Representational Purpose Only (Photo Credits: Pixabay)

ప్రశ్న: హాయ్ అండి నాది విచిత్రమైన సమస్య. నాకు పెళ్లి అయింది. నేను నా భార్యని చాలా బాగా చూసుకుంటారు. కానీ, నిజానికి నాకు మగవారంటే చాలా ఇష్టం. నేను ఆడ, మగ ఇద్దరితోనూ శృంగారం చేయగలను. కానీ, ఈ విషయంలో నా భార్య నన్ను గే అనుకుంటోంది. ఈ విషయం నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. ఆమెకు ఎలా నచ్చజెప్పాలో నాకు తెలియడం లేదు. ఈ విషయం గురించి నా భార్య అడిగినప్పుడు ఏం చెప్పాలో తెలియక వదిలేశా. నేను ఆమెకు చెప్పాలని ఉన్నా చెప్పలేకపోతున్నా. మాకు కూడా ఓ అందమైన పాప ఉంది. నేన రెండు వైపులా ఆలోచించి ఉక్కిరి బిక్కిరి అవుతున్నా. ఈ విషయం నా భార్యకి ఎలా చెప్పాలో తెలియడం లేదు.

నా భర్త గే అనే అనుమానం నన్ను నిద్ర పోనీయడం లేదు, ఆయన్ని అడుగాదామంటే భయమేస్తోంది, ఈ సమస్యను నేను ఎలా పరిష్కరించుకోవాలో దయచేసి చెప్పండి

జవాబు: మీ సమస్య చాలా క్లిష్టమైనది. దీనిపై మీరు వాస్తవికతను తెలుసుకుని మీ భార్యతో దీని గురించి మాట్లాడటం చాలా అవసరం. ఏ సంబంధానికైనా సత్యమే ఆధారం. ఆమె మిమ్మల్ని అర్ధం చేసుకోలేకపోతే మీరు అలాంటి రెండో జీవితం గడపడం అంత మంచిది కాకపోవచ్చు. ఇక ఆమె మిమ్మల్ని అర్ధం చేసుకుంటే మీ లైఫ్ మొత్తం హ్యాపీనే. మీరు రాత్రి పూట మీ వైఫ్ మంచి మూడ్ లో ఉన్నప్పుడు ఓ సారి ఆమెతో మాట్లాడండి. మీరు మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి ఏ నిర్ణయమైనా ఇద్దరు కలిసి తీసుకోవాలి. సంబంధాలు చాలా సున్నితంగా ఉంటాయి. మనం వాటి విషయంలో శ్రద్ధ వహించాలి. అన్నింటికంటే, ఇది మీ కుటుంబంతో సహా ప్రతి ఒక్కరి జీవితానికి సంబంధించిన ప్రశ్న. పైగా పాప అంటున్నారు. ఆమె భవిష్యత్తును కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది.