India Cricket Team (Photo Credit: Twitter/@JayShah)

Thiruvananthapuram, NOV 25: విశాఖ వేదిక‌గా జ‌రిగిన మొద‌టి టీ20 మ్యాచ్‌లో గెలిచి మంచి జోష్‌లో ఉంది టీమ్ఇండియా(Team India). అదే ఉత్సాహంలో రెండో టీ20 (T-20) మ్యాచ్‌కు సిద్ధ‌మైంది. ఆదివారం తిరువ‌నంత‌పురంలో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌లో త‌మ ఆధిక్యాన్ని పెంచుకోవాల‌ని భార‌త జ‌ట్టు భావిస్తుండ‌గా ఆసీస్ (IND Vs AUS)మాత్రం సిరీస్ స‌మం చేయాల‌ని ప‌ట్టుద‌ల‌గా ఉంది. ఈ క్ర‌మంలో ఈ మ్యాచ్ సైతం హోరాహోరీగా జ‌రిగే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

 

ఈ క్ర‌మంలో క్రికెట్ అభిమానుల‌కు ఓ బ్యాడ్‌న్యూస్ ఇది. ఈ మ్యాచ్‌కు వ‌రుణుడు అంత‌రాయం క‌లిగించే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది. మ్యాచ్ జ‌ర‌గ‌నున్న గ్రీన్ ఫీల్డ్ మైదానంలో గ‌త కొద్ది రోజులుగా వ‌ర్షాలు (Pitch Report) కురుస్తున్నాయి. దీంతో ఔట్ ఫీల్డ్ మొత్తం చిత్త‌డిగా మారింది. దీంతో శ‌నివారం ఇరు జ‌ట్లు ప్రాక్టీస్ కూడా చేయ‌లేక‌పోయాయి. ఇక ఆదివారం భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. అక్యూవెదర్ రిపోర్ట్‌ ప్రకారం మ్యాచ్ జ‌ర‌గ‌నున్న స‌మ‌యంలో 55 శాతం వ‌ర్షం ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి.ఈ మైదానంలో ఇప్ప‌టి వ‌ర‌కు మూడు టీ20 మ్యాచులు జ‌రిగాయి. ఇక్క‌డ రెండో సారి బ్యాటింగ్ చేయ‌డం ఉత్త‌మం. ఈ క్ర‌మంలో టాస్ గెలిచిన జ‌ట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవ‌కాశం ఉంది.