Danielle Wyatt's Engagement: అప్పుడు కోహ్లీకి ప్రపోజ్, ఇప్పుడు మరో యువతితో ఎంగేజ్‌మెంట్, ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌ఉమెన్ డేనియల్ సంచలన నిర్ణయం
ఈ సారి ఆమె తన జీవిత భాగస్వామిని (Life Partner) పరిచయం చేసింది. ఫుట్‌బాల్ ఏజెంట్ (womens football at CAA Base and an FA-licensed agent ) జార్జి హోడ్జే (Georgie Hodge) తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయాన్ని డేనియల్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. జార్జిని ముద్దు పెట్టుకుంటున్న ఫొటోను షేర్ చేసింది.
Paris, March 03: ఇంగ్లాండ్ మహిళల జట్టు (England womens cricket team star ) స్టార్ క్రీడాకారిణి డేనియల్ వ్యాట్ (Danielle Wyatt) గుర్తుండే ఉంటుంది. 2014లో టీమిండియా (Team India)స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) కి ప్రపోజ్ చేసి వార్తల్లో కెక్కింది. అనంతరం టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ (Sachin Tedulkar)కుమారుడు అర్జున్ తెందూల్కర్ (Arjun Tedulkar)తో రిలేషన్‌లో ఉందంటూ వార్తలు వచ్చాయి. అయితే , తాజాగా మరోసారి ఈ స్టార్ వార్తల్లోకెక్కింది. ఈ సారి ఆమె తన జీవిత భాగస్వామిని (Life Partner) పరిచయం చేసింది. ఫుట్‌బాల్ ఏజెంట్ (womens football at CAA Base and an FA-licensed agent ) జార్జి హోడ్జే (Georgie Hodge) తో నిశ్చితార్థం చేసుకుంది. ఈ విషయాన్ని డేనియల్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. జార్జిని ముద్దు పెట్టుకుంటున్న ఫొటోను షేర్ చేసింది.
Mine forever 😍💍❤️ pic.twitter.com/cal3fyfsEs
— Danielle Wyatt (@Danni_Wyatt) March 2, 2023
అది చూసిన అభిమానులు, క్రికెటర్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, ఏఏ బేస్ అనే ఫుట్‌బాల్ ఏజెన్సీకి జార్జి హాడ్జ్ హెడ్ ( womens football at CAA Base and an FA-licensed agent ) జార్జి హోడ్జే (Georgie Hodge) . ఇది ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్ల కెరియర్, వారి అభివృద్ధి, నిర్వహణకు అంకితమైన సంస్థ. డేనియల్, జార్జి ఇద్దరూ 2019 నుంచి రిలేషన్‌లో ఉన్నారు. వీరు ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్నారు.
(The above story first appeared on LatestLY on Mar 03, 2023 09:55 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

