రాష్ట్రీయం

Ponnam Prabhakar:దేశానికే ఆదర్శంగా బీసీ కులగణన, ప్రతి ఒక్కరూ సహకరించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్, కులగణన పూర్తయ్యాకే ఎన్నికలు

Arun Charagonda

సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై సర్వే కోసం తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 18 విడుదల చేసిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. దేశంలోనే ఆదర్శంగా ఉండేలా 60 రోజుల పాటు సర్వే కొనసాగుతుందని...బీసీ కులగణన అయ్యాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్నారు. కులగణనకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు పొన్నం.

Jagtial: వివాదంలో జగిత్యాల ఫారెస్ట్ అధికారులు, వన్యప్రాణి మాంసంతో పార్టీ, ప్రశ్నించిన మీడియాపై దురుసు ప్రవర్తన...వీడియో ఇదిగో జగిత్యాలలో ఫారెస్ట్ ఆఫీస్‌లో అధికారుల లిక్కర్ దావత్

Arun Charagonda

వన్య ప్రాణి మాంసంతో ఫారెస్ట్ ఆఫీసర్ల దసరా దావత్ చేసుకున్నారని అనుమానం జగిత్యాలో కలకలం రేపింది. నెమలి, అడవి పంది మాంసంగా అనుమానాలు, మాంసం శాంపిల్ తీసుకుని ల్యాబ్‌కి పంపిస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని..ఈ దావత్ కు హాజరైన జిల్లా ఫారెస్ట్ సిబ్బంది, కొందరు బీట్, సెక్షన్ ఆఫీసర్లు హాజరైనట్లు తెలుస్తోండగా ఇదేంటని ప్రశ్నించిన మీడియా పై దురుసుగా ప్రవర్తించారు ఆఫీసర్లు.

Psycho Hulchul In Vijayawada: విజయవాడలో సైకో హల్చల్, స్థానికులపై దాడికి ప్రయత్నం, కట్టేసి కొట్టిన ప్రజలు..వీడియో ఇదిగో

Arun Charagonda

విజయవాడ పాతబస్తీ వించిపేటలో సైకో హల్చల్ చేశారు. పాతబస్తీ పంజా సెంటర్‌కి సమీపంలో నైజాం గేట్ సెంటర్లో ఓ సైకో స్థానికులను భయబ్రాంతులకు గురి చేస్తూ అలజడి సృష్టించాడు.వించి పేటలో టిఫిన్ బండి నడుపుకునే స్థానిక మహిళ సరుకుల కోసం షాప్‌కి వస్తే.. ఒక్కసారిగా ఆ మహిళ పై పడి దాడి చెయ్యబోయడు.వెంటనే ఆ మహిళ భయంతో పరుగులు తీస్తుంటే అది గమనించిన స్థానికులు దుండగుడిని పట్టుకొని ప్రక్కనే ఉన్న స్తంబానికి కట్టి దేహశుద్ధి చేశారు.

Ponnam Prabhakar: దసరా...ట్రాఫిక్ రూల్స్‌పై ప్రతిజ్ఞ చేపించిన మంత్రి పొన్నం ప్రభాకర్, మద్యం తాగి వాహనాలు నడపరాదని ప్రజలకు విన్నపం

Arun Charagonda

విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని హుస్నాబాద్ ప్రజల చేత ట్రాఫిక్ రూల్స్ పై ప్రతిజ్ఞ చేపించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, మద్యం తాగి వాహనాలు నడపరాదని , మన ప్రాణాలను మనం రక్షించుకోవడానికి ఇతరులకు అపాయం కలగకుండా చూడడానికి స్వీయ రక్షణకై ప్రతిజ్ఞ చేపించారు.

Advertisement

AP Horror: తండ్రీ కొడుకుల‌ను కత్తులతో బెదిరించి.. అత్తాకోడ‌ళ్ళ‌పై సామూహిక లైంగిక దాడి.. శ్రీ‌స‌త్య‌సాయి జిల్లాలో దారుణం

Rudra

ఏపీలోని శ్రీ‌స‌త్య‌సాయి జిల్లా చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు వివాహితులపై గ్యాంగ్ రేప్ జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Jani Master Case: ఆమె నన్ను లైంగికంగా వేధించింది.. లిఫ్ట్, రెస్ట్ రూమ్, లాడ్జి ఇలా ఎక్కడపడితే, అక్కడ నాపై లైంగిక దాడి చేసి.. నా న్యూడ్ ఫోటోలు తీసి బెదిరించింది... జానీమాస్టర్‌ మీద కేసు పెట్టిన యువతిపై మరో యువకుడి సంచలన ఆరోపణలు.. పోలీసులకు ఫిర్యాదు

