Credit@ BCCI twitter

Lucknow, OCT 26: భారత్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023లో (CWC 2023) టీమిండియా హవా కొనసాగిస్తోంది. ఇప్పటి వరకు టీమిండియా (Team India) ఆడిన ఐదు మ్యాచ్ లలోనూ విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ నెల 29న ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ లక్నోలో జరుగుతుంది. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు బుధవారం సాయంత్రం లక్నోకు చేరుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ (BCCI) తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. టీమిండియా ప్లేయర్స్ కు లక్నోలో ఘన స్వాగతం లభించింది. క్రీడాకారులకు పుష్పగుచ్చాలు అందించి పూల వర్షం కురిపించారు.

 

కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ (Kohli), మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్ మన్ గిల్ (Gill), బూమ్రా, ఇషాంత్ కిషన్, శార్దూల్ ఠాకూర్, సూర్యకుమార్ యాదవ్ మహ్మద్ షమీలను వీడియోలో చూడొచ్చు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

లక్నోలో జరిగే మ్యాచ్ ఇంగ్లండ్ జట్టుకు చాలా కీలకం. ప్రస్తుతం టీమిండియా ప్లేయర్స్ భీకర ఫామ్ లో ఉన్నారు. వరుసగా ఐదు మ్యాచ్ లలో టీమిండియా విజయం సాధించింది. సెమీస్ కు చేరువలో ఉంది. ఇంగ్లండ్ జట్టు నాలుగు మ్యాచ్ లలో కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. భారత్ తో జరిగే మ్యాచ్ లో ఇంగ్లాండ్ తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం బలంగా ఉన్న భారత్ జట్టుపై విజయం సాధించాలంటే ఇంగ్లాండ్ జట్టుకు పెద్ద సవాలనే చెప్పొచ్చు.