందంలో నీ అవ్వ తగ్గేదే లే అంటూ అల్లు అర్జున్ మేనరిజాన్ని ప్రదర్శిస్తూ సంబరాలు చేసుకున్నాడు.

Taylor and Spot Fixing Approach: ఇండియా వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని బెదిరించాడు, సంచలన వ్యాఖ్యలు చేసిన జింబాబ్వే మాజీ క్రికెటర్‌ బ్రెండన్‌ టేలర్‌

Hazarath Reddy

జింబాబ్వే మాజీ క్రికెటర్‌ బ్రెండన్‌ టేలర్‌ షాకింగ్‌ విషయం వెల్లడించాడు. 2019లో ఓ భారత వ్యాపారవేత్త, తనను మ్యాచ్ ఫిక్సింగ్ చేయమని బెదిరించినట్టు, అతని నుంచి కొంత నగదు కూడా తీసుకున్నట్టుగా సోషల్ మీడియా ద్వారా స్టేట్‌మెంట్ విడుదల చేశాడు బ్రెండన్ టేలర్.

Advertisement

Ind vs SA, 3rd ODI 2022: టీమిండియాను వైట్‌వాష్ చేసిన సఫారీలు, చివరి వన్డేలోనూ టీమిండియాకు తప్పని ఓటమి, వన్డే సిరీస్ ను 3-0తో కైవసం చేసుకున్న దక్షిణాఫ్రికా

Hazarath Reddy

దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా ఒక్క విజయం లేకుండా ముగించింది. కేప్ టౌన్ లో జరిగిన చివరి వన్డేలోనూ టీమిండియాకు ఓటమి తప్పలేదు. 288 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి వరకు పోరాడినా, 4 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. 49.2 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌట్ అయింది.

Virat Kohli Viral Video: విరాట్ కోహ్లీ చేసిన పనికి షాక్ లో ఫ్యాన్స్, ఇదేం పని అంటూ సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తున్న నెటిజన్లు, వైరల్ వీడియో ఏంటో చూసేయండి..

Krishna

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వరుస వివాదాల్లో ఇరుక్కుంటున్నాడు. తాజాగా సౌతాఫ్రికా(South Africa)తో మూడో వన్డేకు ముందు జాతీయ గీతం జనగణమన(Jana Gana Mana) ఆలపిస్తుండగా విరాట్ కోహ్లీ చూయింగ్ గమ్ నములుతూ కనిపించాడు.

ICC T20 World Cup 2022 Schedule: భారత్ ఈ సారి కసి తీర్చుకుంటుందా, అక్టోబర్ 23న టీమిండియా- పాకిస్తాన్ తొలిపోరు, టీ20 ప్రపంచకప్‌ 2022 షెడ్యూల్‌ ఇదే

Hazarath Reddy

ఆస్ట్రేలియా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్‌ 2022 షెడ్యూల్‌ వచ్చేసింది.ఐసీసీ ఈ టోర్నీ షెడ్యూల్‌ను విడుదల చేసింది. అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 13 వరకు టోర్నీ జరగనుంది. 16 నుంచి 21 వరకు ఫస్ట్ రౌండ్(క్వాలిఫైయింగ్) మ్యాచులు జరగుతాయి. అసలు మ్యాచ్‌లు అక్టోబర్ 22 నుంచి ప్రారంభమవుతాయి.

ICC Men’s ODI Team 2021: ఒక్క భారత క్రికెటర్ కూడా లేడు, మెన్స్ వన్డే టీమ్ 2021 ను ప్రకటించిన ఐసీసీ, పాక్ కెప్టెన్ బాబర్ ఆజంను కెప్టెన్ గా సెలక్ట్ చేసిన అంతర్జాతీయ క్రికెట్ మండలి

Hazarath Reddy

2021కి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 11 మంది సభ్యులతో మెన్స్ వన్డే టీమ్ ను (ICC Men’s ODI Team) ప్రకటించింది. అయితే ఐసీసీ వన్డే టీమ్ లో ఒక్క టీమిండియా ఆటగాడికీ చోటు దక్కలేదు. రోహిత్ శర్్మ, కెఎల్ రాహుల్, కోహ్లీ, అశ్విన్ ఇలా ఎవ్వరూ (no Indian player included Team) ఇందులో చోటు దక్కించుకోలేదు.

Advertisement

IND vs SA 1st ODI 2022: తొలి వన్డేలో భారత్ ఓటమి, 31 పరుగుల తేడాతో నెగ్గిన దక్షిణాఫ్రికా, మూడు వన్డేల సిరీస్‌లో1-0 ఆధిక్యంలో నిలిచిన సఫారీలు

Hazarath Reddy

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఓడిపోయింది. 31 పరుగుల తేడాతో భారత్ పై దక్షిణాఫ్రికా గెలిచింది. మూడు వన్డేల సిరీస్‌లో(IND vs SA 1st ODI 2022) సౌతాఫ్రికా 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది.

U19 Cricket World Cup: భారత యువ క్రికెట్ జట్టులో కరోనా కలకలం, కెప్టెన్ యశ్ ధుల్‌, వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌ సహా మొత్తం ఆరుగురు భారత క్రికెటర్లకు కరోనా

Hazarath Reddy

అండర్-19 ప్రపంచ కప్ ఆడుతున్న భారత యువ జట్టులో కరోనా కలకలం రేపింది. కెప్టెన్ యశ్ ధుల్‌, వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌ సహా మొత్తం ఆరుగురు భారత క్రికెటర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దీంతో వీరంతా ఇవాళ ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌కు దూరమయ్యారని సమాచారం.

ICC Under-19 cricket World Cup: టీమిండియాలో కరోనా కలకలం, అండర్ -19 కెప్టెన్, వైస్ కెప్టెన్ సహా ఆరుగురికి సోకిన వైరస్, ఐర్లాండ్‌తో మ్యాచ్ కు దూరమైన ఆటగాళ్లు

Naresh. VNS

అండర్-19 ప్రపంచ కప్ ఆడుతున్న భారత యువ జట్టులో కరోనా కలకలం రేపింది. కెప్టెన్ యశ్ ధుల్‌, వైస్ కెప్టెన్ షేక్ రషీద్‌ సహా మొత్తం ఆరుగురు భారత క్రికెటర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో వీరంతా ఐర్లాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌కు దూరమయ్యారు.

Kapil Dev on Virat Kohli: విరాట్‌ కోహ్లి ఇకపై ఇగోని పక్కన పెట్టాలి, జూనియర్ల కెప్టెన్సీలో ఆడేందుకు నామోషీగా ఫీల్ కాకూడదు, ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కపిల్ దేవ్

Hazarath Reddy

కోహ్లీపై టీమిండియా దిగ్గజం కపిల్‌ దేవ్‌ మిడ్‌ డే లో ఆసక్తికర వ్యాఖ్యలు (Kapil Dev issues BOLD statement ) చేశారు. కోహ్లి తన ఇగోను పక్కనపెట్టి (Virat Kohli will have to give up his ego) జూనియర్ల కెప్టెన్సీలో ఆడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. తాను కూడా శ్రీకాంత్‌, అజారుద్దీన్‌ వంటి ఆటగాళ్ల సారథ్యంలో ఆడినవాడినేనని, అయితే అందుకు ఏమాత్రం ఫీలవలేదని చెప్పుకొచ్చారు.

Advertisement
Advertisement