Hyderabad, JAN 18: నేడు ఇండియా-న్యూజిలాండ్ (India vs New Zealand) తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో (Uppal Stadium) మ్యాచ్ జరుగనుంది. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు మ్యాచుల సిరీస్ లో భాగంగా భారత్, న్యూజిలాండ్ (India vs New Zealand) మధ్య తొలి వన్డే మ్యాచ్ (1st ODI) జరుగనుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ (Siraj) కు సొంతగడ్డపై ఇది తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ మిడిలార్డర్ లో బ్యాటింగ్ చేయనున్నారు. గాయం కారణంగా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas ayer) సిరీస్ కు దూరం కాగా, అతని స్థానంలో సూర్యకుమార్ (Surya Kumar) తుది జట్టులో చోటు దక్కించుకోనున్నారు.
? Sound ?#TeamIndia captain @ImRo45 gets into the groove ahead of the #INDvNZ ODI series opener ? ? pic.twitter.com/NR6DaK56mg
— BCCI (@BCCI) January 17, 2023
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 2,500 మంది పోలీసులతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మహిళల కోసం ప్రత్యేకంగా 40 మందితో షీ టీమ్‌లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రేక్షకుల్ని స్టేడియంలోకి అనుమతిస్తారు. సెల్‌ఫోన్ మినహా ఇతర వస్తువులకు స్టేడియంలోకి అనుమతి లేదు. పాసులు, టిక్కెట్లు, బీసీసీఐ (BCCI) అనుమతించిన కార్డులు ఉన్న వారికి మాత్రమే స్టేడియంలోకి రావడానికి అనుమతి ఉంది.
మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లను అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటారు. మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లను బ్లాక్‌లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. బ్లాక్ టిక్కెటింగ్, బెట్టింగ్ జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. బ్లాక్ టిక్కెట్లకు సంబంధించి ఇప్పటికే పలు కేసులు కూడా నమోదు అయ్యాయి. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.