Heath Davis (Photo-Twitter)

న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ హీత్‌ డెవిస్‌ సంచలన ప్రకటన చేశారు. తాను ( Heath Davis) స్వలింగ సంపర్కుడినని, ఈ విషయం ఆక్లాండ్‌ దేశవాళీ క్రికెట్‌ జట్టులోని ప్రతి ఒక్కరికి తెలుసనని, అయినప్పటికీ తన పట్ల ఎలాంటి వివక్ష ప్రదర్శించలేదని చెప్పుకొచ్చాడు. ఈ విషయం ఇన్నాళ్లుగా బయటి ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ఉంచానని తెలిపాడు. దీని కారణంగా కాస్త మానసిక ఒత్తిడికి గురైనట్లు డెవిస్‌ (Heath Davis Comes Out as Gay) తెలిపాడు. తాను ‘గే’ను అని ఇక దాచిపెట్టడం ఇష్టలేకనే ఈ విషయం బయటపెడుతున్నట్లు పేర్కొన్నాడు.

50 ఏళ్ల హీత్‌ డెవిస్‌ (Former New Zealand Test Cricketer) ఆన్‌లైన్‌ మ్యాగజీన్‌ ది స్పిన్‌ఆఫ్‌తో మాట్లాడుతూ.. నా వ్యక్తిగత జీవితంలోని ఈ విషయం గురించి దాచిపెడుతున్నాననే భావన నాలో ఉండేది. నిజానికి ఇది నా వ్యక్తిగతం.. అయినా ఎందుకో దాచిపెట్టాలనిపించలేదు. అందుకే బయటి ప్రపంచానికి చెప్పాలనుకున్నా.ఆక్లాండ్‌లో జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడికి నేను గే అని తెలుసు. అయినా వాళ్లు దీనిని పెద్ద సమస్యగా భావించలేదు. నన్ను నాలా స్వేచ్ఛగా ఉండనిచ్చారు’’ అని తెలిపాడు.

వీడియో ఇదిగో.. కెరీర్‌లో వేసిన తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ వికెట్లు సాధించిన న్యూజిలాండ్ ఆల్‌రౌండర్‌ మైఖేల్ బ్రేస్‌వెల్

ఇప్పటివరకు ఇంగ్లండ్‌ క్రికెటర్‌ స్టీవెన్‌ డేవీస్‌ మాత్రమే తాను గే అని 2011లో బహిరంగంగా ప్రకటించాడు. అతడి తర్వాత ఇలాంటి సంచలన ప్రకటన చేసిన రెండో పురుష క్రికెటర్‌గా హీత్‌ డెవిస్‌ నిలిచాడు.ఇక న్యూజిలాండ్‌ (New Zealand) అంతర్జాతీయ క్రికెటర్లలో గే అని చెప్పుకొన్న మొదటి ఆటగాడు ఇతడే కావడం విశేషం. కాగా న్యూజిలాండ్‌లో స్వలింగ సంపర్కం నేరం కాదన్న విషయం తెలిసిందే. అదే విధంగా స్వలింగ సంపర్క వివాహాలకు చట్టబద్దత ఉంది.

కివీస్‌ తరఫున 1994, ఏప్రిల్‌లో శ్రీలంకతో వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో పేసర్‌ హీత్‌ అడుగుపెట్టాడు.ఆ తర్వాత అదే ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అయితే పెద్దగా విజయవంతం కాని హీత్‌ డెవిస్‌ 1997లో తన చివరి వన్డే, టెస్టు మ్యాచ్‌ ఆడాడు. టెస్టుల్లో మొత్తంగా 17, వన్డేల్లో 11 వికెట్లు తీశాడు. అనంతరం 2003లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు వెళ్లి అక్కడ కోచ్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో 2008లో ఆక్సిడెంట్‌ కారణంగా అతడి ఎడమకాలి పాదం కోల్పోయాడు.