రాష్ట్రీయం
Telangana: అసభ్యకర ఫోటోలు తీస్తూ వేధింపులు, ఎలక్షన్ అధికారి చెంప చెళ్లుమనిపించిన మహిళ, వీడియో ఇదిగో..
Hazarath Reddyఅసభ్య ప్రవర్తనతో వేధిస్తున్నాడని.. అధికారి చెంప చెల్లుమనిపించిన మహిళ. నారాయణఖేడ్ పట్టణంలో నివాసం ఉంటున్న ఎలక్షన్ డిప్యూటీ తహశీల్దార్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ చెంప చెల్లుమనిపించింది. ఫోన్లో వీడియోలు, ఫొటోలు తీస్తూ వేధిస్తున్నాడని వాపోయింది
Notification For 4th Phase Elections: నాలుగో ద‌శ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ గెజిట్ విడుద‌ల‌, నామినేష‌న్ల ప్ర‌క్రియ షురూ, తెలుగు రాష్ట్రాలు స‌హా ఎక్క‌డెక్క‌డ ఎన్నిక‌లున్నాయంటే?
VNSరాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌ పత్రాలను స్వీకరిస్తారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 3.30 కోట్ల మంది ఓటుహక్కును వినియోగించుకోనుండగా, వారి కోసం 35 వేల పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.
Vijayawada Fire Accident: విజ‌య‌వాడంలో భారీ అగ్ని ప్ర‌మాదం, గోడౌన్ లో చెల‌రేగిన మంట‌లు, ఆర్పుతున్న ఫైర్ సిబ్బంది
VNSఓ గోడౌన్ లో మంట‌లు చెల‌రేగాయి. దీంతో ఆ ప్రాంత‌మంతా ద‌ట్ట‌మైన పొగ క‌మ్ముకుంది. మొద‌టి అంత‌స్తు వ‌రకు మంట‌లు వ్యాపించాయి. స‌మాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంట‌ల‌ను అదుపులోకి తెచ్చేందుకు శ్ర‌మిస్తున్నారు. అయితే గోడౌన్ లోప‌ల ఎవ‌రైనా చిక్కుకుపోయారా? అన్న విష‌యం తెలియాల్సి ఉంది.
Raghu Babu Car Rams Motorcyclist: ప్ర‌ముఖ న‌టుడు ర‌ఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి, ర‌ఘుబాబును అరెస్ట్ చేసిన పోలీసులు
VNSసినీనటుడు రఘుబాబు (Raghu Babu) కారు ఢీకొని నార్కట్‌పల్లి-అద్దంకి రహదారి నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకుడు మృతిచెందారు. నల్గొండ పట్టణంలోని శ్రీనగర్‌ కాలనీకి చెందిన బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి సందినేని జనార్దన్‌రావు(48) సమీపంలోని లెప్రసీకాలనీ ప్రాంతంలో ఉన్న తన వ్యవసాయ క్షేత్రం వద్దకు బుధవారం సాయంత్రం వాకింగ్‌ కోసం పానగల్‌ బైపాస్‌ మీదుగా ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు.
Lok Sabha Elections 2024: ఏపీ, తెలంగాణ పోలింగ్‌కు నోటిఫికేషన్ తేదీ ఇదిగో, నాలుగో విడతలో మొత్తం 96 లోక్ సభ స్థానాలకు పోలింగ్
Hazarath Reddyసార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ విడుదల చేయనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 18 నుంచి నోటిఫికేషన్ వెలువడిన అనంతరం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఈసారి 7 దశల్లో జరగనుండగా... తెలుగు రాష్ట్రాల్లో నాలుగో దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
AP SSC 10th Results 2024 Date: ఏపీ పదో తరగతి ఫలితాలపై లేటెస్ట్ అప్‌డేట్, ఏప్రిల్ చివరి వారంలో bse.ap.gov.in ద్వారా రిజల్ట్స్ విడులయ్యే అవకాశం
Vikas Mబోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్, BSEAP ఏప్రిల్ 25 నాటికి AP SSC ఫలితాలు 2024 ని ప్రకటించాలని భావిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. షెడ్యూల్ తేదీల్లో 10వ తరగతి బోర్డు పరీక్షకు హాజరైన అభ్యర్థులు AP SSC 10వ ఫలితాలు మనబడి అధికారిక వెబ్‌సైట్ - bse.ap.gov.in నుండి ఒకసారి విడుదల చేసిన తర్వాత తనిఖీ చేసి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
Hyderabad Shocker: దారుణం, లారీతో బైకును గుద్ది రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ డ్రైవర్, చివరకు ఎలా చిక్కాడంటే..
