రాష్ట్రీయం
Hyderabad: ఎంత తెలివిగా బైక్ దొంగతనం చేశాడో చూడండి..ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ చోరీ, సీసీ టీవీ ఫుటేజ్
Arun Charagondaహైదరాబాద్ బాలాపూర్‌లో ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ చోరీకి గురైంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు బాలాపూర్ పోలీసులు. సీసీ కెమెరాలో దృశ్యాలు రికార్డు అయ్యాయి.
CM Revanth Reddy: టీటీడీ బోర్డు తరహాలోనే యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు, సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు, అవసరమైతే చట్ట సవరణ చేస్తామని వెల్లడి
Arun Charagondaస్పీడ్ ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా 19 ప్రాజెక్టులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రధానంగా టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ తీసుకురావాలన్న సీఎం రేవంత్...ఇతర రాష్ట్రాల్లో ఉన్న పాలసీలపై అధ్యయనం చేయాలన్నారు. హెల్త్, ఎకో, టెంపుల్ టూరిజంపై దృష్టి పెట్టాలని చెప్పిన రేవంత్..తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
Vijayawada Landslide: విజయవాడలో భారీ వర్షాలు.. ఇండ్లపై విరిగిపడ్డ కొండచరియలు.. ఒకరు మృతి.. పలువురికి గాయాలు (వీడియో)
Rudraభారీ వర్షాలు ఏపీ జిల్లాలను అతలాకుతలం చేస్తున్నాయి. భారీ వర్షాలతో విజయవాడ నగరం అస్తవ్యస్తమైంది. నగరంలోని మొగల్ రాజపురంలో పలు ఇండ్లపై కొండచరియలు విరిగిపడ్డాయి.
Car Accident in Hyderabad: హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో కారు బీభత్సం.. ప్రమాదంలో మరో కారు, ఆటో ధ్వంసం
Rudraహైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన కారు కమర్షియల్ కాంప్లెక్స్ పార్కింగ్ లో పార్క్ చేసి ఉన్న మరో కారును, ఆటోను ఢీ కొట్టి పల్టీ కొట్టింది.
Rain in Hyderabad: హైదరాబాద్ లో వాన బీభత్సం.. లోతట్టు ప్రాంతాల్లోని వాళ్లు అప్రమత్తంగా ఉండాలన్న జీహెచ్‌ఎంసీ
Rudraరాజధాని హైదరాబాద్ లో వర్షం కురుస్తున్నది. శనివారం తెల్లవారుజాము నుంచి మోస్తరు నుంచి భారీ వాన పడుతున్నది. ఖైరతాబాద్, మెహిదీపట్నం, మలక్ పేట, దిల్ సుఖ్ నగర్, హయత్ నగర్, వనస్థలిపురం, బంజారాహిల్స్, లక్డీక పూల్, నాంపల్లి, కోఠి, అమీర్‌పేట, పంజాగుట్టలో వర్షం కురుస్తున్నది.
New Service at Mee Seva: ఇకపై పహాణీ కాపీల కోసం ఎమ్మార్వో ఆఫీస్ కు వెళ్లాల్సిన అవసరం లేదు, తాజాగా మరో 9 కొత్త సేవలను చేర్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు
VNSతెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘మీసేవ’లో మరో 9 సేవలను చేర్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్నాళ్లుగా తాసిల్దార్ కార్యాలయంలో మాన్యువల్‌గా అందిస్తున్న సేవలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెస్తున్నట్టు సీసీఎల్‌ఏ కార్యాలయం ప్రకటించింది.
Airbus Beluga in Hyderabad: హైదరాబాద్ లో ల్యాండ్ అయిన ప్రపంచంలోనే అతిపెద్ద విమానం, వేల్ ఆఫ్ ది స్కై ప్రత్యేకతలివే! (వీడియో ఇదుగోండి)
VNSవేల్ ఆఫ్ ద స్కై' (Whale of the Sky) గా పిలవబడే ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో (Airbus Beluga) విమానం.. శుక్రవారం హైదరాబాద్ లో ల్యాండ్ అయింది. 'ఎయిర్ బస్ బెలూగా'(Airbus Beluga) అనే పేరు గల తిమింగలం ఆకారంలో ఉండే ఈ విమానం, ఇప్పటివరకు హైదరాబాద్ కు రెండు సార్లు రాగా.. మూడోసారి,
Hidden Cameras in College Girls' Washroom: విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై జగన్ ఆగ్రహం, విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని మండిపాటు
Hazarath Reddyకృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాల ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయని మండిపడ్డారు.
Hidden Cameras in College Girls' Washroom: పవన్ కళ్యాణ్ ఎక్కడయ్యా, బయటకు వచ్చి మాకు న్యాయం చేయ్, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై భగ్గుమన్న మహిళలు
Hazarath Reddyకృష్ణాజిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాలు పెట్టారనే అంశం ఏపీలో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. జిల్లా అధికారులు, మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా ఎమ్మెల్యేలలను కళాశాలకు వెళ్లాలని ఆదేశించిన సీఎం.. అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు.
Congress Leader Pallam Raju: హైడ్రా దౌర్జన్యకాండపై కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు ఫైర్, కూల్చివేతలు అక్రమం , తనలాంటి వాల్లకే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని మండిపాటు!
Arun Charagondaహైడ్రా పేరిట జరుగుతున్న విధ్వంసంపై జనం మండిపడుతున్నారు. ఏకంగా కాంగ్రెస్ నేతలే .. రేవంత్ రెడ్డి సాగిస్తున్న బుల్డోజర్ దౌర్జన్యకాండను తప్పుబడుతున్నారు . కాంగ్రెస్ పార్టీ ఆగ్రనేత.. కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు.. హైడ్రా తీరును ఆక్షేపించారు.
Accident Caught on Camera: షాకింగ్ సీసీటీవీ ఫుటేజీ, లారీ మీద నుండి వెళ్లడంతో 6వ తరగతి విద్యార్థిని మృతి, హబ్సిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో వెలుగులోకి..
Hazarath Reddyగురువారం సాయంత్రం జూన్సన్ గ్రామర్ స్కూల్లో 6వ తరగతి చదువుతున్న కామేశ్వరి.. పాఠశాల నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో లారీ ఢీకొంది. సాయంత్రం పాఠశాల అయిపోగానే తన తల్లితో స్కూటీ మీద ఇంటికి వస్తుండగా లారీ ఢీకొని కింద పడింది.. లారీ వెనక చక్రాలు కామేశ్వరి పై నుండి వెళ్లడంతో మృతి చెందింది.
YSRCP MPs Clarity on Party Change Rumors: వీడియో ఇదిగో, జగన్ వెంటే మేమంతా ఉంటామని తేల్చి చెప్పిన వైసీపీ ఎంపీలు, మేము రాజీనామా చేస్తే పార్టీకి వెన్నుపోటు పొడిచినట్టేనని వెల్లడి
Hazarath Reddyవైసీపీ ఎంపీలు పార్టీ మారుతున్నారనే హాట్ టాఫిక్ రూమర్స్ పై వైసీపీ ఎంపీలు క్లారిటీ ఇచ్చారు. వైసీపీ నుంచి 10 మంది రాజ్యసభ సభ్యులు బయటకు వెళ్లిపోతున్నారనే ప్రచారంలో నిజం లేదని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి అన్నారు.
MLA Rajagopal Reddy On Uttam Kumar Reddy: వీడియో ఇదిగో.. ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం కావడం పక్కా, నా నాలుక మీద మచ్చలున్నాయి..జరిగి తీరుతుందన్న రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్‌లో దుమారం రేపిన మునుగోడు ఎమ్మెల్యే కామెంట్స్
Arun Charagondaమునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. నల్లగొండ ప్రజల ఆశీర్వాదంతో మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. భవిష్యత్‌లో తప్పనిసరిగా సీఎం అవుతారు అని జోస్యం చెప్పారు. నా నాలుకపై పుట్టుమచ్చలు ఉన్నాయి.. తప్పనిసరిగా మంత్రి ఉత్తమ్ సీఎం అవుతారని చెప్పారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో నీటి పారుదల పనులపై జరిగిన సమీక్షా సమావేశంలో కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ కాంగ్రెస్‌లో దుమారం రేపాయి.
Gurukul School Staff Harass Students: విద్యార్థినులకు పురుగుల అన్నం, టీచర్లకు పరమాన్నం..ఇది గురుకులాల పరిస్థితి, ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరింపులు, తట్టుకోలేక రోడ్డెక్కిన విద్యార్థినులు!
Arun Charagondaతెలంగాణలో పాలన పడకేసిందా?, నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలను పట్టించుకునే వారేలేరా? అంటే జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఔననే సమాధానం వినిపిస్తోంది. తాజాగా రంగారెడ్డి - శంషాబాద్ మండలంలోని పాలమాకులే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగులు అన్నం పెట్టి పైశాచకాన్ని ప్రదర్శించారు గురుకుల పాఠశాల సిబ్బంది.
CM Revanth Reddy On Yadadri: యాదాద్రి ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ, పెండింగ్ పనుల వివరాలను సమర్పించాలని అధికారులకు ఆదేశం
Arun Charagondaయాదగిరిగుట్ట అభివృద్ధిపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు అర్ధంతరంగా వదిలేయడానికి వీల్లేదని..ఆలయ అభివృద్ధిని మరో స్థాయికి తీసుకెళ్లాలని అధికారులకు స్పష్టం చేశారు.
Gurukul School Students Protest: పురుగుల అన్నం పెడుతున్నారంటూ రోడెక్కిన గురుకుల పాఠశాల విద్యార్థులు, సీఎం రేవంత్ రెడ్డి వచ్చి మా గోడు వినాలని డిమాండ్, వీడియోలు ఇవిగో..
Hazarath Reddyరంగారెడ్డి - శంషాబాద్ మండలంలోని పాలమాకులే గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పురుగులు అన్నం పెట్టి, ఉపాధ్యాయులు మాత్రం వేరే కూరలు చేసుకుని తింటున్నారని విద్యార్థులు రోడ్డెక్కారు. మేం అడిగితే ఇంటి నుండి తెచ్చుకోండని అంటున్నారని అన్నారు. మంచి నీటి సమస్య కూడా ఉంది. చెప్పలేని పదజాలంతో బూతులు తిడుతున్నారు.
Robert Vadra At Hyderabad: హైదరాబాద్‌లో రాబర్ట్ వాద్రా, ఘనస్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు, ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని వెల్లడించిన వాద్రా
Arun Charagondaకాంగ్రెస్ నేత రాబర్ట్ వాద్రా హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న వాద్రాకు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు వాద్రా. ఈ సందర్భంగా తెలంగాణలోని వివిధ ప్రాంతాలను సందర్శించనున్నారు వాద్రా. ప్రజలకు జరుగుతున్న ఇబ్బందులు, సమస్యలు అడిగి తెలుసుకుంటానని చెప్పారు.
V. Vijayasai Reddy: నేను జగన్ సైనికుడిని, పార్టీ మార్పు రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చిన విజయసాయి రెడ్డి, వైఎస్‌ఆర్సీపీలోనే ఉంటానని స్పష్టం చేసిన వైసీపీ రాజ్యసభ ఎంపీ
Hazarath Reddyవైసీపీ రాజ్యసభ సభ్యుల పార్టీ మార్పు వ్యవహారం ఇప్పుడు ఏపీ దుమారం రేపుతోంది. ఇప్పటికే ఇద్దరు ఎంపీ రాజీనామాలు చేశారు.ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తనకు తానే ఓ క్లారిటీ ఇచ్చారు. తాను కూడా పార్టీ మారుతున్నానంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ట్విట్టర్లో మండిపడ్డారు. తాను ఎక్కడికీ వెళ్లట్లేదంటూ క్లారిటీ ఇచ్చారు.
Telangana Rain Update: తెలంగాణకు వర్షాలే వర్షాలు, నాలుగు రోజుల పాటు కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిక, రేపు భారీ వర్షం కురిసే అవకాశం
Arun Charagondaరానున్న నాలుగు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్న నేపథ్యంలో నాలుగు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రేపు అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందని దీని ఫలితంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది.