Chattogram, DEC 10: బంగ్లాదేశ్‌లోని చటోగ్రామ్ జహుర్ అహ్మద్ చౌధురి స్టేడియంలో (Zahur Ahmed Chowdhury Stadium) జరిగిన మూడో వన్డేలో బంగ్లాదేశ్ పై భారత్ 227 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే, మూడు వన్డేల సిరీస్ లో ఇప్పటికే రెండు మ్యాచుల్లో విజయం సాధించిన బంగ్లాదేశ్ సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. నేటి మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా బంగ్లాదేశ్ (India vs Bangladesh) ముందు భారత్ 410 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ ఏ దశంలోనూ రాణించలేకపోయింది. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ లో షకీబ్ (43) మినహా మిగతా ఏ ఆటగాడూ చెప్పుకోదగ్గ రీతిలో బ్యాటింగ్ లో రాణించలేదు. బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్ లో అనముల్ 8, లిట్టన్ దాస్ 29, షకీబ్ 43, రహీం 7, యాసిర్ అలీ 25, ముహ్ముదుల్లా 20, అఫిఫ్ 8, మెహెదీ హసన్ 3, టాస్కిన్ అహ్మద్ 17, ఎదాబత్ 0, ముస్తాఫిజర్ రెహ్మాన్ 13 పరుగులు చేశారు.
Ishan Kishan’s astounding batting performance got everyone talking! ? ?
Some high praises in there for the record setter ? ?
Scorecard ? https://t.co/HGnEqugMuM#TeamIndia | #BANvIND | @ishankishan51 pic.twitter.com/ikoxs2daqg
— BCCI (@BCCI) December 10, 2022
దీంతో 34 ఓవర్లకు బంగ్లాదేశ్ 182 పరుగులు మాత్రమే సాధించింది. టీమిండియా బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3,(Shardul Thakur) అక్షర్ పటేల్, ఉమ్రాన్ మాలిక్ (Umran Malik) రెండేసి వికెట్లు, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సిరాజ్ ఒక్కో వికెట్ చొప్పున తీశారు. ఈ మ్యాచులో భారత బ్యాట్స్‌మెన్‌లో శిఖర్ ధావన్ 3, ఇషాంత్ కిషన్ 210 (131 బంతుల్లో 10 సిక్సులు, 24 ఫోర్ల సాయంతో), విరాట్ కోహ్లీ 113 (90 బంతుల్లో 2 సిక్సులు, 11 ఫోర్ల సాయంతో) పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ 3, కేఎల్ రాహుల్ 8, వాషింగ్టన్ సుందర్ 37, అక్షర్ పటేల్ 20, శార్దూల్ ఠాకూర్ 3, కుల్దీప్ యాదవ్ 3 (నాటౌట్) , మొహమ్మద్ సిరాజ్ 0 (నాటౌట్) పరుగులు చేశారు.
For his fiery ? ? double ton, @ishankishan51 bags the Player of the Match award as #TeamIndia beat Bangladesh by 227 runs in the third ODI ? ?
Scorecard ? https://t.co/HGnEqugMuM #BANvIND pic.twitter.com/CJHniqrIoa
— BCCI (@BCCI) December 10, 2022
టీమిండియా స్కోరు 50 ఓవర్లకు 409/8గా నమోదైంది. బంగ్లా బౌలర్లలో షకీబ్ హసన్, ఎదాబత్, టస్కిన్ అహ్మద్ రెండేసి వికెట్లు తీయగా, మెహిదీ హసన్, ముస్తాఫఇజుర్ రెహ్మాన్ చెరో వికెట్ తీశారు. కాగా, భారత్-బంగ్లాదేశ్ మధ్య టెస్టు సిరీస్ ఈ నెల 14 నుంచి ప్రారంభం కానుంది.