Hazarath Reddyపాతబస్తీలో ముందు వెళ్తున్న బైక్‌ని ఢీకొట్టిన లారీ..లారీ డ్రైవర్ తో వాగ్వాదానికి దిగిన బైకర్. కోపంతో మరోసారి బైక్‌ని ఢీ కొట్టి దాదాపు రెండు కిలోమీటర్లు ఆపకుండా లారీ నడిపిన డ్రైవర్. బ్యానెట్ ‌పైకెక్కిన బైకర్. చివరకు రోడ్డుకు అడ్డంగా మరో వాహనం రావడంతో ఆగిన లారీ. బాధితుడి ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్ అరెస్ట్ చేశారు పోలీసులు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Tirumala Latest News: శ్రీవారి భక్తులకు అలర్ట్, రేపు ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల, జూలై నెల కోటాను ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల
Hazarath Reddyతిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు అలర్ట్.. శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన జూలై నెల కోటాను ఈ నెల 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
Sri Ram Navami 2024: వీడియోలు ఇవిగో, భద్రాచలంలో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం, ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి
Hazarath Reddyభద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ప్రధానఘట్టం ఆవిష్కృతం కానున్నది. శ్రీ రామనామస్మరణతో భద్రాచలం పురవీధులు మార్మోగుతున్నాయి.
Badradri Thalambralu in RTC: భ‌ద్రాద్రి రాముల‌వారి క‌ల్యాణానికి వెళ్ల‌లేక‌పోయారా? అలాంటివారికి బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన టీఎస్ఆర్టీసీ, ఇంటికే సీతారాముల క‌ల్యాణ త‌లంబ్రాలు, ఎలా పొందాలంటే?
VNSకల్యాణ తలంబ్రాలను భక్తుల ఇళ్ల వద్దకు చేరవేసే పవిత్ర కార్యానికి ఆర్టీసీ (TSRTC) శ్రీకారం చుట్టిందని సజ్జనార్‌ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఎంతో విశిష్టత కలిగిన ఈ తలంబ్రాలను కోరుకునే భక్తులు టీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ.151 చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
Shobha Yatra: హైద‌రాబాద్ లో శ్రీ‌రామ‌న‌వ‌మి శోభాయాత్ర‌, ఈ రూట్ల‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు, ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటున్న పోలీసులు
VNSశ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా నగరంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. దీంతో పాటు యాత్ర జరిగే ప్రధాన మార్గాల్లో ఉండే ప్రార్థన మందిరాలు బయటకు కనిపించకుండా పరదాలతో మూసేశారు. మతపరమైన ఇబ్బందులు ఏర్పడకుండా పండుగల సందర్భంగా ఇలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటుంటారు
Black Magic Rituals Near KCR House: వీడియో ఇదిగో, కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు కలకలం, సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్న అధికారులు
Hazarath Reddyబీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసం ఉంటున్న నందినగర్ ఇంటి పక్కన గల ఖాళీ ప్రాంతంలో చేతబడి, క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కలకలం రేపుతున్నాయి. ఆ ప్రాంతంలో పసుపు, కుంకుమ ఆనవాళ్లు కనిపించడంతో క్షుద్రపూజలు చేసి ఉంటారనే భావన వ్యక్తమవుతుంది.
Nellore Road Accident: కావలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, ఆగి ఉన్న లారీని వెనుకవైపు నుంచి బలంగా ఢీకొట్టిన లారీ, ఐదుగురు అక్కడికక్కడే మృతి
Hazarath Reddyనెల్లూరు జిల్లా కావలి ముంగమూరు జాతీయ రహదారి నెత్తురోడింది. కావలి రూరల్ మండలం గౌరవరం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. రహదారిపై ఆగి ఉన్న ఓ లారీని వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది.
