రాష్ట్రీయం
SC on CM Revanth Reddy's Remarks: సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలాగే మాట్లాడుతారా ? రేవంత్ రెడ్డిపై మండిపడిన సుప్రీంకోర్టు
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని సుప్రీం బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా.. కవిత బెయిల్ తీర్పుపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం ప్రస్తావించింది.
Harishrao: సీఎం రేవంత్ రెడ్డి గజదొంగ, దమ్ముంటే హైడ్రా ఆఫీస్ కూల్చండి హరీశ్ సవాల్, రుణమాఫీపై తప్పుదారి పట్టించేందుకేనని కామెంట్
Arun Charagondaరుణమాఫీపై ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి తప్పుదారి పట్టిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 10 ఏళ్లు కష్టపడి నిర్మించిన హైదరాబాద్ బ్రాండ్ ని కూల్చేశారు అని దుయ్యబట్టారు హరీశ్. బుద్ధా భవనములోనే హైడ్రా ఆఫీస్ ఉంది, దమ్ముంటే దానిని కూల్చండని సవాల్ విసిరారు. జీహెచ్ ఎంసి బిల్డింగ్ కూడా నాలాపైనే ఉందని దానిని కూలగొట్టాలన్నారు. జలవిహార్, నెక్లెస్ రోడ్, నెక్లెస్ రోడ్ లో ఉన్న బోట్స్ క్లబ్ అన్నింటిని కూలగొట్టాలన్నారు హరీశ్.
AP DY CM Pawan Kalyan: పిఠాపురం మహిళలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గిఫ్ట్, ఆగస్టు 30న సామూహిక వరలక్ష్మీ వ్రత పూజ, 12 వేల చీరలు పంపిణీ చేయనున్న జనసేనాని
Arun Charagondaఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన శైలీలో దూసుకుపోతున్నారు. ఓ వైపు పాలనలో తన మార్క్ చూపిస్తున్న పవన్...తాజాగా తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా పిఠాపురం మహిళలకు శ్రావణమాసం గిఫ్ట్‌ను అందించనున్నారు. ఈ నెల 30న పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఉచిత వరలక్ష్మి వ్రత పూజా కార్యక్రమం, వరలక్ష్మీ వ్రతం చేసుకునే ఆడపడుచులకు 12 వేల చీరలు పంపిణి చేయనున్నారు.
Kakani Govardhan Reddy on MPs Resignation: పార్టీ మారిన వారు కాలగర్భంలో కలిసిపోవాల్సిందే, ఎవరు వెళ్లినా జగన్‌కు నష్టమేమి లేదని తెలిపిన కాకాణి
Hazarath Reddyవైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేసిన సంగతి విదితమే. రాజ్యసభ సభ్యులు పార్టీ మార్పుపై స్పందించిన మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల దృష్టి మరల్చేందుకే రాజ్యసభ సభ్యులను పార్టీలోకి చేర్చుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
Telangana: వీడియో ఇదిగో, పెళ్లిలో మటన్ కోసం తలలు పగలగొట్టుకున్నారు, పెళ్లికొడుకు తరపు వారికి మటన్ తక్కువ వేశారని కర్రలు, రాళ్లతో దాడి
Hazarath Reddyనిజామాబాద్ జిల్లా నవీపేట్లో జరిగిన ఓ వివాహ వేడుకలో పెళ్లికొడుకు తరపు వారికి మటన్ తక్కువ వేశారని కర్రలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. దీంతో ఫంక్షన్ హాల్ రణరంగాన్ని తలపించింది. రాళ్లతో, కర్రలతో దాడి చేసుకోవడంతో చాలామందికి తలలు పగిలి గాయాలయ్యాయి. ఈ ఘటనలో పలువురు గాయపడగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
CM Revanth Reddy On Hydra: హైడ్రా పేరుతో బెదిరింపులు, సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్, హైడ్రా పేరుతో అవినీతి చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరిక
Arun Charagondaహైదరాబాద్ లో హైడ్రా పేరు చెప్పి భయపెట్టి,బెదిరించి అవినీతికి పాల్పడితే సహించేది లేదని తేల్చిచెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. కొందరు కిందిస్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై స్పందించారు రేవంత్.
Andhra Pradesh Politics: వైసీపీకి, రాజ్యసభ పదవులకు రాజీనామా చేసిన మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు, టీడీపీలో చేరునున్న మోపిదేవి
Hazarath Reddyరాజ్యసభ పదవికి, వైసీపీకి మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావులు రాజీనామా చేశారు. పార్లమెంట్‌లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌కు రాజీనామా పత్రాలను ఇరువురూ అందజేశారు. స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా పత్రాలను అందజేశారు. అనంతరం వైసీపీకి సైతం రాజీనామా చేశారు.
