రాష్ట్రీయం

Telangana Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణ ఆశావాహులకు నిరాశేనా...సీఎం రేవంత్ రెడ్డి మనస్సులో ఏముంది...ఈ దీపావళికైనా కేబినెట్ విస్తరణ ఉంటుందా?

Arun Charagonda

తెలంగాణ కేబినెట్ విస్తరణ ఎప్పుడు?, దసరా వచ్చింది పోయింది..కానీ కేబినెట్ విస్తరణ మాత్రం జరగలేదు..సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు జోరందుకుంటున్న ఆశావాహులకు మాత్రం నిరాశే ఎదురవుతోంది.

Warangal: గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు, వరంగల్ నగరంలోని ఉర్సు రంగలీలా మైదానంలో ఘటన

Arun Charagonda

గుండెపోటుతో కుప్పకూలిన యువకుడికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారు కానిస్టేబుల్. వరంగల్ నగరంలోని ఉర్సు రంగలీలా మైదానంలో ఘటన చోటుచేసుకుంది. రావణ వధ కార్యక్రమంలో జరిగిన తోపులాటలో గుండెపోటుకు గురయ్యాడు యువకుడు. సీపీఆర్ చేసి యువకుడి ప్రాణాలు కాపాడారు కానిస్టేబుల్ ఆసిఫ్.

Komatireddy Rajagopal Reddy Stunning Look: కొత్త లుక్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డంతో సర్‌ప్రైజ్ ఇచ్చిన మునుగోడు ఎమ్మెల్యే, మంత్రిపదవి కోసమేనని కామెంట్స్

Arun Charagonda

కాంగ్రెస్ నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం చేసినా సంచలనమే. తాజాగా దసరా వేళ కొత్త లుక్‌లో దర్శనమిచ్చారు రాజగోపాల్ రెడ్డి. వైట్ గడ్డంలో రాజగోపాల్ రెడ్డిని చూసిన వారు అంతా షాక్ అవుతుండగా మంత్రి పదవి కోసమేనని టాక్ మొదలైంది.

Andhra Pradesh: సీఐడీకి తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌పై దాడి కేసు, కీలక నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు

Arun Charagonda

అమరావతి లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, చంద్రబాబు నివాసంపై జరిగిన దాడి కేసు విచారణను సీఐడీ కి బదలాయించాలని నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ మేరకు సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఏపీలో భారీ వర్షాలు, తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

Arun Charagonda

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. 14,15,16 తేదీల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను వల్ల ముప్పు వాటిల్లకుండా అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేసింది ఏపీ హోం మంత్రి అనిత.

Wife Sexual Torture: భార్య లైంగికంగా వేధిస్తోందని భర్త ఆత్మహత్యాయత్నం.. కాకినాడలో వింత ఘటన

Rudra

కాకినాడలోని సూర్యానారాయణపురంలో వింత ఘటన చోటుచేసుకుంది. భార్య తనను లైంగికంగా వేధిస్తున్నదని ఓ భర్త తీవ్రమైన నిర్ణయం తీసుకున్నాడు.

Violence at Devaragattu Karrala Samaram: మల్లన్న సాక్షిగా మరోసారి చిందిన రక్తం.. దేవరగట్టు కర్రల సమరంలో చెలరేగిన హింస.. 92 మందికి గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం

Rudra

విజయదశమి సందర్భంగా మల్లన్న సాక్షిగా మరోసారి రక్తం చిందింది. కర్నూలు జిల్లా హోళగుంద మండలం దేవరగట్టులో బన్నీ ఉత్సవంలో మరోసారి రక్తపుటేరులు పారాయి.

