రాష్ట్రీయం

Godavari Water Level Rise: భద్రాచలం వద్ద 47 అడుగులు దాటిన గోదావరి నీటిమట్టం, పోలవరం ముంపు మండలాలకు రాకపోకలు బంద్, రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్న అధికారులు

Hazarath Reddy

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు ఎక్కువవుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం (Godavari Water Level Rise) పెరుగుతోంది. సోమవారం 26 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం.. ఈ రోజు మధ్యాహ్నానికి 47 అడుగులు దాటి ప్రవహిస్తోంది.

Ganesh Visarjan in Hussain Sagar: హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనంకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌, చివరి సమయంలో ధిక్కరణ పిటిషన్‌ సరికాదని వ్యాఖ్యలు

Hazarath Reddy

హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో గణేశ్ నిమజ్జనం వేడుకలకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటెప్ట్ పిటిషన్ మెయింటైనబుల్ కాదంటూ పిటిషన్ ను కొట్టివేసింది. మరో పిటిషన్ మీద హైకోర్టులో విచారణ జరిగింది. 2021 ఆదేశాలు (Ganesh Visarjan in Hussain Sagar) యధావిధిగా కొనసాగుతాయని న్యాయస్థానం తెలిపింది.

Merugu Nagarjuna Slams Anitha: మా కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే తీవ్ర పరిణామాలు తప్పవు, టీడీపీకి వైసీపీ మాజీ మంత్రి మేరుగు నాగార్జున వార్నింగ్

Hazarath Reddy

ఏపీలోని పల్నాడు జిల్లాల్లో అధికార కూటమి ప్రభుత్వం ఇష్టానురీతిన వ్యవహరిస్తున్నారని వైసీపీ నేత , మాజీ మంత్రి మేరుగు నాగార్జున(Merugu Nagarjuna) ఆరోపించారు. వైసీపీ నాయకులను భయపెట్టాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

Vangalapudi Anitha on Jagan: జగన్‌మోహన్‌రెడ్డిపై దేశ ద్రోహం కేసు పెట్టాలి, హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

విజయవాడలో భారీ వరదల ముంపునకు కూటమి ప్రభుత్వమే కారణమంటూ వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. జగన్‌ రెండుసార్లు బయటకొచ్చి తమ ప్రభుత్వంపై బురద జల్లి వెళ్లారని విమర్శించారు.

Advertisement

Andhra Pradesh Rains: ఏపీకి పొంచి ఉన్న మరో తుఫాను ముప్పు, ఈనెల 20–22 మధ్య బంగాళా­ఖాతంలో మరో అల్పపీడనం, ఉత్తర కోస్తాకు భారీ వర్ష సూచన

Hazarath Reddy

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం సోమవారం ఉదయం ఒడిశాలోని పూరీ సమీపంలో తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది వాయవ్య దిశగా ఒడిశా మీదుగా ప్రయాణిస్తూ వాయుగుండంగా బలహీనపడనుంది.

Nara Lokesh Slams Jagan: లక్షలాది మంది జలసమాధి అయ్యేలా జగన్‌ పన్నిన కుట్ర బట్టబయలు, ఎక్స్ వేదికగా నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

అధికారం అండతో సైకో జగన్‌ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపారు. 5 ఊళ్లను నామరూపాలు లేకుండా చేశారు. ఇదే ప్లాన్‌ ప్రకారం ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీని ఢీకొని కూల్చేయాలని కుట్ర చేశారు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, విజయవాడ బస్టాండ్‌లో బూతులు తిట్టుకుంటూ తన్నుకున్న డ్రైవర్లు, బస్సు ఇంజిన్ ఆన్‌లో ఉండడంతో..

