MI Vs SRH (PIC @ IPL Twitter)

Mumbai, May 21: ప్లే ఆఫ్స్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians) అదరగొట్టింది. సన్‌రైజర్స్‌తో జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గ్రీన్ కామెరూన్ అద్భుతమైన బ్యాటింగ్‌తో ముంబైకి జీవం పోశాడు. హైదరాబాద్‌ (Hyderabad) నిర్దేశించిన 201 పరుగుల భారీ లక్ష్యాన్ని 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి సునాయసంగా ఛేదించింది. కామెరూ న్‌ గ్రీన్ (Cameron Green) 100* (47బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించాడు. రోహిత్ శర్మ (56; 37 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు. సూర్యకుమార్‌ యాదవ్ 25* (16 బంతుల్లో 4 ఫోర్లు) దూకుడుగా ఆడాడు.  హైదరాబాద్‌ బౌలర్లలో భువనేశ్వర్‌, మయాంక్ దగార్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 200 ప‌రుగులు చేసింది. స‌న్‌రైజ‌ర్స్ బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్లు మ‌యాంక్ అగ‌ర్వాల్‌(83; 46 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), వివ్రాంత్ శర్మ(69; 47 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) అర్ధ‌శ‌త‌కాల‌తో మెరుపులు మెరిపించారు. వీరిద్ద‌రు తొలి వికెట్‌కు 140 ప‌రుగులు జోడించి గ‌ట్టి పునాది వేశారు. మిగిలిన వారిలో క్లాసెన్‌(18) ప‌ర్వాలేద‌నిపించ‌గా, గ్లెన్ ఫిలిఫ్స్‌(1), హ్యారీ బ్రూక్‌(0) లు విఫ‌లం అయ్యారు. ముంబై బౌల‌ర్ల‌లో ఆకాష్ మధ్వల్ నాలుగు వికెట్లు తీయ‌గా, క్రిస్ జోర్డాన్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.