Hyderabad: గుడి ముందు మాంసం ముక్క, తప్పుడు ప్రచారం చేయొద్దని పోలీసుల విజ్ఞప్తి..అవాస్తవాలను ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

Arun Charagonda

హైదరాబాద్ - మాసాబ్ ట్యాంక్ ప్రాంతంలో నిన్న మధ్య రాత్రి ఒక గుడి ముందు రోడ్డు పైన ఓ ప్రాణి యొక్క మాంసం పడి ఉందని సమాచారం రాగానే పోలీసు అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. అయితే పక్కనే ఉన్న చెత్త పదార్తాల నుంచి ఒక వీధి కుక్క.. ఆ మాంసం ముక్కను నోట్లో పట్టుకొని వెళ్ళేటప్పుడు ఆకస్మాతుగా రోడ్డుపైన గుడి ముందు పడేసి వెళ్ళింది అనే విషయం సీసీ టీవీ కెమెరాల ద్వారా తెలిసింది.

Advertisement

CM Revanth Reddy: కొండారెడ్డిపల్లి దసరా వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, జమ్మిచెట్టు వద్ద ప్రత్యేక పూజలు, పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం

Arun Charagonda

సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారి దసరాకు తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికు వచ్చారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డికి ఘనస్వాగతం లభించింది. కొండారెడ్డిపల్లి గ్రామస్తుల ఆనందోత్సాహాల మధ్య శనివారం ముఖ్యమంత్రి దసరా పండుగ జరుపుకున్నారు. గ్రామస్తులంతా ఊరేగింపుగా జమ్మి చెట్టువద్దకు రాగా ముఖ్యమంత్రి గారు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి జమ్మి పూజలో పాల్గొన్నారు. అంతకు ముందు వారు గ్రామంలోని శ్రీశ్రీశ్రీ కోట మైసమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Alai Balai: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ లో నేడు దత్తన్న ‘అలయ్ బలయ్’.. హాజరుకానున్న ప్రముఖులు

Rudra

హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ లో నేడు అలయ్ బలయ్ కార్యక్రమం జరగనుంది.

CPI Narayana Fires On Nagarjuna: నాగార్జున పరువు బిగ్ బాస్ షోతో ఎప్పుడో పోయింది.. కొండా సురేఖపై పరువు నష్టం దావా వేయడం ఓ జోక్ లా ఉంది.. సీపీఐ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు

Rudra

తెలంగాణ మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై చేసిన వ్యాఖ్యలపై సీనియర్ నటుడు నాగార్జున కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యంగ్యంగా స్పందించారు.

Heavy Rains in AP: ఏపీకి భారీ వర్ష సూచన.. రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తారంగా వర్షాలు.. మూడు రోజులపాటు వానలే వానలు

Rudra

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సోమవారంనాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ విభాగం తెలిపింది.

Advertisement

50 Members Hospitalized in Narayanakhed: బావి నీళ్లు తాగి 50 మందికి తీవ్ర అస్వ‌స్థ‌త‌, ఇద్ద‌రు మృతి, ప‌లువురి ప‌రిస్థితి విష‌మం, మిష‌న్ భ‌గీర‌థ నీళ్లు రాక‌పోవ‌డంతో బావిలో నీరు తాగిన గ్రామ‌స్తులు, సంగారెడ్డి జిల్లా నారాయ‌ణ‌ఖేడ్ లో ఘ‌ట‌న‌

VNS

బావి నీళ్లు తాగిన 50 మంది తీవ్ర అస్వ‌స్థ‌త‌కు (50 Members Hospitalized) గుర‌య్యారు. నీళ్లు తాగిన కాసేప‌టికే వారంతా వాంతులు, విరేచ‌నాల‌కు గుర‌య్యారు. బాధితులంతా బీసీ కాల‌నీకి చెందిన వారు. స‌మాచారం అందుకున్న అధికారులు అప్ర‌మ‌త్త‌మై.. అస్వ‌స్థ‌త‌కు గురైన వారిని చికిత్స నిమిత్తం నారాయ‌ణ‌ఖేడ్‌లోనిప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. అందులో ఇద్ద‌రు మృతి చెందారు.

