Cape town, FEB 23: మహిళల టీ20 ప్రపంచ కప్ – 2023లో (Women's T20 World Cup 2023) నేడు కీలక మ్యాచ్ జరగనుంది. భారత్ జట్టు సెమీస్‌లో ఆస్ట్రేలియాను (India vs Australia) ఢీకొట్టనుంది. సాయంత్రం 6.30 గంటలకు దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో (Cape town) ఈ మ్యాచ్ జరుగుతుంది. టీ20 ప్రపంచ కప్‌లో ఆదినుంచి భారత్ జట్టు అద్భుత ప్రదర్శన ఇస్తుంది. అయితే, గత ఐదేళ్లుగా అగ్రశ్రేణి జట్లలో ఒకటిగాఉన్న భారత్ జట్టు పెద్ద ట్రోఫీని గెలుచుకోలేక పోయింది. తాజాగా మరో ఐసీసీ టోర్నీలో సెమీఫైనల్‌కు (Semifinal) చేరుకుంది. ఈ మ్యాచ్‌లో విజయం ద్వారా ద్వారా ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకొనేందుకు భారత్ జట్టు క్రీడాకారుణులు పట్టుదలతో ఉన్నారు. గతంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల టీ20 ట్రాక్ రికార్డును చూస్తే.. భారత్ జట్టు బలహీనంగా కనిపిస్తోంది. ఇరు జట్ల మధ్య గత ఐదు మ్యాచ్ లలో ఆస్ట్రేలియా జట్టు నాలుగు సార్లు విజయం సాధించింది. భారత్ జట్టు కేవలం ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించింది.
🇦🇺 v 🇮🇳
Everything you need to know ahead of blockbuster #T20WorldCup semi-final between Australia and India 👇#TurnItUp | #AUSvIND https://t.co/GecWbZw13t
— T20 World Cup (@T20WorldCup) February 23, 2023
అయితే, గురువారం సాయంత్రం జరిగే సెమీస్‌లో హర్మన్ ప్రీత్‌కౌర్ సారథ్యంలోని భారత జట్టు విజయంపై ధీమాతో ఉంది. అయితే, 2021 మార్చి నుంచి అన్ని ఫార్మాట్లలో కలిసి ఆసీస్ కేవలం రెండు మ్యాచ్ లలోనే ఓడింది. ఆ రెండు సార్లు ఆ జట్టును ఓడించింది భారతే కావడం విశేషం. జట్టు మొత్తం సమిష్టిగా రాణిస్తే ఆస్ట్రేలియా జట్టును ఓడించడం భారత్ జట్టుకు పెద్ద సమస్య కాకపోవచ్చు.
🇦🇺 v 🇮🇳
Everything you need to know ahead of blockbuster #T20WorldCup semi-final between Australia and India 👇#TurnItUp | #AUSvIND https://t.co/GecWbZw13t
— T20 World Cup (@T20WorldCup) February 23, 2023
ప్రస్తుతం భారత్ జట్టులో స్మృతి మంధాన (Smriti mandana) మంచి ఫామ్‌లో ఉంది. జట్టుసైతం మంధానపైనే భారీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు రిచాఘోష్ కూడా రాణిస్తుండటం భారత జట్టుకు కలిసొచ్చే అంశం. వీళ్లకు తోడు షెషాలీ వర్మ, కెప్టెన్ హర్మన్ ప్రీత్, జెమీమా రోడ్రిగ్స్ కూడా బ్యాటింగ్ లో రాణిస్తే భారత్ విజయం ఈజీ అవుతుందని క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. బౌలింగ్ విభాగంలో పేసర్ రేణుక సత్తాచాటుతోంది. ప్రధాన స్పిన్నర్ దీప్తి శర్మతో పాటు ఇతర బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో ఆసీస్‌ను కట్టడి చేయడం పెద్ద కష్టమేమీ కాదన్నది క్రికెట్ విశ్లేషకుల వాదన. భారత్, ఆస్ట్రేలియా మధ్య మహిళల టీ20 రికార్డును ఓసారి పరిశీలిస్తే.. ఇరు జట్ల మధ్య 30 టీ20 మ్యాచ్ లు జరిగాయి. వీటిలో 22 మ్యాచ్ లలో ఆస్ట్రేలియా విజయం సాధించగా.. భారత్ జట్టు కేవలం ఆరు మ్యాచ్ లలోనే విజయం సాధించింది. ఒక మ్యాచ్ ఫలితం తేలకపోగా, ఓ మ్యాచ్ డ్రా అయింది.