Rajasthan Royals New Jersey: ఈసారి సరికొత్తగా ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇస్తున్న రాజస్థాన్ రాయల్స్, వినూత్నంగా కొత్త జెర్సీని రిలీజ్ చేసిన రాజస్థాన్‌

మరికొన్ని రోజుల్లో క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ (IPL) పండుగ రానుంది. అయితే రాజస్థాన్ రాయల్స్ టీమ్ (Rajasthan Royals) తమ అభిమానులకు మరింత కిక్కిచ్చే విషయం తెలిపింది. ఈసారి కొత్త జెర్సీతో (new jersey) రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ మ్యాచ్ లు ఆడనుంది. తమ జెర్సీలను గ్రౌండ్ లో పనిచేసే సిబ్బందితోనే ఆవిష్కరించింది

Rajasthan Royals New Jersey: ఈసారి సరికొత్తగా ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇస్తున్న రాజస్థాన్ రాయల్స్, వినూత్నంగా కొత్త జెర్సీని రిలీజ్ చేసిన రాజస్థాన్‌
Rajasthan Royals unveil new jersey (PIC @ RR Twitter)

New Delhi, March 22: మరికొన్ని రోజుల్లో క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్న ఐపీఎల్‌ (IPL) పండుగ రానుంది. అయితే రాజస్థాన్ రాయల్స్ టీమ్ (Rajasthan Royals) తమ అభిమానులకు మరింత కిక్కిచ్చే విషయం తెలిపింది. ఈసారి కొత్త జెర్సీతో (new jersey) రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ మ్యాచ్ లు ఆడనుంది. తమ జెర్సీలను గ్రౌండ్ లో పనిచేసే సిబ్బందితోనే ఆవిష్కరించింది. ఆటకు ముందు మైదానాన్ని సిద్ధం చేయడంలో గ్రౌండ్‌ సిబ్బంది శ్రమను కొనియాడుతూ రాజస్థాన్‌ రాయల్స్‌ ఫ్రాంచైజీ ప్రత్యేకంగా ఓ వీడియోను తమ అధికారిక యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేసింది.  వినూత్నంగా ఆవిష్కరించిన రాజస్థాన్ రాయల్స్ టీంపై ప్రశంసలు కురుస్తున్నాయి.

మునపటితో పోలిస్తే కొత్త జెర్సీలో కొన్ని మార్పులు చేశారు. ఇదిలా ఉండగా రాజస్థాన్ జట్టుకు ఈసారి కూడా హెడ్ కోచ్ గా కుమార సంగక్కర ఉండనున్నారు. అసిస్టెంట్ కోచ్ గా ట్రెవర్ పెన్నీ, ఫాస్ట్ బౌలింగ్ కోచ్ గా కొనసాగనున్నారు.

(The above story first appeared on LatestLY on Mar 22, 2023 07:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).