SC On Note For Vote Case: ఓటుకు నోటు కేసు..బీఆర్ఎస్ మాజీ మంత్రికి షాక్, కేసును భోపాల్‌కు బదిలీ చేయాలన్న జగదీశ్ రెడ్డి పిటిషన్‌ను తోసిపుచ్చిన ధర్మాసనం, అలా చేస్తే న్యాయవ్యవస్థపై నమ్మకం లేనట్లేనని వ్యాఖ్య
Arun Charagondaఢిల్లీ ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణను తెలంగాణ నుంచి భోపాల్‌కు బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వేసిన పిటిషన్‌ను జస్టిస్ బీఆర్ గవై ధర్మాసనం తోసిపుచ్చింది. కేవలం అపోహలతో విచారణను బదిలీ చేస్తే న్యాయవ్యవస్థపై నమ్మకం లేదట్లే అవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. అంతేగాదు ఈ కేసులో విచారణకు ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ను నియమిస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.
Hyderabad Horror: ప్రియురాలిపై కత్తితో దాడి చేసిన ప్రియుడు ,ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి, గచ్చిబౌలి పీఎస్ పరిధిలో ఘటన, మృతురాలు బ్యూటిషిన్‌గా గుర్తింపు
Arun Charagondaహైదరాబాద్ గచ్చిబౌలిలో అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు ప్రియుడు. రక్తపు మడుగులో ఉన్న యువతిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలు హెయిర్ సెలూన్ లో బ్యూటిషన్ గా పనిచేస్తునట్లు గుర్తించారు పోలీసులు.
Nagarjuna Sagar Project Gates Open: శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు పోటెత్తిన వరద, సాగర్ 26 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల...వీడియో
Arun Charagondaశ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద పోటెత్తింది. దీంతో సాగర్ 26 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ప్రస్తుతం ప్రాజెక్టు ఇన్ ఫ్లో: 257634 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో: 257634 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం : 590 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు
Mopidevi Venkataramana Vs Ambati Rambabu: టీడీపీలోకి మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు..పార్టీ మారినోళ్ళు పరువు పొగొట్టుకున్నారంటూ అంబటి రాంబాబు ఫైర్
Arun Charagondaఏపీలో వైసీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి రాజీనామా చేయగా తాజాగా ఇద్దరు ఎంపీలు సైతం రిజైన్ చేశారు. ఇప్పటికే వైసీపీ రాజీనామా చేసిన రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు ఇవాళ రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి తమ ఎంపీ పదవులకు రాజీనామా సమర్పించనున్నారు.
Andhra Pradesh: నెల్లూరులో ఆర్టీసీ బస్సు బోళ్తా, 5గురికి తీవ్ర గాయాలు, ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణీకులు
Arun Charagondaనెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం మోమిడి సమీపంలో ఆర్టీసీ బస్సు బోళ్తా పడింది. నెల్లూరు నుంచి ముత్తుకూరు మీదుగా కోటకు వెళుతుండగా మోమిడి వద్ద అదుపు తప్పి బస్సుకు ప్రమాదం జరుగగా ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
MLC Kavitha First Tweet: జైలు నుండి బయటకు వచ్చిన 5 నెలల తర్వాత ఎమ్మెల్సీ కవిత ఫస్ట్ ట్వీట్, సత్యమేవ జయతే అంటే కేటీఆర్‌తో ఉన్న ఫోటో షేర్ చేసిన కవిత
Arun Charagondaఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో 165 రోజుల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు ఎమ్మెల్సీ కవిత. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకోగా సుదీర్ఘ విరామం తర్వాత ఎక్స్ వేదికగా తొలి ట్వీట్ చేశారు. సత్యమేవ జయతే అంటూ భర్త అనిల్, సోదరుడు కేటీఆర్‌తో ఉన్న ఫోటోను షేర్ చేశారు
Andhra Pradesh: ఇలా జైలు నుండి వచ్చాడు..అలా కిడ్నాప్ చేసేశారు, రాజమండ్రి సెంట్రల్ జైలులో కిడ్నాప్ కలకలం, ఆర్ధిక లావాదేవీలే కారణమని పోలీసుల అనుమానం
Arun Charagondaబెయిల్ పై విడుదలైన ఒరిస్సాకు చెందిన వ్యక్తిని కిడ్నాప్ చేశారు దుండగులు. రాజమండ్రి సెంట్రల్ జైలు పరిధిలో జరిగిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆర్థిక లావాదేవీల విషయంలో ఒరిస్సా వ్యాపరి సంజయ్‌ను కిడ్నాప్ చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
KTR America Tour: అమెరికాకు కేటీఆర్, వ్యక్తిగత పర్యటన అని ట్విట్టర్ ద్వారా వెల్లడి, అమెరికా నుండి రష్యాకు వెళ్లనున్న కేటీఆర్
Arun Charagondaఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బెయిల్ రావడంతో హైదరాబాద్‌కు చేరుకున్నారు ఎమ్మెల్సీ కవిత. ఇక తన సోదరికి బెయిల్ నేపథ్యంలో అన్ని పనులను దగ్గరుండి చూసుకున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మార్చి 15న రాత్రి 7: 15కి ఇంటి నుంచి డిల్లీకి వెళ్లిన కవిత...ఆ తర్వాత 165 రోజులకు బుధవారం రాత్రి 7: 15కి తన నివాసానికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ కవితకు మంగళహారతి ఇచ్చి ఇంట్లోకి స్వాగతం పలికారు కుటుంబ సభ్యులు. అనంతరం కేటీఆర్‌కి రాఖి కట్టారు కవిత.
AP Student Died in USA: అమెరికాలో తెలుగు విద్యార్ధి మృతి, స్నేహితులతో కలిసి సెల్ఫీ తీసుకుంటూ సరస్సులో పడిపోయిన యువకుడు
VNSశ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన పి.రూపక్‌రెడ్డి(26) (Rupa reddy) అమెరికాలోని జార్జ్ సరస్సులో మునిగి మృతిచెందాడు. అతని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. పి.కవిరాజ్‌రెడ్డి, ధనవతి దంపతుల కుమారుడు పి.రూపక్‌రెడ్డి పది నెలల క్రితం ఎంఎస్ చేసేందుకు అమెరికా (Telugu Student de in USA) వెళ్లాడు. అక్కడి హరీష్‌బర్గ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చేరాడు.
CM Revanth Reddy Reviews South RRR: అటవీ ప్రాంతాల్లో నైట్ సఫారీ,రీజనల్ రింగ్ రోడ్డుపై సీఎం రేవంత్ రివ్యూ, భూ సమీకరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు
Arun Charagondaసౌత్ రీజనల్ రింగ్ రోడ్డుపై సమీక్ష నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. సాధ్యమైనంత ఎక్కువ పరిహారం ఇవ్వడంతో పాటు ప్రభుత్వ పరంగా అదనంగా ఏవిధమైన సహాయం చేయగలమో ఆలోచించి రాష్ట్రానికి ప్రయోజనం కలిగించేలా అలైన్‌మెంట్ ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం, రేడియల్ రోడ్ల నిర్మాణం, డ్రైపోర్ట్‌ను సీ పోర్ట్‌కు అనుసంధానించే గ్రీన్ ఫీల్డ్ రహదారిపై సమీక్ష నిర్వహించారు సీఎం.
Hyderabad:పెళ్లికి ఒప్పుకోలేదని ఇంటికి వెళ్లి మరీ యువతి పీక కోసిన ఉన్మాది, ఆపై కరెంట్ స్తంభం ఎక్కి వైర్లు పట్టుకొని ఆత్మహత్యాయత్నం, యువతి మృతి
VNSహైదరాబాద్ (Hyderabad) గచ్చిబౌలిలో ప్రేమోన్మాది వీరంగం సృష్టించాడు. పెళ్లికి నిరాకరించిందని యువతిని దారుణంగా హత్యచేశాడు. అడ్డుకోబోయిన ముగ్గురు యువతులను గాయపరిచాడు. అనంతరం అతడూ ఆత్మహత్యాయత్నం చేశాడు.
Big Shock to YSRCP: వైఎస్సార్సీపీకి బిగ్ షాక్, రాజీనామాకు సిద్ధమైన ఇద్దరు రాజ్యసభ సభ్యులు, మరికొందరు కూడా అదే బాటలో ఉన్నట్లు జోరుగా ప్రచారం
VNSఏపీలో వైసీపీకి (YCP) వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత పార్టీ నేతలు తమదారితాము చూసుకుంటున్నారు. తాజాగా రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ (Mopidevi Venkata Ramana), బీద మస్తాన్‌రావు (Beeda Masthan Rao) తమ పదవులకు రాజీనామా చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్కర్ వారికి అపాయింట్‌మెంట్ ఇచ్చారు.
HYDRA Notices: సీఎం రేవంత్ రెడ్డికి హైడ్రా షాక్, ఏకంగా ఆయన సోదరుడికే నోటీసులు, దుర్గం చెరువు కాలనీలో నోటీసులు అందుకున్నవారిలో పలువురు ఐఏఎస్, ఐఆర్ఎస్ అధికారులు
VNSహైడ్రా (Hydra)దూకుడు కొనసాగుతోంది. చెరువులు, కుంటలను ఆక్రమించి కట్టుకున్న నిర్మాణాలపై కొరడా ఝలిపిస్తోంది. ఎవర్నీ వదలకుండా నోటీసులు ఇస్తున్నారు హైడ్రా అధికారులు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి (M Revanth Reddy) సోదరుడు ఉంటున్న ఇంటికి కూడా నోటీసులు అంటించారు.