రాష్ట్రీయం

Road Accident: ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా.. 30 మందికి గాయాలు.. నల్గొండ జిల్లాలో ఘటన

Rudra

నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగిత్యాల నుంచి దర్శి వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. అద్దంకి, నార్కెట్‌ పల్లి ప్రధాన రహదారిపై వేములపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది.

Heavy Rains in Telangana: నేడు తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ

Rudra

తెలంగాణలోని పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది.

Hyderabad Marathon 2024: హైదరాబాద్ మారథాన్-2024 ప్రారంభం.. జెండా ఊపి ప్రారంభించిన హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి

Rudra

హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఎన్ఎండీసీ హైదరాబాద్ మారథాన్-2024 13వ ఎడిషన్ కాసేపటి క్రితం లాంఛనంగా ప్రారంభమైంది. నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా నుంచి గచ్చిబౌలి బాలయోగి స్టేడియం వరకు ఈ మారథాన్ కొనసాగనుంది.

Bhatti Reacted Demolition Of Hydra: ఏకంగా చెరువులోనే నిర్మాణాలు చేప‌డితే కూల్చివేయ‌రా? హైడ్రా కూల్చివేత‌ల‌ను స‌మ‌ర్ధించిన డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌

VNS

హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతల (N Convention) వ్యవహారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy Cm Bhatti Vikramarka) శనివారం స్పందించారు. హైదరాబాద్‌ అంటే లేక్స్‌, రాక్స్‌కు నెలవని.. వీటిని కాపాడుకోవాలంటూ పర్యావరణవేత్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారని గుర్తు చేశారు. చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు

Advertisement

Telangana Weather Update: తెలంగాణ‌కు మ‌రోసారి భారీ వ‌ర్ష సూచ‌న‌, ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం, రెండు రోజులు అల‌ర్ట్ జారీ

VNS

తెలంగాణలో రాగల రెండురోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (IMD) హెచ్చరించింది. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే (Rain Alert) అవకాశం ఉందని పేర్కొంది.

Ranganath On N Convention Demolition: ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌, చట్టప్రకారమే కూల్చివేతలని కామెంట్,కేటీఆర్ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలన్న బీజేపీ ఎంపీ

Arun Charagonda

అక్రమ కట్టడాల కూల్చివేత తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది. చెరువులు, కుంటలను ఆక్రమించిన వారిపై కొరడా ఝుళిపిస్తోంది హైడ్రా. ఇందులో భాగంగా ఇవాళ సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేసింది. ఉదయం భారీ బందొబస్తు నడుమ కూల్చివేత ప్రక్రియ కొనసాగించగా నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై స్టే విధించింది న్యాయస్థానం.

AP Capital Amaravathi Update: అమ‌రావ‌తి నిర్మాణ ప‌నుల‌పై మంత్రి నారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు, ఎంత ఖ‌ర్చ‌వుతుంది? ఎప్ప‌టి నుంచి ప‌నులు ప్రారంభిస్తారంటే?

VNS

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతి (Amaravathi Construction) నిర్మాణంపై ఏపీ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్‌ 1వ తేదీ నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. అమరావతి రాజధాని నిర్మాణానికి రూ.60వేల కోట్లు ఖర్చవుతుందని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడులో జరిగిన క్రెడాయ్‌ సౌత్‌ కాన్‌ 2024 కార్యక్రమానికి మంత్రి నారాయణ హాజరయ్యారు.

Andhra Pradesh Shocker: ప్రకాశం జిల్లా దర్శిలో విషాదం..ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థుల గల్లంతు, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు

Arun Charagonda

ప్రకాశం జిల్లా దర్శి లో విషాదం నెలకొంది. దర్శి సమీపంలోని సాగర్ కాలువలో ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు గల్లంతు అయ్యారు. గల్లంతు అయిన విద్యార్థులు పోతిరెడ్డి లోకేష్, బత్తుల మణికంఠ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి గా గుర్తించగా కొత్తపాలెం గ్రామానికి చెందిన పోతిరెడ్డి లోకేష్ మృతదేహం లభ్యం అయింది.మరో ఇద్దరు విద్యార్థులు మణికంఠ, కిరణ్ మృతదేహాలు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Fake Baba At Vikarabad: వికారాబాద్ పట్టణంలో దొంగ బాబా హల్చల్, డబ్బులు ఇవ్వకపోతే పాపం చుట్టుకుంటుందని బెదిరింపులు, దొంగబాబాకు దేహశుద్ది చేసిన స్థానికులు

Arun Charagonda

వికారాబాద్‌లో దొంగబాబాకు దేహశుద్ది చేశారు స్థానికులు. మీ ఇంట్లో నరదృష్టి ఉంది దయ్యాలు ఉన్నాయి 500, 1000 రూపాయలు ఇవ్వండి మేము తాయత్తు ఇస్తాము దయ్యాన్ని మాయం చేస్తామంటూ నాలుగైదు రోజుల నుండి రాజీవ్ గృహకల్పాల్లో హల్చల్ చేస్తున్నాడు ఓ దొంగ బాబా.

Telangana Congress: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌కు చుక్కెదురు, ఫేక్ మెంబర్ షిప్ ఎఫెక్ట్‌, వెంకట్ సభ్యత్వాన్ని హోల్డ్‌లో పెట్టిన యూత్ కాంగ్రెస్!

Arun Charagonda

తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. తాజాగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌కు చుక్కెదురైంది. వెంకట్ సభ్యత్వాన్ని హోల్డ్‌లో పెట్టింది యూత్ కాంగ్రెస్.

