CSK Beat KKR (PIC @ IPL Twitter)

Kolkata, April 23: ఈడెన్ గార్డెన్స్‌లో ప‌రుగుల వ‌ర‌ద పారింది. చెన్నై సూప‌ర్ కింగ్స్ (Chennai Super Kings) బ్యాట‌ర్లు దంచి కొట్టారు. దాంతో, ధోనీ సేన ఈ సీజ‌న్‌లో హ్యాట్రిక్ విక్ట‌రీ కొట్టింది. కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌పై (Kolkata Knight Riders) 49 ప‌రుగుల తేడాతో గెలిచింది. ఓపెన‌ర్ డెవాన్ కాన్వే(56), అజింక్యా ర‌హానే(71), శివం దూబే(50) వీర కొట్టుడు కొట్ట‌డంతో చెన్నై 234 ప‌రుగులు చేసింది. ఆ త‌ర్వాత‌ జేస‌న్ రాయ్ (Jason Roy)(61), రింకూ సింగ్ (Rinku Singh)(53) విధ్వంస‌క ఇన్నింగ్స్ ఆడినా స‌రిపోలేదు. కోల్‌క‌తాకు ఇది వ‌రుస‌గా నాలుగో ఓట‌మి. ప‌థిర‌న వేసిన ఆఖ‌రి ఓవ‌ర్‌లో 56 ర‌న్స్ అవ‌స‌ర‌మ‌య్యాయి. తొలి బంతికి రింకూ సింగ్(53) సిక్స్ కొట్టి యాభై ర‌న్స్ పూర్తి చేసుకున్నాడు. ఫోర్ కొట్టాడు. లాంగాఫ్‌లో సిక్స్ బాదాడు. దాంతో చెన్నై 49 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

భారీ ల‌క్ష్య ఛేద‌న‌లో కోల్‌క‌తాకు తొలి ఓవ‌ర్‌లోనే షాక్ త‌గిలింది.. ఓపెన‌ర్‌గా వ‌చ్చిన‌ సునీల్ న‌రైన్(0)ను ఇంపాక్ట్ ప్లేయ‌ర్ ఆకాశ్ సింగ్ బౌల్డ్ చేశాడు. రెండో ఓవ‌ర్‌లో మ‌రో ఓపెన‌ర్ జ‌గ‌దీశ‌న్(1) ఔట‌య్యాడు. కెప్టెన్ నితీశ్ రానా(27),ఇంపాక్ట్ ప్లేయ‌ర్ వెంక‌టేశ్ అయ్యర్(20) త‌క్కువకే ఔట‌య్యారు. ఆ త‌ర్వాత జేస‌న్ రాయ్(61), రింకూ సింగ్ ధాటిగా ఆడారు. రాయ్ ఔట‌య్యాక ఆండ్రూ ర‌స్సెల్(9), చెన్నై బౌల‌ర్ల‌లో తుషార్ దేశ్‌పాండే, మ‌హీశ్ థీక్ష‌ణ రెండు వికెట్లు తీశారు. ఆకాశ్ సింగ్, జ‌డేజా, మోయిన్ అలీ త‌లా ఒక‌ వికెట్‌ తీశారు. (Dhoni Review System)

అంతకుముందు ఈడెన్ గార్డెన్స్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (KKRvCSK) బ్యాట‌ర్లు చిత‌క్కొట్టారు. ఏకంగా ముగ్గురు అర్థ శ‌త‌కాలు బాదారు. ఓపెన‌ర్ డెవాన్ కాన్వే(56), అజింక్యా ర‌హానే(37), శివం దూబే(50) సిక్స్‌లు, ఫోర్ల‌తో హోరెత్తించారు. దాంతో ఈ సీజ‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు కొట్టింది. కోల్‌క‌తాకు 236 టార్గెట్ నిర్దేశించింది. ఖెజ్రోలియా వేసిన 20వ ఓవ‌ర్‌లో ర‌వీంద్ర జ‌డేజా(18) దంచాడు. రెండు బంతుల్ని స్టాండ్స్‌కు త‌ర‌లించాడు. ఆ త‌ర్వాత బంతికి రింకూ సింగ్ క్యాచ్ ప‌ట్ట‌డంతో ఔట‌య్యాడు. క్రీజులోకి వ‌చ్చిన‌ ధోనీ(2) రెండు ర‌న్స్ తీశాడు. దాంతో, 4 వికెట్ల న‌ష్టానికి చెన్నై 235 ప‌రుగులు చేసింది.