Lucknow, March 30: ఐపీఎల్ 17వ సీజన్‌లో లఖ్‌నవూ (Lucknow) బోణీ కొట్టింది. సొంత గడ్డపై పంజాబ్‌తో (Punjab) జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు (Lsg Vs Pbks) దిగిన పంజాబ్ దంచికొట్టింది. ఓపెనర్ డికాక్ (38 బంతుల్లో 54 పరుగులు) హాఫ్ సెంచరీతో మెరవగా.. నికోలస్ పూరన్ ( 21 బంతుల్లో 42 పరుగులు ), కృనాల్ పాండ్యా (22 బంతుల్లో 43 పరుగులు ) చెలరేగి ఆడి 199 పరుగుల భారీ స్కోర్ సాధించారు. 200 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పంజాబ్ దూకుడుగా ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. శిఖర్ ధవన్ (49 బంతుల్లో 70 పరుగులు )దంచికొట్టాడు. ఇతనికి బెయిర్ స్టో తోడయ్యాడు. కానీ మిగతా ప్లేయర్లు రాణించకపోవడంతో ఫలితం లేకుండా పోయింది. నిర్ణీత 20 పరుగులు ముగిసేసరికి 178 పరుగుల వద్దే ఆగిపోయింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూకు ఆరంభంలోనే షాక్ తగిలింది. పవర్ ప్లే ముగిసేలోపే రెండు కీలక వికెట్లను కోల్పోయింది. నాలుగో ఓవర్‌లో కేఎల్ రాహుల్ ( 9 బంతుల్లో 15 పరుగులు), ఆరో ఓవర్‌లో దేవ్‌దత్ పడిక్కల్ ( 6 బంతుల్లో 9 పరుగులు ) ఔటయ్యారు. వాళ్ల తర్వాత క్రీజులోకి వచ్చిన మార్కస్ స్టాయినిస్ (12 బంతుల్లో 19 పరుగులు ) కూడా రాణించలేకపోయాడు. తొమ్మిదో ఓవర్‌లో చాహర్ వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
First Home Game 👌
First Season Win 👌@LucknowIPL's strong comeback with the ball helps them secure a win by 21 runs 🙌
Scorecard ▶️ https://t.co/HvctlP1bZb #TATAIPL | #LSGvPBKS pic.twitter.com/YKofyh3Kt5
— IndianPremierLeague (@IPL) March 30, 2024
స్టాయినిస్ తర్వాత వచ్చిన నికోలస్ పూరన్ ( 21 బంతుల్లో 42 పరుగులు).. ఓపెనర్ డికాక్(38 బంతుల్లో 54 పరుగులు)కు మంచి పార్టనర్‌షిప్ ఇచ్చాడు. ఇద్దరూ కలిసి జట్టుకు కీలక స్కోర్ అందించారు. అయితే 13వ ఓవర్‌లో డికాక్ ఔటయిన తర్వాత పూరన్ జోరుకు బ్రేక్ పడింది. ఆ వెంటనే పెవిలియన్ చేరాడు. డికాక్, పూరన్ పరుగుల వేటను కృనాల్ పాండ్యా ( 22 బంతుల్లో 43 పరుగులు) కొనసాగించాడు. కానీ అప్పటికే పంజాబ్ కట్టుదిట్టమైన బౌలింగ్ చేయడంతో 19 ఓవర్‌లో లఖ్‌నవూ వరుసగా మూడు వికెట్లను కోల్పోయింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.
టార్గెట్ చేధనలో భాగంగా బరిలోకి దిగిన ఓపెనర్లు శిఖర్ ధవన్(49 బంతుల్లో 70 పరుగులు ), బెయిర్ స్టో (29 బంతుల్లో 42 పరుగులు ) చెలరేగారు. వీళ్ల దూకుడు చూస్తే ఇద్దరే టార్గెట్‌ను చేధిస్తారేమో అని అనిపించింది.. కానీ బెయిర్ స్టో ఔటవ్వడంతో పంజాబ్ జోరుకు బ్రేక్ పడింది. బెయిర్ స్టో తర్వాత క్రీజులోకి వచ్చిన ప్రభ్‌మన్ సింగ్ ( 7 బంతుల్లో 19 పరుగులు ), జితేశ్ శర్మ ( 9 బంతుల్లో 6 పరుగులు ) ప్రభావం చూపించలేకపోయారు. ఇక 17వ ఓవర్‌లో శిఖర్ ధవన్ ఔటవ్వడం.. ఆ తర్వాత బంతికే సామ్ కరన్ (0) డకౌట్ కావడంతో మ్యాచ్ పూర్తిగా లఖ్‌నవూ చేతిలోకి వెళ్లిపోయింది. వాళ్ల తర్వాత క్రీజులోకి వచ్చిన లివింగ్ స్టోన్ (17 బంతుల్లో 28 పరుగులు), శశాంక్ సింగ్ ( 7 బంతుల్లో 9 పరుగులు) కష్టపడినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 178 పరుగుల వద్ద ఆగిపోయింది. దీంతో 21 పరుగుల తేడాతో లఖ్‌నవూ విజయం సాధించింది.