Modi Wishes to Team India:వాహ్ టీమిండియా! కోహ్లీ బర్త్ డే కు ఘనమైన గిఫ్ట్ ఇచ్చారు, భారత ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ
సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా వరుసగా ఎనిమిదో విజయాన్ని (India Beat South Africa) నమోదుచేస్తూ టీమిండియా రికార్డులను బ్రేక్ చేసింది. ఈ మెగాటోర్నీలో పరుగుల వరద పారిస్తున్న సఫారీల ఆటలు భారత్ ముందు సాగలేదు. 400 పరుగులను అవలీలగా కొడుతున్న సౌతాఫ్రికా.. 327 పరుగుల ఛేదనలో ముక్కీమూలిగుతూ కనీసం మూడంకెల స్కోరు కూడా చేయకుండా 83 పరుగులకే చేతులెత్తేసింది.
Kolkata, NOV 05: వన్డే వరల్డ్ కప్‌లో (IND Vs SA) భారత జైత్రయాత్రపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించిన టీమిండియాకు ఆయన అభినందనలు తెలిపారు. విరాట్ కోహ్లీ బర్త్ డే రోజున లవ్లీ ఇన్నింగ్స్ ఆడి, ఘనమైన గిఫ్ట్ ఇచ్చారని కితాబిచ్చారు. మరోసారి టీమిండియా విజయడంఖా మోగించడంపై ఆయన ఎక్స్ లో పోస్ట్ చేశారు. గ్రేట్ టీమ్ వర్క్ ఇండియా అంటూ పోస్ట్ పెట్టారు ప్రధాని మోదీ.
Our cricket team is triumphant yet again! Congratulations to the team for a splendid performance against South Africa. Great teamwork.
They have also given a great birthday gift to Virat Kohli, who played a lovely innings today. @imVkohli
— Narendra Modi (@narendramodi) November 5, 2023
సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా వరుసగా ఎనిమిదో విజయాన్ని (India Beat South Africa) నమోదుచేస్తూ టీమిండియా రికార్డులను బ్రేక్ చేసింది. ఈ మెగాటోర్నీలో పరుగుల వరద పారిస్తున్న సఫారీల ఆటలు భారత్ ముందు సాగలేదు. 400 పరుగులను అవలీలగా కొడుతున్న సౌతాఫ్రికా.. 327 పరుగుల ఛేదనలో ముక్కీమూలిగుతూ కనీసం మూడంకెల స్కోరు కూడా చేయకుండా 83 పరుగులకే చేతులెత్తేసింది. ఫలితంగా భారత్.. 243 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. టీమిండియా స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా (Ravindra jadeja) ఐదు వికెట్లతో సఫారీల పతనాన్ని శాసించగా షమీ (Shami), కుల్దీప్ యాదవ్‌లు తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఆ జట్టులో మార్కో జాన్సెన్ 14 పరుగులతో టాప్ స్కోరర్.
(The above story first appeared on LatestLY on Nov 05, 2023 08:58 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

