Dubai, DEC 15: దుబాయ్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రికెట్ కౌన్సిల్ అండర్ 19 ఆసియా కప్ -2023లో(Under-19 Asia Cup) సంచలన ఫలితాలు వెలువడ్డాయి. అగ్రశ్రేణి జట్లు అయిన భారత్(Bangladesh beat India), పాకిస్తాన్‌లకు సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్(UAE beat Pakistan), యూఏఈలు ఊహించని షాకిచ్చాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌కు బంగ్లాదేశ్ షాకివ్వగా.. పాకిస్తాన్‌ను యూఏఈ ఓడించింది. ఫలితంగా యూఏఈ, బంగ్లాదేశ్ జట్లు ఫైనల్‌కు చేరాయి. దుబాయ్ వేదికగా డిసెంబర్ 17న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
Bangladesh-U19 clinches victory by 4 wickets against India-U19, securing a thrilling ticket to the finals. The cricketing arena buzzes with excitement as Bangladesh charts their course to championship glory. #ACCMensU19AsiaCup #ACC pic.twitter.com/OBYEu5MbxP
— AsianCricketCouncil (@ACCMedia1) December 15, 2023
పాకిస్తాన్‌తో జరిగిన తొలి సెమీఫైనల్లో (Semi final) తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ.. 47.5 ఓవర్లలో 193 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. పాక్ పేసర్ ఉబెయిద్ షా (4/43) యూఏఈ పతనాన్ని శాశించాడు. యూఏఈ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ అయాన్ ఖాన్ (55) అర్దసెంచరీతో రాణించగా.. ఓపెనర్ ఆర్యాన్ష్ శర్మ (46), డిసౌజా (37) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
UAE-U19 triumphs by 11 runs against Pakistan-U19, securing a spot in the finals. A heart-stopping match showcasing the essence of cricket's exhilarating unpredictability. Congratulations team UAE! #ACCMensU19AsiaCup #ACC pic.twitter.com/hXAgS3752h
— AsianCricketCouncil (@ACCMedia1) December 15, 2023
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్.. యూఏఈ బౌలర్లు మూకుమ్మడిగా అటాకింగ్ చేయడంతో 49.3 ఓవర్లలో 182 పరుగులకే ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ సాద్ బేగ్ (50), అజాన్ అవైస్ (41) మాత్రమే రాణించారు. యూఏఈ బౌలర్లలో అయ్మాన్ అహ్మద్, హార్దిక్ చెరో 2 వికెట్లు పడగొట్టగా.. రెహ్మాన్, ధృవ్, బదామీ తలో వికెట్ దక్కించుకున్నారు.
India-U19 made a total of 188 runs against Bangladesh-U19, while UAE-U19 managed to score 193 runs against Pakistan-U19, setting the ground for an intense low-scoring battle for a spot in the finals!#ACCMensU19AsiaCup #ACC pic.twitter.com/lci1GqWc5g
— AsianCricketCouncil (@ACCMedia1) December 15, 2023
భారత్-బంగ్లాదేశ్ మధ్య దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ వేదికగా ముగిసిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత అండర్ – 19 జట్టు.. 42.4 ఓవర్లలో 188 పరుగులకే ఆలౌట్ అయింది. దేశవాళీ క్రికెట్‌లో ముంబై తరఫున ఆడే సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్.. 62 బంతుల్లో 50 పరుగులు చేయగా.. హైదరాబాద్ ప్లేయర్ మురుగన్ అభిషేక్.. 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. బంగ్లా బౌలర్లలో మరుఫ్ మృధ నాలుగు వికెట్లు తీశాడు.