Hazarath Reddy

విజయవాడ ఆర్టీసీ బస్టాండ్‌లో ఫ్లాట్‌ఫాంపై బస్సులు నిలిపే విషయంలో ఇద్దరు డ్రైవర్ల మధ్య తలెత్తిన గొడవ తీవ్ర కొట్లాటకు దారి తీసింది. ఇద్దరూ పరస్పరం బూతులు తిట్టుకుంటూ దాడిచేసుకున్నారు. ప్రయాణికులు విడిపించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

Telangana: అత్త మరణాన్ని తట్టుకోలేక అపార్ట్మెంట్ భవనంపై నుంచి దూకి కోడలు ఆత్మహత్య, బేగంపేటలో విషాదకర ఘటన, వీడియో ఇదిగో..

Hazarath Reddy

తెలంగాణ‌లో విషాద ఘ‌ట‌న చోటుచేసుకుంది. అత్త మరణం తట్టుకోలేక మనస్తాపానికి లోనై కోడలు ఆత్మహత్య చేసుకుంది. చెన్నైకి చెందిన హరిత్ ప్రభు కుటుంబం బేగంపేటకు వచ్చి స్థిరపడింది. కొన్ని రోజుల క్రితం హరిత్ తల్లి మృతి చెందగా అప్పటినుంచి హరిత్ భార్య రంజీత తీవ్ర మనస్తాపానికి గురైంది.

Advertisement

TDP vs Janasena Fight: వీడియో ఇదిగో, మచిలీపట్నంలో రక్తమొచ్చేలా తన్నుకున్న టీడీపీ, జనసేన కార్యకర్తలు, బ్యానర్‌లో ఫోటోలు వేయకపోవడంపై అభ్యంతరం

Hazarath Reddy

మచిలీపట్నంలో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య బ్యానర్‌ గొడవ తారాస్థాయికి చేరింది. పరాసుపేటలో వినాయకచవితి శుభాకాంక్షల పేరుతో కూటమి నేతలు బ్యానర్ ఏర్పాటు చేశారు. తమ ఫోటోలు వేయకపోవడంపై జనసేన నేతలు అభ్యంతరం తెలిపారు. రెండు రోజుల క్రితం రాత్రి వేళ బ్యానర్‌ను జనసేన నేతలు యర్రంశెట్టి నాని, శాయన శ్రీనివాసరావు చింపివేశారు.

BJP MLA Alleti Maheshwar Reddy: హైడ్రా పేరుతో వందలు, వేల కోట్ల వసూళ్లు, సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్‌ మహా నగరంలో చెరువుల సంరక్షణ, అక్రమ నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ(హైడ్రా) దూసుకెళ్తోంది. ఇప్పటికే హైడ్రా పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఈ కూల్చివేతలపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Attack on Namburu Sankara Rao: వీడియో ఇదిగో, వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మీద కర్రలతో టీడీపీ శ్రేణుల దాడి

Hazarath Reddy

వరద ముంపు ప్రాంతాల పర్యటనకు వస్తున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు మీద కర్రలతో టీడీపీ శ్రేణులు దాడి చేశారు. పల్నాడు జిల్లాలోని అమరావతి మండలంలో వరద ముంపు ప్రాంతాల పర్యటనకు బయలుదేరిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావుపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి.

Ganesh Visarjan 2024: హైదరాబాద్ వాసులకు షాక్, హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ వెలిసిన ఫ్లెక్సీలు

Hazarath Reddy

గణేష్‌ నిమజ్జనం అంటే హుస్సేన్ సాగర్ గుర్తుకు వస్తుంది.అయితే ఈ ఏడాది హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి (Ganesh Visarjan 2024) అధికారులు అనుమతించడం లేదు. ఇందులో భాగంగా ట్యాంక్‌బండ్‌ మార్గంలో భారీగా ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. వినాయక నిమజ్జనానికి అనుమతి లేదని ఫ్లెక్సీలు (Flexis Viral in Social Media) పెట్టారు.

