DC Vs RCB (PIC@ IPL Twitter)

New Delhi, May 06: ఐపీఎల్(IPL) 2023 భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరు(Royal Challengers Bangalore)తో జ‌రిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట్స‌ల్(Delhi Capitals) విజ‌యం సాధించింది. ఆర్‌సీబీ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని ఢిల్లీ 16.4 ఓవ‌ర్ల‌లో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో ఫిలిప్ సాల్ట్(87; 45 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కంతో మెరుపులు మెరిపించ‌గా రిలీ రోసో(35; 22 బంతుల్లో 1 ఫోర్‌, 3సిక్సులు) మిచెల్ మార్ష్‌(26;’ 17 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్‌)లు రాణించ‌డంతో 7 వికెట్ల తేడాతో ఢిల్లీ విజ‌యం సాధించింది. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో జోష్ హేజిల్‌వుడ్, క‌ర‌ణ్ శ‌ర్మ‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌లు తలా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

అంత‌క‌ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 181 ప‌రుగులు చేసింది. బెంగ‌ళూరు బ్యాట‌ర్ల‌లో విరాట్ కోహ్లి(55; 46 బంతుల్లో 5 ఫోర్లు), మహిపాల్ లోమ్రోర్(54 నాటౌట్‌; 29 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) లు అర్ధ‌శ‌త‌కాల‌తో మెరువ‌గా డుప్లెసిస్‌(45; 32 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. మాక్స్‌వెల్‌(0), దినేశ్ కార్తిక్‌(11) లు విప‌లం అయ్యారు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో మిచెల్ మార్ష్ రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా ముకేశ్ కుమార్, ఖ‌లీల్ అహ్మ‌ద్ చెరో వికెట్ తీశారు.