2023 Cricket World Cup (Photo-Wikimedia Commons)

New Delhi, July 02: ఈ ఏడాది వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ క్వాలిఫైయ‌ర్స్ పోటీ మ‌రింత అస‌క్తిక‌రంగా మారింది. మాజీ చాంపియ‌న్ శ్రీ‌లంక (Sri Lanka) జ‌ట్టు ఈరోజు అర్హ‌త సాధించింది. దాంతో, మిగిలిన‌ ఆఖ‌రి బెర్తు కోసం మూడు జ‌ట్ల మ‌ధ్య పోటీ నెల‌కొంది. ప్ర‌స్తుతం రేసులో స్కాట్లాండ్(Scotland), జింబాబ్వే(Zimbabwe), నెద‌ర్లాండ్స్(Netherlands) జ‌ట్లు మాత్ర‌మే పోటీలో నిలిచాయి. అయితే.. శ్రీ‌లంక‌పై ఓట‌మి పాలైన‌ జింబాబ్వే వ‌ర‌ల్డ్ క‌ప్ ఆశ‌లు ఇంకా మిగిలే ఉన్నాయి. మంగ‌ళవారం స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో గెలిస్తే ఆ జ‌ట్టు కూడా క్వాలిఫై అయ్యే అవ‌కాశం ఉంది. ఇప్పుడు జింబాబ్వే 8, స్కాట్లాండ్ 6 పాయింట్లతో గ్రూప్ ఏ లో వ‌రుస‌గా తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. మ‌రోవైపు.. రెండు సార్లు చాంపియ‌న్ వెస్టిండీస్ ఇంటిదారి ప‌ట్టిన విష‌యం తెలిసిందే. 6 పాయింట్లతో ఉన్న స్కాట్లాండ్ కూడా టోర్న‌మెంట్ నుంచి వైదొలిగిన‌ట్టే.

వ‌ర‌ల్డ్ క‌ప్ క్వాలిఫైయ‌ర్స్‌(World Cup Qualifiers 2023)లో భాగంగా ఈరోజు జ‌రిగిన సూప‌ర్ సిక్స్‌(Super Six) మ్యాచ్‌లో జింబాబ్వే(Zimbabwe)పై భారీ విజ‌యం సాధించింది. మ‌హీశ్ థీక్ష‌ణ(Maheesh Theekshana) 4 వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న‌కు తోడూ ఓపెన‌ర్ ప్ర‌థుమ్ నిస్సంకా(101 నాటౌట్) సెంచ‌రీ బాద‌డంతో 9 వికెట్ల తేడాతో గెలిచింది. 8 పాయింట్ల‌తో వ‌ర‌ల్డ్ క‌ప్‌కి క్వాలిఫై అయింది.