Raichur, December 01: భారత యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) మరో మైలురాయికి చేరువయ్యాడు. టీ20ల్లో వేగంగా 4 వేల పరుగుల క్లబ్‌లో చేరాడు. పొట్టి ఫార్మాట్‌లో వేగంగా 4 వేల రన్స్ కొట్టిన ఐదో క్రికెటర్‌గా గైక్వాడ్ రికార్డు సృష్టించాడు. రాయ్‌చూర్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టీ20లో గైక్వాడ్ ఈ ఫీట్ సాధించాడు. 116 ఇన్నింగ్స్‌ల్లోనే అతడు 4 వేల పరుగులు బాదాడు. దాంతో కేఎల్ రాహుల్ (117 ఇన్నింగ్స్‌లు) రికార్డు బద్ధలు కొట్టాడు.
Ruturaj Gaikwad becomes the fastest Indian to complete 4000 runs in T20👏#INDvAUS | 4th T20I | #TeamIndia pic.twitter.com/VkBrKZ0iy6
— Doordarshan Sports (@ddsportschannel) December 1, 2023
టీ20ల్లో ఫాస్ట్‌గా 4వేల రన్స్ కొట్టిన వాళ్ల జాబితాలో విండీస్ విధ్వంసక ఓపెనర్ క్రిస్ గేల్(107 ఇన్నింగ్స్‌లు) ముందున్నాడు. అతడి తర్వాత షాన్ మార్ష్(113 ఇన్నింగ్స్‌లు), బాబర్ ఆజాం(115 ఇన్నింగ్స్‌లు), డెవాన్ కాన్వే(116 ఇన్నింగ్స్‌లు) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నారు.