Police Case On BRS MLA Palla: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు, బఫర్ జోన్‌లో అనురాగ్ యూనివర్సిటీ నిర్మించారని ఫిర్యాదు, కేసు నమోదు చేసిన పోలీసులు

Arun Charagonda

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. బఫర్ జోన్‌లో అనురాగ్ యూనివర్సిటీ నిర్మించారని పల్లాపై కేసు నమోదు చేశారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వెంకటాపురంలో ఉంది అనురాగ్ యూనివర్సిటీ. బఫర్ జోన్‌లో నిర్మాణాలు చేపట్టారని పోచారం పీఎస్‌లో ఇరిగేషన్ డిపార్టుమెంట్ ఈఈ పరమేశ్వర్ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

Andhra Pradesh: నెల్లూరు జిల్లాలో గంజాయి స్మగ్లర్ల దారుణం, డీఎస్పీ కారును ఢీ కొట్టిన స్మగ్లర్లు, దాడిలో గాయపడ్డ పోలీసులు

Arun Charagonda

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గంజాయి స్మగ్లర్లు దారుణానికి తెగబడ్డారు. వెంకటాచలం టోల్‌గేట్ వద్ద తనిఖీలు చేస్తున్న డీఎస్పీని కారుతో ఢీ కొట్టారు. గూడూరు సాదుపేటలో స్మగ్లర్లు అడ్డుకునే సమయంలో కారుతో వాకాడు సిఐపై దాడి చేశారు. ఈ దాడిలో డీఎస్పీ శ్రీనివాస్, వాకాడు సీఐ హుస్సేన్‌ బాషాకి గాయాలు అయ్యాయి. గంజాయి స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Shock to Hero Nagarjuna: హీరో నాగార్జునకు హైడ్రా షాక్.. మాదాపూర్‌ లోని ఎన్‌-కన్వెన్షన్‌ సెంటర్ ను కూల్చేస్తున్న అధికారులు.. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు.. చెరువును కబ్జా చేసి నిర్మించడమే కారణం.. (వీడియో)

Rudra

ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. అక్కినేని హీరోకు చెందినా మాదాపూర్‌ లోని ఎన్‌-కన్వెన్షన్‌ సెంటర్ ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు.

Sexual Harassment Of School Girls: పలాసలో విద్యార్ధినులపై లైంగిక వేధింపులు, ప్రిన్సిపాల్‌కు చెప్పినా పట్టించుకోని వైనం, తల్లిదండ్రుల ఆగ్రహం

Arun Charagonda

శ్రీకాకుళం జిల్లా పలాసలో పాఠశాల విద్యార్థినిలకు లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. కాశిబుగ్గ ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిలకు అదే అదే తరగతికి చదువుతున్న దేవేంద్ర అనే విద్యార్థి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు.

Hyderabad Shocker: వీధి కుక్కని హతమార్చిన వ్యక్తి, స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఫిర్యాదుతో కేసు నమోదు..వీడియో వైరల్

Arun Charagonda

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో దారుణం జరిగింది. వీధి కుక్కని దారుణంగా హతమార్చాడు ఓ వ్యక్తి. స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్‌లో ఈ ఘటన జరుగగా కుక్కని హింసించిన వీడియో వైరల్‌గా మారింది.

Andhra Pradesh Shocker: చిత్తూరు జిల్లాలో ఇంట్లోనే దీపావళి పటాసుల తయారీ, అగ్నిప్రమాదం, ఆవు మృతి, ముగ్గురికి గాయాలు

Arun Charagonda

చిత్తూరు జిల్లా గంగవరం మండలం మారేడుపల్లెలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లోనే దీపావళి పటాసులను తయారీ చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలు కాగా ఆవు మృతి చెందింది.

Advertisement

Pinnelli Ramakrishna Reddy: నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలైన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, రెండు నెలల జైలు జీవితం తర్వాత బయటకు, వైసీపీ నేతల స్వాగతం

Arun Charagonda

నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఈవీఎంల ధ్వసం కేసులో అరెస్ట్ అయి రెండు నెలల జైలు జీవితం తర్వాత బెయిల్ రావడంతో బయటకు వచ్చారు పిన్నెల్లి. కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయగా పాస్‌పోర్టును కోర్టులో సరెండర్ చేయాలని సూచించింది. దేశం విడిచి వెళ్లరాదని తెలిపింది. ఇక జైలు నుండి బయటకు వచ్చిన పిన్నెల్లికి వైసీపీ నేతలు స్వాగతం పలికారు

Telangana NRI Dies In Saudi Arabia: పనిచేయని జీపీఎస్, ఎడారిలో దారి తప్పి డీహైడ్రేషన్‌తో తెలంగాణ యువకుడి మృతి, కరీంనగర్‌లో విషాద చాయలు

Arun Charagonda

జీపీఎస్ పనిచేయక తెలంగాణకు చెందిన ఓ యువకుడు సౌది అరేబియాలో మృతిచెందాడు. ఐదు రోజుల క్రితం స్నేహితుడి దగ్గరకు వెళ్లేందుకు జీపీఎస్ పెట్టుకుని కారులో బయలుదేరాడు షహబాజ్ ఖాన్.

KTR: మరికొద్దిసేపట్లో మహిళా కమిషన్ ముందుకు కేటీఆర్.. ఎందుకంటే?

Rudra

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మరికొద్దిసేపట్లో తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరు కానున్నారు.

BRS MLAs To Join Congress: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్, ఆ ఐదుగిరి ఎమ్మెల్యేల చేరిక లాంఛనమే, సీఎం రేవంత్ అనుకున్నది చేసేస్తున్నారా?

Arun Charagonda

తెలంగాణలో మరో ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరనున్నారా?, కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు ఫలించాయా?, అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ నుండి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా మరో ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు ఒప్పుకోవడంతో ఒక్కసారిగా పొలిటికల్ వాతావరణం హీటెక్కింది.

Advertisement
Advertisement