Advertisement

Andhra Pradesh Rains: వీడియోలు ఇవిగో, ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటుతూ కొట్టుకుపోయిన యువకులు, ఏపీలో పలు జిల్లాల్లో ఘటనలు

Hazarath Reddy

ఏపీని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటుతూ పలువురు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా వాగు దాటుతున్న యువకుడు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

Eluru Car Fire Video: వీడియో ఇదిగో, ఏలూరు వెళుతూ మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైన కారు, తృటిలో ప్రాణాలతో బయటపడ్డ ప్రయాణికులు

Hazarath Reddy

ఏలూరు జిల్లా భీమడోలు మండలం పానసానిపల్లి సమీపంలో కారు దగ్ధం అయింది. రాజమండ్రి నుండి విజయవాడ వెళ్తున్న సమయంలో పోనసానిపల్లి దాటిన తర్వాత ఏసీ నుండి పొగలు వచ్చాయి. కొద్దిసేపటికి మంటలు చెలరేయి కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్న వారు అప్రమత్తమై దిగిపోవడంతో ప్రమాదం తప్పింది.

Vijayawada Landslide: వీడియో ఇదిగో, విజయవాడలో కొండచరియలు విరిగిపడి ఒకరు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

భారీ వర్షాల కారణంగా విజయవాడలో ఇటీవల కొండచరియలు విరిగిపడి ఐదుగురు మరణించిన ఘటన మర్చిపోకముందే మరోమారు అలాంటి ఘటనే జరిగింది. మాచవరం వద్ద కొండచరియలు విరిగిపడడంతో ఓ వ్యక్తి మరణించగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

Ganesh Immersion Tragedy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. వినాయకుడి విగ్రహం మీదపడి ఇద్దరు యువకులు మృతి

Rudra

కడపలోని వీరపునాయునిపల్లె మండలం మొగమూరు వాగులో ఘోరం జరిగింది. వినాయక నిమజ్జనం చేస్తున్న సమయంలో వినాయకుడి విగ్రహం మీదపడి ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను వంశీ, రాజాగా గుర్తించారు.

Advertisement

Viral Video: కళ్ల ముందే మద్యం సీసాలను ధ్వంసం చేస్తుంటే భరించలేకపోయిన మందుబాబులు.. ఎగబడి ఎత్తుకెళ్లిన వైనం.. గుంటూరులో ఘటన (వీడియో వైరల్)

Rudra

గుంటూరు జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వివిధ కేసుల్లో పట్టుబడిన రూ. 50 లక్షల విలువైన మద్యాన్ని పోలీసులు సోమవారం ఏటూకూరు రోడ్డులోని డంప్ యార్డులో ధ్వంసం చేశారు.

Vande Bharat Express: తెలంగాణకు మరో వందే భారత్ ఎక్స్ ప్రెస్.. సికింద్రాబాద్ – నాగ్‌ పూర్ మధ్య సేవలు.. 15న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం

Rudra

దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను తక్కువ సమయంలో గమ్యాలకు చేర్చే సెమీ హైస్పీడ్ ట్రైన్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ మరో రైలు తెలంగాణలో ప్రారంభం కానున్నది.

Vijayawada Floods: వీడియో ఇదిగో, విజయవాడలో వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వో సస్పెండ్, ఆహారం అందలేదని ప్రశ్నించినందుకు చెంప పగలగొట్టిన జయలక్ష్మి

Hazarath Reddy

విజయవాడలో వరద బాధితులపై చేయి చేసుకున్న వీఆర్వో జయలక్ష్మి తీరుపై ప్రభుత్వం సీరియస్‌ అయింది. వీఆర్వోను విధుల నుంచి తప్పిస్తున్నట్లు కృష్ణా జిల్లా కలెక్టర్‌ సృజన వెల్లడించారు. ఆమెకు షోకాజ్‌ నోటిసులు ఇచ్చినట్లు తెలిపారు.

Ganesh Idol with Jaggery: వీడియో ఇదిగో, 20 వేల కేజీల బెల్లంతో వినాయకుడు, గాజువాకలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న గణపతి విగ్రహం

Hazarath Reddy

విశాఖ పట్నంలోని గాజువాకలో ప్రత్యేకమైన గణపతి విగ్రహం కనువిందు చేస్తోంది. 20 వేల కేజీల బెల్లంతో వినాయకుడుని తయారు చేశారు. దీని తయారీకీ సుమారు రెండు నెలల సమయం పట్టింది.

Advertisement
Advertisement