Rudra

ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీమాస్టర్ లైంగిక వేధింపుల కేసులో కీలక ట్విస్ట్ చోటుచేసుకుంది. జానీ మాస్టర్‌ పై కేసు పెట్టిన అసిస్టింట్ కొరియోగ్రాఫర్‌ పై మరో యువకుడు లైంగిక దాడి ఆరోపణలు చేశాడు.

Pawan Kalyan: కాకినాడ డీఎఫ్‌వో రవీంద్రనాథ్‌ రెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్, మైనింగ్ వ్యవహారాల్లో తలదూర్చడంపై ఆగ్రహం, చర్యలకు సిఫారసు

Arun Charagonda

తన పేరు వాడుకున్న అధికారిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. కాకినాడ DFO డి.రవీంద్రనాథెడ్డి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో తనకు సన్నిహిత సంబంధాలున్నాయంటూ మైనింగ్ వ్యవహారాల్లో తలదూరుస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో తన పేరు, పేషీ పేరు వాడటంపై ఆగ్రహించిన పవన్ కళ్యాణ్, విచారించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాడు.

Vijayawada Durgamma: అమ్మా దుర్గమ్మా.. నమోస్తుతే..! శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా దర్శనమిచ్చిన బెజవాడ దుర్గమ్మ.. అద్భుతమైన వీడియో మీరూ చూడండి!

Rudra

విజయవాడ ఇంద్రకీలాద్రిపై నేటితో శరన్నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పదో రోజు శ్రీరాజరాజేశ్వరీ దేవి అలంకారంలో బెజవాడ దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Advertisement

Devi Idol Vandalized: ‘తిండి దొరక్కపోవడంతోనే..’ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ లో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగుడు.. మీడియాకు వివ‌రాలు వెల్ల‌డించిన పోలీసులు (వీడియోతో)

Rudra

హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎగ్జిబిషన్ సొసైటీ, సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమ్మ‌వారి విగ్ర‌హాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే.

Happy Dussehra Wishes 2024 In Telugu: నేడు విజయదశమి.. ఈ మహా పర్వదినంనాడు మీ బంధు మిత్రులకు లేటెస్ట్ లీ అందించే హెచ్ డీ ఫోటోల ద్వారా దసరా శుభాకాంక్షలు తెలియజేయండి.

Rudra

అమ్మలుగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆ దుర్గమ్మ. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రతి సంవత్సరం నవరాత్రి పండుగ ముగింపులో విజయదశమి దసరా పండుగను జరుపుకుంటారు.

Ram Charan Bathukamma Dance: బతుకమ్మ సంబురాల్లో రామ్ చరణ్ సందడి.. మహిళలతో కలిసి ఆడిపాడిన మెగా పవర్ స్టార్ (వీడియో)

Rudra

తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా బతుకమ్మ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంబరాన్ని అంటాయి. తొమ్మిది రోజుల పాటు ఈ వేడుకలు ఉత్సాహంగా జరిగాయి.

Traffic Restrictions in Hyderabad: ఉప్ప‌ల్ వైపు వెళ్తున్నారా? ఇవి తెలుసుకోక‌పోతే ట్రాఫిక్ లో చిక్కుకుంటారు, రెండో టీ-20 మ్యాచ్ సంద‌ర్భంగా ట్రాఫిక్ ఆంక్ష‌లు

VNS

ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఈ నెల 12న భారత్‌– బంగ్లాదేశ్‌ల మధ్య టీ–20 క్రికెట్‌ మ్యాచ్‌ (IND Vs BNG T-20) జరుగనున్న నేపథ్యంలో ఉప్పల్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు రాచకొండ కమిషనర్‌ సుధీర్‌ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. మ్యాచ్‌ జరిగే సమయాల్లో ఉప్పల్‌ స్టేడియంవైపు భారీ వాహనాలను (traffic Restrictions in Hyderabad) అనుమతించరు.