Heavy Rain Alert For AP: ఏపీకి భారీ వ‌ర్ష సూచ‌న‌, రాబోయే నాలుగు రోజులు ప‌లు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం, ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం ప్ర‌భావంతో ఈ జిల్లాల‌కు అల‌ర్ట్

VNS

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌నం (Air circulation) కొన‌సాగుతోంది. దీని ప్ర‌భావంతో ఈ నెల 14వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్ప‌పీడ‌నం ఏర్ప‌డ‌నుంది. ఉప‌రిత‌ల ఆవ‌ర్త‌న ప్ర‌భావంతో రాగ‌ల 24 గంట‌ల్లో కోస్తాంధ్ర‌, రాయ‌ల‌సీమ‌లో పిడుగుల‌తో కూడిన తేలిక‌పాటి నుంచి మోస్త‌రు వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు పేర్కొన్నారు

Professor GN Saibaba Passes Away: మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా కన్నుమూత...నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

sajaya

ఢిల్లీ యూనివర్సిటీలో మాజీ ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా కన్నుమూత.. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబా..నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాయిబాబా మృతి..

Jani Master Mother: జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు...కొడుకు జైలుకు వెళ్లడంతో బెంగతో ఉన్న తల్లి బీబీ ఖాన్ కు తీవ్ర అస్వస్థత..

sajaya

బ్రేకింగ్ న్యూస్...జానీ మాస్టర్ తల్లికి గుండెపోటు...జానీ మాస్టర్ జైలుకు వెళ్లడంతో బెంగతో ఉన్న తల్లి బీబీ ఖాన్ గుండెపోటుకు గురైంది. ఆమెను నెల్లూరులోని బొల్లినేని ఆస్పత్రికి తరలించగా ఐసీయూలో చికిత్స పొందుతుంది.

Advertisement

Astrology: అక్టోబర్ 19 నుంచి ఈ 4 రాశుల వారికి వాపీ యోగం ప్రారంభం..ఈ రాశుల వారు ఆకస్మికంగా ధనవంతులు అవుతారు..ఆస్తులు అమాంతం పెరుగుతాయి..

sajaya

Astrology: అక్టోబర్ 19 నుంచి ఈ 4 రాశుల వారికి వాపీ యోగం ప్రారంభం..ఈ రాశుల వారు ఆకస్మికంగా ధనవంతులు అవుతారు..ఆస్తులు అమాంతం పెరుగుతాయి..

Andhra Pradesh: ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై యువకుల దాడి, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో ఘటన

Arun Charagonda

ఆర్టీసీ బస్సు డ్రైవర్‌పై యువకుల దాడి కలకలం రేపింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో రోడ్డుకు అడ్డంపై ఉన్న బైక్ ను తీయమని కోరారు ఆర్టీసీ బస్సు డ్రైవర్. డ్రైవర్ ను దుర్భాషలాడుతూ వాగ్వాదానికి దిగారు ఇద్దరు యువకులు. డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా యువకులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

CM Revanth Reddy Dussehra Celebrations: సొంతూరు కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌ రెడ్డి... తొలిసారి స్వగ్రామంలో సీఎం హోదాలో రేవంత్‌ దసరా వేడుకలు...

sajaya

నాగర్‌ కర్నూల్‌: సొంతూరు కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్‌ రెడ్డి దసరా వేడుకలు. సీఎం హోదాలో తొలిసారి స్వగ్రామంలో రేవంత్‌ దసరా వేడుకలు. కొండారెడ్డిపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్‌ రెడ్డి.

Andhra Pradesh: కాలువలోకి దూసుకెళ్లిపోయిన కారు, అద్దాలు పగులగొట్టి తండ్రి,కూతురు ప్రాణాలను కాపాడిన యువకుడు..వీడియో ఇదిగో

Arun Charagonda

పశ్చిమగోదావరి జిల్లా తణుకు షుగర్ ఫ్యాక్టరీ ఎదురుగుండా కాలువలకు దూసుకెళ్లిపోయింది కారు.నీళ్లలో పూర్తిగా మునిగిపోగా వెంటనే స్పందించి కాలువలో మునిగి సుత్తితో కార్ అద్దాన్ని బద్దలు కొట్టి తండ్రి కూతుళ్ళ ప్రాణాలను కాపాడాడు యువకుడు.

Advertisement
Advertisement