Memantha Siddham in Bhimavaram: భార్యల్ని మార్చేస్తే అక్క చెల్లెమ్మల బ్రతుకులు ఏం కావాలి, చూడయ్యా దత్తపుత్రా అంటూ పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడిన సీఎం జగన్,భీమవరం మేమంతా సిద్ధం సభ హైలెట్స్ ఇవే..
Hazarath Reddyభీమవరం సభలో సీఎం జగన్ మాట్లాడుతూ..భీమవరంలో జన సముద్రం కనిపిస్తోంది.ఉప్పొంగిన ప్రజాభిమానం కనిపిస్తోంది. మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. జరుగుతున్న మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్థమా? అని అన్నారు.
Venkatayapalem Head Tonsure Case: 1996 వెంకటాయపాలెం శిరోముండనం కేసు, మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సహా ఆరు మందికి 18 నెలల జైలు శిక్ష, రూ.2.50లక్షల జరిమానా
Hazarath Reddyవెంకటాయపాలెంలో సంచలనం రేపిన 1996 శిరోముండనం కేసులో విశాఖపట్నం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు సహా ఆరుగురు నిందితులకు న్యాయస్థానం 18 నెలల జైలు శిక్షతో పాటు రూ.2.50లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు.
Skill Development Scam: చంద్రబాబు బెయిల్ షరతులు ఉల్లంఘించడంపై సుప్రీంకోర్టు సీరియస్, స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో విచారణ మే 7కి వాయిదా, కోర్టులో రెడ్ బుక్ ప్రస్తావన
Hazarath Reddyస్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ సుప్రీంకోర్టులో వాయిదా పడింది. ఈ పిటిషన్‌పై విచారణను మే 7 వరకు సుప్రీం కోర్టు వాయిదా వేసింది.
Drunk Techie Wreaked Havoc: మద్యం మత్తులో ఐటీ కారిడార్‌ రోడ్లపై టెక్కీ బీభత్సం, IKEA నుండి కామినేని ఆసుపత్రి వరకు ఆరు యాక్సిడెంట్లు, ఒకరు మృతి, మరో 10 మందికి గాయాలు
Hazarath Reddyతాగుబోతు టెక్కీ ఐటీ కారిడార్‌లోని హైదరాబాద్ రోడ్లపై విధ్వంసం సృష్టించాడు. అతని ర్యాష్ డ్రైవింగ్ వల్ల రాయదుర్గం పీఎస్ లిమిట్స్‌లో ఒకరు మృతి చెందగా, 10 మంది గాయపడ్డారు. IKEA నుండి కామినేని ఆసుపత్రి వరకు 6 ప్రమాదాలు చేశాడు,
ATM Robbery in Hyderabad: అర్థరాత్రి ఏటీఎంలో చొరబడి రూ. 18 లక్షల నగదు దోచుకెళ్లిన దుండగులు, సీసీ కెమెరాలపై నల్లరంగు స్ప్రే చేసి మరీ..
Hazarath Reddyహైదరాబాద్ నగర శివారు ఏరియా శంషాబాద్ లో గుర్తు తెలియని దుండగులు ఏటీఎంలో చొరబడి రూ.18,99,000 నగదు దోచుకెళ్లారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని పాల్మాకుల బస్టాప్‌ వద్ద బెంగళూరు జాతీయ రహదారి పక్కన ఎస్‌బీఐ ఏటీఎం ఉంది.
Andhra Pradesh Rains: ఏపీకి వానలే వానలు, ఆగస్టు- సెప్టెంబరు మధ్యలో సాధారణానికి మించి అధికంగా వర్షాలు కురుస్తాయని తెలిపిన ఐఎండీ
Hazarath Reddyఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్(జూన్- సెప్టెంబరు)లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD తెలిపింది. ఆగస్టు- సెప్టెంబరు మధ్యలో లా నినా ప్రభావంతో ఎక్కువ మోతాదులో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
Student Suicide At Basara IIIT: బాసర ఐఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య, హాస్టల్ గదిలో ఉరేసుకున్న పీయూసీ సెకండ్ ఇయర్ స్టూడెంట్, వీడియో ఇదిగో..
Hazarath Reddyబాసర ఐఐఐటీలో మరోసారి విద్యార్థి ఆత్మహత్య కలకలం రేగింది. పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి.. తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని చనిపోయాడు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్టీయూకేటీ) లో అర్వింద్ అనే విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు.