రాష్ట్రీయం
Telangana: వీడియో ఇదిగో, సెల్ఫీ దిగుతూ కాలుజారి నాగార్జున సాగర్ ఎడమ కాలువలో పడిన యువతి, తాళ్ల సాయంతో ఆమెను పైకి లాగి కాపాడిన స్థానికులు
Hazarath Reddyనల్గొండ జిల్లాలో సెల్ఫీ మోజు ఓ యువతి ప్రాణాలమీదకు తెచ్చింది. సెల్ఫీ దిగే క్రమంలో ప్రమాదవశాత్తు కాలుజారి నాగార్జున సాగర్ ఎడమ కాలువలో పడింది. నల్గొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని నాగార్జున సాగర్ ఎడమ కాలువ వద్ద శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
Meda Raghunadha Reddy on Party Change Rumors: రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్‌తోనే నా ప్రయాణం, పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎంపీ మేడా రఘునాథ్ రెడ్డి
Hazarath Reddyఏపీ రాజకీయాల్లో ఎన్నికల్లో ఓటమి చెందిన వైసీపీ నుంచి నేతలు ఒకరొకరుగా రాజినామా చేస్తున్నారు. వైసీపీకి రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్ రెడ్డి రాజీనామా చేయనున్నట్లు గత కొన్ని రోజులుగా ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ మారడంపై క్లారిటీ ఇస్తూ.. తాను పార్టీ మారడం లేదని తేల్చి చెప్పారు. పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.
R. Krishnaiah on Party Change Rumors: చివరి వరకు వైసీపీలోనే ఉండి బీసీల కోసం కొట్లాడతా, పార్టీ మార్పు రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎంపీ ఆర్ కృష్ణయ్య
Hazarath Reddyవైసీపీకి, ఆ పార్టీ రాజ్యసభ సభ్యత్వాలకు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేసిన సంగతి విదితమే. ఇక తెలంగాణకు చెందిన బీసీ సంఘం నేత ఆర్. కృష్ణయ్య కూడా వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన కూడా వైసీపీకి గుడ్ బై చెపుతారనే ప్రచారం జరుగుతోంది.
Andhra Pradesh Shocker: పాలకొల్లులో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం, ప్రియుడు మృతి, ప్రియురాలికి తీవ్ర గాయాలు
Arun Charagondaపశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రైల్వే స్టేషన్ సమీపంలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ప్రియుడు రాజేష్ మృతి చెందగా ప్రియురాలు సత్య శ్రావణికి తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే శ్రావణిని ఆస్పత్రికి తరలించి చికిత్ర అందిస్తున్నారు.
CM Revanth Reddy responds On Supreme Court Comments: న్యాయ వ్యవస్థపై అపారమైన నమ్మకం ఉంది, తన వ్యాఖ్యలు వక్రీకరించారన్న సీఎం రేవంత్ రెడ్డి, పత్రికల్లో వచ్చిన వార్తలపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు వెల్లడి
Arun Charagondaదేశ సర్వోన్నత న్యాయస్థానం..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించిన రేవంత్.. పత్రికల్లో వచ్చిన వార్తలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
YSRCP MLCs Resign: వైసీపీకి మరో షాక్, పార్టీకి - ఎమ్మెల్సీకి రాజీనామా చేసిన పద్మ శ్రీ, కళ్యాణ చక్రవర్తి, వీరిబాటలోనే మరికొంతమంది ఎమ్మెల్సీలు!
Arun Charagondaవైసీపీకి మరో షాక్ తగిలింది. ప్రజాప్రతినిధులు వరుస రాజీనామాలతో ఆ పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. తాజాగా పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవులకు కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి రాజీనామా చేశారు. కాసేపట్లో మండలి చైర్మన్ కు రాజీనామా లేఖలు అందజేయనున్నారు కర్రి పద్మశ్రీ, బల్లి కళ్యాణ చక్రవర్తి.
Jurala Project: రికార్డు స్థాయిలో జురాలకు పోటెత్తిన వరద, ఆల్మట్టి, నారాయణపూర్ డ్యాములకు భారీగా చేరుతున్న వరదనీరు..వీడియో
Arun Charagondaఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి,నారాయణపూర్ డ్యాములకు భారీగా చేరుతోంది వరద నీరు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో: 3,10,000 క్యూసెక్కులుగా ఉండగా ప్రాజెక్టు ఓట్ ఫ్లో: 3,00,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం: 9.657 టీంఎంసీలు కాగా ప్రస్తుత నీటి సామర్థ్యం: 8.010 టీఎంసీలుగా ఉంది.
Andhra Pradesh: సీఎం చంద్రబాబు మరో సంచలనం, ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు YSR పేరు తొలగింపు
Arun Charagondaఏపీ సీఎం చంద్రబాబు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు వైఎస్‌ఆర్ పేరును తొలగిస్తు నిర్ణయం తీసుకున్నారు. గత వైఎస్ జగన్ ప్రభుత్వం 2023-24లో ప్రారంభించిన ఐదు, 2024-25లో ప్రారంభించాలని నిర్ణయించిన మరో 5 కాలేజీలకు పెట్టిన YSR పేరును తొలగిస్తూ వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
Hidden Cameras In Girls Hostel Washroom: గుడివాడలో దారుణం, గర్ల్స్ హాస్టల్ వాష్ రూమ్‌లలో సీక్రెట్ కెమెరాలు, 100 వీడియోలను అమ్మిన దుర్మార్గులు!,లాంటి కెమెరాలు లేవని పోలీసుల వెల్లడి
Arun Charagondaగుడివాడలో దారుణం చోటు చేసుకుంది. గర్ల్స్ హాస్టల్ వాష్ రూంలలో సీక్రెట్ కెమెరాలు పెట్టి 300 పైగా వీడియోలు రికార్డ్ చేసిన సంఘటన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో చోటు చేసుకుంది. సీక్రెట్ కెమెరాల ద్వారా వీడియోలను చిత్రీకరించి అమ్ముతున్నాడంటూ బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిపై దాడికి యత్నించారు సహచర విద్యార్థులు.
Telangana Shocker: సిద్దిపేటలో ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం, కత్తితో గొంతులో పొడుచుకున్న 60 సంవత్సరాల వ్యక్తి, ఆస్పత్రికి తరలింపు
Arun Charagondaసిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడకండ్ల శివారులో కత్తితో గొంతులో పొడుచుకొని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశారు. భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూరానికి చెందిన ఎరుకల రాజయ్య గౌడ్ (60) గా గుర్తించారు పోలీసులు. చికిత్స నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు కుకునూరుపల్లి పోలీసులు.
Pilli Subhash Chandra Bose On Party Change: వైసీపీని వీడను, జగన్‌కు వెన్నుపోటు పొడవను క్లారిటీ ఇచ్చిన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, వైసీపీలోనే ఉంటానని స్పష్టం
Arun Charagondaవైసీపీకి ,ఎంపీ పదవులకు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ త్వరలో టీడీపీలో చేరనుండగా తాజాగా మరో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ సైతం రాజీనామా చేస్తారని వార్తలు వెలువడుతున్నాయి.
Pawan Kalyan On Vana Mahotsavam: వన మహోత్సవం సామాజిక బాధ్యత, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పవన్ కళ్యాణ్ పిలుపు, అన్య జాతుల మొక్కలను పెంచడం ఆపేద్దామన్న పవన్
Arun Charagondaదేశీయ మొక్కల పచ్చదనంతో రాష్ట్రం కళకళలాడాలన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇందుకు సంబంధించి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు పవన్. వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి… ఇది సామాజిక బాధ్యత అని పిలుపునిచ్చారు. అన్య జాతుల మొక్కలను పెంచడం మానేద్దాం అని, దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలు అన్నారు. వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Fire Accident in Nalgonda: నల్గొండ శ్రీపతి ల్యాబ్ లో లీకైన రియాక్టర్.. చెలరేగుతున్న మంటలు ( వీడియో)
Rudraపరిశ్రమల్లో అగ్నిప్రమాదాలు ప్రజలను హడలెత్తిస్తున్నాయి. మొన్నటికిమొన్న ఏపీలోని అనకాపల్లిలో ఫార్మా కంపెనీలో ప్రమాద ఘటనను మరిచిపోకముందే నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ పరిధిలోని జాతీయ రహదారి పక్కనే ఉన్న శ్రీపతి ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో ప్రమాదవశాత్తు రియాక్టర్ లో మంటలు చెలరేగాయి.
CM Revanth Reddy On Ganesh Festival: హైదరాబాద్ ఇమేజ్ పెంచేలా గణేష్ ఉత్సవాలు, గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్, సెప్టెంబర్ 19న మిలాద్-ఉన్-నబీ వేడుకలు...సీఎం రేవంత్ రెడ్డి కీలక రివ్యూ
Arun Charagondaహైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేలా గణేష్ ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. గణేష్ ఉత్సవాల నిర్వహణపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో రివ్యూ నిర్వహించిన రేవంత్..పలు కీలక సూచనలు చేశారు. అనుమతులు తీసుకున్న మండపాలకు ఉచిత విద్యుత్ అందించాలని, అధికారులు, నిర్వాహకులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. గణేష్ ఉత్సవాల నిర్వహణలో సుప్రీం కోర్టు నిబంధనలను పరిగణలోకి తీసుకోవాలన్నారు.
HYDRA Limits: హైడ్రా పరిధి ఓఆర్ఆర్ వరకు.. కూల్చివేతలపై సీఎస్ శాంతికుమారి కీలక ప్రకటన
Rudraహైదరాబాద్ మహానగరంలో చెరువులు, నాళాలను ఆక్రమించి నిర్మించిన భవనాలను నేలమట్టం చేస్తున్న హైడ్రా వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
Special Trains: రానున్న పండుగల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త.. 60 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్టు ప్రకటన.. ఏ మార్గాల్లో అంటే??
Rudraరాబోయే దసరా, దీపావళి, ఛట్ పూజ, క్రిస్మస్ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం వివిధ మార్గాల మధ్య నడుస్తున్న 60 ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
Telangana Rains: తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్, వచ్చే 5 రోజుల పాటు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం..
Hazarath Reddyతెలంగాణలో రానున్న ఐదురోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో పలు జిల్లాలకు ఆరెంజ్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
CM Revanth Reddy Brother On Hydra Notices: అక్రమమైతే కూల్చేయండి..సీఎం రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి క్లారిటీ, బీఆర్ఎస్ వాళ్లు రాజకీయాలు చేస్తున్నారని మండిపాటు
Arun Charagondaతన ఇల్లు అక్రమ నిర్మాణమైతే కూల్చేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి. నాకు సమయం ఇస్తే ఇంట్లో ఉన్న సామాన్లు తీసుకుని బయటకి వెళ్తానన్నారు. శేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు నాకు నోటీసులు ఇచ్చారని..ఇప్పటివరకు నన్ను ఏ అధికారి కలువలేదు అన్నారు. తాను ఇల్లు కొనే సమయంలో అది ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందో లేదో తెలియదన్నారు.
Hurun India Rich List 2024: అత్యంత ధనవంతుల జాబితా, బెంగుళూరును వెనక్కినెట్టిన హైదరాబాద్, నగరంలో అత్యంత ధనవంతుడిగా దివీస్ లాబొరేటరీస్ అధినేత మురళీ దివి
Hazarath Reddy2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం, భారతదేశంలో అత్యధిక సంఖ్యలో బిలియనీర్లు ఉన్న నగరంగా హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచింది. 104 మంది వ్యక్తులు ఈ జాబితాలో ఉన్నారు. జాబితాలో ముంబై ఆధిపత్యం కొనసాగుతోంది, ఈ సంవత్సరం కొత్తగా 66 మందిని ధనవంతుల లిస్టులో చేర్చారు,
Telangana: లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన ప్రభుత్వ అధికారి, అరెస్టు చేసి నాంపల్లి కోర్టులో హజరుపరిచిన అధికారులు
Hazarath Reddyమేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌లో అవినీతి తిమింగిలం పట్టుబడింది. కో-ఆపరేట్ డిపార్ట్మెంట్‌లో లంచం తీసుకుంటుండగా డిప్యూటీ రిజిస్ట్రార్ కార్యాలయంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఆర్బిట్రేటర్ బొమ్మల శ్రీనివాసరాజుని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.