Pakistan vs Zimbabwe. (Photo credits: X/@ZimCricketv)

Bulawayo, DEC 05: బులవాయో వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై (PAK vs ZIM) పసికూన జింబాబ్వే సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే పాక్‌ను 2 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌ను జింబాబ్వే బౌలర్లు సమిష్టిగా రాణించి 132 పరుగులకే పరిమితం చేశారు. పాక్‌ ఇన్నింగ్స్‌లో టాపార్డర్‌ విఫలం కాగా.. సల్మాన్‌ అఘా (32), తయ్యబ్‌ తాహిర్‌ (21), ఖాసిమ్‌ అక్రమ్‌ (20), అరాఫత్‌ మిన్హాస్‌ (22 నాటౌట్‌), అబ్బాస్‌ అఫ్రిది (15) రెండంకెల స్కోర్లు చేశారు. జింబాబ్వే బౌలర్లలో ముజరబానీ (4-0-25-2), మసకద్జ (4-0-24-1), నగరవ (3-0-27-1), మపోసా (1-0-12-1), ర్యాన్‌ బర్ల్‌ (3-0-15-1) సమిష్టిగా బౌలింగ్‌ చేసి పాక్‌ను కట్టడి చేశారు.

Syed Mushtaq Ali Trophy: టీ 20లో ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టిన బరోడా, అత్య‌ధిక సిక్స‌ర్లుతో పాటు అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా హిస్టరీ 

133 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జింబాబ్వే అష్టకష్టాలు పడి ఎట్టకేలకే విజయతీరాలకు చేరింది. జింబాబ్వే మరో బంతి మిగిలుండగా 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో బ్రియాన్‌ బెన్నెట్‌ (43) టాప్‌ స్కోరర్‌గా నిలువగా.. మరుమణి (15), డియాన్‌ మైర్స్‌ (13), సికంబర్‌ రజా (19) రెండంకెల స్కోర్లు చేశారు.

పాక్‌ బౌలర్లలో అబ్బాస్‌ అఫ్రిది మూడు వికెట్లు పడగొట్టగా.. జహన్‌దాద్‌ ఖాన్‌ 2, సల్మాన్‌ అఘా, సుఫియాన్‌ ముఖీమ్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. పాకిస్తాన్‌పై జింబాబ్వేకు టీ20ల్లో ఇది మూడో గెలుపు మాత్రమే.కాగా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పాక్‌ తొలి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇవాళ జరిగిన మ్యాచ్‌ నామమాత్రంగా సాగింది. ఈ మ్యాచ్‌లో గెలిచి జింబాబ్వే క్లీన్‌ స్వీప్‌ పరాభవం నుంచి తప్పించుకుంది. అంతకుముందు వన్డే సిరీస్‌లోనూ జింబాబ్వే ఓ మ్యాచ్‌ గెలవగా.. పాక్‌ మిగతా రెండు మ్యాచ్‌లు గెలిచి 2-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.