Advertisement

Indiramma Committees: దసరా కానుక..ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం

Arun Charagonda

ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. గ్రామలు, పట్టణాల్లో ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు పంచాయతీ/మున్సిపల్ వార్డు స్థాయిలో ఇందిరమ్మ కమిటీల ఏర్పాటు చేయనున్నారు.

Mohammed Siraj As Telangana DSP: క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌కు డీఎస్పీ పోస్టు, నియామక పత్రాలు అందజేసిన డీజీపీ జితేందర్ రెడ్డి

Arun Charagonda

హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కు డీఎస్పీ ఉద్యోగం ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇందుకు సంబంధించిన నియామక పత్రాలు అందించారు డీజీపీ జితేందర్ రెడ్డి . ఇప్పటికే సిరాజ్ కు గ్రూప్ 1 పోస్టును సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.

CM Revanth Reddy On RS Praveen Kumar: ఆర్‌ఎస్ ప్రవీణ్‌ కుమార్‌కు ఏమైందో?, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేస్తుంటే ఎందుకు తప్పుపడుతున్నారని మండిపడ్డ సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు ఏమైందో అర్ధం కావడం లేదు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే తనకు గౌరవం ఉందని, ఆయన ఏ రాజకీయ పార్టీలో ఉన్నా అభ్యంతరం లేదన్నారు.

Telangana Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనున్న ఉపరితల ఆవర్తనం, రానున్న మూడు రోజుల పాటు తెలంగాణకు వర్ష సూచన, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ

Hazarath Reddy

తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Advertisement

Pawan Kalyan: ముగ్గురిని పెళ్లి చేసుకున్న పవన్‌కు డిప్యూటీ సీఎం పదవా?, రాజీనామా చేయాలన్న దివ్వెల మాధురి, మండిపడుతున్న పవన్ ఫ్యాన్స్‌

Arun Charagonda

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై సంచలన కామెంట్స్ చేశారు దివ్వెల మాధురి. ఓ ఇంటర్వ్యూలో దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి మాట్లాడిన మాధురి..ముగ్గురిని పెళ్లి చేసుకొని డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలన్నారు. వ్యక్తిగత విషయాలను రాజకీయాలకు ఆపాదించవద్దని పవన్ ఫ్యాన్స్ హితవు పలుకుతున్నారు.

Kondareddy Palle: రూ.200 కోట్లతో సీఎం రేవంత్ రెడ్డి సొంతగ్రామం కొండారెడ్డి పల్లిలో అభివృద్ధి పనులు, గ్రామ పంచాయతీకి రేవంత్ తండ్రి పేరు

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డి సొంత ఊరులో అభివృద్ది పనులు జోరందుకున్నాయి. రూ.200 కోట్లతో ముస్తాబవుతోంది కొండారెడ్డిపల్లి. కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధికి ఇప్పటికే రూ.30 కోట్లు మంజూరు కాగా.. మరో రూ.170 కోట్ల పనులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు అధికారులు.

Nalgonda: నల్గొండ ఎన్‌హెచ్‌-65పై దగ్దమైన లారీ, డివైడర్‌ను ఢీకొట్టి డీజిల్ ట్యాంక్ పగిలి అంటుకున్న మంటలు, ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్..వీడియో ఇదిగో

Arun Charagonda

నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలోని ఎన్‌హెచ్‌-65పై సిమెంట్‌ బస్తాలతో వేగంగా వెళ్తున్న లారీ డివైడర్‌ను ఢీకొట్టింది. డీజిల్ ట్యాంక్ పగిలి లారీ పూర్తిగా దగ్ధమైంది. లారీ డ్రైవర్ బయటకు దూకి అతని ప్రాణాలను కాపాడుకున్నాడు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

Kinnera Mogulaiah: అమానుషం..పద్మ శ్రీ మొగులయ్య ఇంటి కాంపౌండ్ వాల్‌ను కూల్చేసిన గుర్తు తెలియని వ్యక్తులు, పోలీసులకు ఫిర్యాదు

Arun Charagonda

రాష్ట్ర ప్రభుత్వం మొగులయ్యకు హయత్ నగర్లో కేటాయించిన స్థలంలో నిర్మించుకున్న కాంపౌండ్ వాల్‌ను రాత్రికి రాత్రి కూల్చివేశారు గుర్తుతెలియని వ్యక్తులు. ఈ నేపథ్యంలో సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు పోలీసులు. తనకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వం స్పందించాలని కిన్నెర మొగులయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement