రాష్ట్రీయం
Delhi Excise Policy Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో విస్తుగొలిపే విషయాలు, బెదిరించి డబ్బులు డిమాండ్ చేసిన కవిత, మూడు రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించిన కోర్టు, కస్టడీ పిటిషన్‌లో కీలక అంశాలు ఇవిగో..
Hazarath Reddyఢిల్లీ మద్యం కేసులో కవితను (Kavitha) కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరగా.. 3 రోజుల పాటు (ఈనెల 14 వరకు) కస్టడీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
BRS MLC Kavitha Arrested: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరిన సీబీఐ, మధ్యాహ్నం తరువాత వాదనలు వింటామని తెలిపిన ధర్మాసనం
Hazarath Reddyమద్యం పాలసీ కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) అరెస్టు చేసిన భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) నాయకురాలు కె కవితను శుక్రవారం ఉదయం రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. కవితను ఐదు రోజుల కస్టోడియల్ రిమాండ్ కోరుతూ సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది.
Andhra Pradesh Road Accident: అనకాపల్లిలో ఇంజినీరింగ్ కాలేజీ బస్సు బీభత్సం, 12 ఏళ్ల బాలుడు మృతి, మరో 5 మందికి తీవ్ర గాయాలు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఅనకాపల్లిలో ఇంజినీరింగ్ కాలేజీ బస్సు బీభత్సం స‌ృష్టించింది. అనకాపల్లి - కసింకోట మండలం బయ్యవరం సమీపంలో రోడ్డు పక్కన ఉన్న ఓ టిఫిన్ వాహనంపైకి ఓ ప్రైవేట్ కాలేజీ బస్సు ఒక్కసారిగా దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 12 ఏళ్ల బాలుడి మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.క్షతగాత్రులు అనకాపల్లిలో చికిత్స పొందుతున్నారు.
Andhra Pradesh Elections 2024: కొడుమూరులో టీడీపీకి షాక్, వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి
Hazarath Reddyఏపీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో వలసలు జోరందుకున్నాయి. తాజాగా కోడుమూరు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్ రెడ్డి, టీడీపీ సీనియర్ నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి వైసీపీలో చేరారు. వైయస్‌ఆర్‌సీపీ అభ్యర్థి ఆదిమూలపు సతీష్ పోటీ చేస్తున్న కొడుమూరు నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా బొగ్గుల దస్తగిరి పోటీలో ఉన్నారు.
AP Inter Results 2024 Declared: ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల, ఫెయిలైతే ఆందోళన చెందవద్దని కోరిన ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్, చెక్ చేసుకోవడానికి లింక్ ఇదిగో..
Hazarath Reddyఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు(AP Inter Exams) విడుదల అయ్యాయి. ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేశారు.
AP Intermediate Results Out: హుర్రే... ఏపీ ఇంట‌ర్ మొదటి, రెండో ఏడాది ఫ‌లితాలు విడుదల.. రిజల్స్ట్ ఎక్కడ చెక్ చేసుకోవాలంటే??
Rudraఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు రాసిన విద్యార్థులకు శుభవార్త. ఏపీ ఇంటర్ బోర్డు కాసేపటి క్రితం ఇంటర్ మొదటి, రెండో ఏడాది ఫలితాలను ఒకేసారి విడుదల చేసింది.
AP Intermediate Results: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేడే ఏపీ ఇంట‌ర్ మొదటి, రెండో ఏడాది ఫ‌లితాలు.. ఉద‌యం 11 గంట‌ల‌కు విడుద‌ల‌.. ప‌రీక్ష‌లు రాసిన దాదాపు 10 ల‌క్ష‌ల మంది విద్యార్థులు
Rudraఇంట‌ర్మీడియ‌ట్ ప‌రీక్ష‌లు రాసిన విద్యార్థులకు శుభవార్త. నేడు ఇంటర్ ఫ‌లితాలు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఏపీ ఇంటర్ బోర్డు వెల్ల‌డించింది. ఉద‌యం 11 గంట‌ల‌కు మొద‌టి, రెండో సంవ‌త్స‌రం ఫ‌లితాల‌ను ఒకేసారి విడుద‌ల చేస్తామ‌ని ఇంట‌ర్మీడియ‌ట్ విద్యామండ‌లి ప్ర‌క‌టించింది.
Hyderabad Break Biryani Records: రంజాన్ నెల‌లో రికార్డులు బ‌ద్ద‌లు కొట్టిన హైద‌రాబాదీలు, ఆ ఒక్క యాప్ నుంచే ఏకంగా 10 ల‌క్ష‌ల బిర్యానీలు ఆర్డ‌ర్, ఇక ఎన్ని హ‌లీమ్స్ ఆర్డ‌ర్ చేశారంటే?
VNSరంజాన్‌ నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా పది లక్షల పేట్ల బిర్యానీ ఆర్డర్లు (A Million Plates Of Biryani) వచ్చినట్లు ప్రముఖ ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ తాజాగా వెల్లడించింది. ఈ ఏడాది రంజాన్‌ మాసం మార్చి 11న ప్రారంభమైన విషయం తెలిసిందే.
MLC Kavitha Moves Court: సీబీఐ అరెస్టుపై కోర్టును ఆశ్ర‌యించిన ఎమ్మెల్సీ క‌విత‌, అత్య‌వ‌స‌రంగా విచారించాల‌ని లాయ‌ర్ విజ్ఞ‌ప్తి
VNSడ్యూటీ మేజిస్ట్రేట్ ముందు కవిత తరుపు న్యాయవాది కవిత సీబీఐ అరెస్ట్ ను సవాల్ చేస్తూ పిటిషన్ ను (Moves Court) ఫైల్ చేశారు. అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. అయితే రేపు ఎలాగూ కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. సీబీఐ అదుపులోకి తీసుకున్న 24 గంటల్లో కవితను కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది.
Online Cricket Betting Racket Busted: హైదరాబాద్‌లో ఐపీఎల్ ఆన్ లైన్ బెట్టింగ్ గుట్టు రట్టు, రూ. 43. 57 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న సిట్ పోలీసులు
Hazarath Reddyఐపీల్ ప్రారంభం కావడంలో బెట్టింగ్ రాయుళ్లు కూడా భారీ స్ఠాయిలో బెట్టింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. తాజాగా మాదాపూర్ మరియు మియాపూర్ పోలీసుల SOT బృందం సైబరాబాద్ పోలీసులతో కలిసి ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్ రాకెట్ ను చేధించారు.
SPF Constable Suicide: షాకింగ్ వీడియో, గన్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్, బ్యాంకు సీసీటివీలో ఘటన రికార్డ్
Hazarath Reddyవిశాఖపట్నం (Visakha)లో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఐఓబి బ్యాంకులో గన్ మాన్ గా విధులు నిర్వహిస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్రావు గన్‌తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు.
Fake Cigarettes Seized: నకిలీ సిగిరెట్ల గుట్టు రట్టు చేసిన సైబరాబాద్ పోలీసులు, రూ.2.15 కోట్ల విలువైన వివిధ బ్రాండ్‌ల నకిలీ సిగిరెట్లు స్వాధీనం
Hazarath Reddyశంషాబాద్‌లో ఎస్‌ఓటీ రాజేంద్ర నగర్‌లో రూ.2.15 కోట్ల విలువైన వివిధ బ్రాండ్‌ల నకిలీ సిగరెట్లను సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.బీహార్, హర్యానా మరియు హైదరాబాద్ నుండి వాటిని అక్రమ రవాణా చేస్తున్న నలుగురిని అరెస్టు చేశారు. 267 కార్టన్‌ల నిషేధించిన సిగరెట్లు బీహార్ నుండి హైదరాబాద్‌కు రవాణా అవుతున్నాయి.
Telangana: అప్పు చేసి ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడి రూ.25 వేలు పోగొట్టుకున్న యువతి, తీర్చమని అడగడంతో ఇంట్లో దొంగలు పడ్డారంటూ డ్రామా, వీడియో ఇదిగో..
Hazarath Reddyరంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ ఎర్రబోడలోని ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు చేధించారు. ఈ ఘటనలో యువతే నాటకమాడిందని పోలీసులు తెలిపారు. ఇంట్లో దొంగలు పడ్డారని యువతి కేకలు వేసింద. స్థానికులు సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న రాజేంద్రనగర్‌ పోలీసులు.. క్లూస్‌ టీమ్‌ను రంగంలోకి దింపారు.
Andhra Pradesh Elections 2024: పవన్ కళ్యాణ్ గెలిచాక పిఠాపురం చూడటానికి ప్రపంచంలోని తెలుగువాళ్లంతా తండోపతండాలుగా వస్తారు, జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది సంచలన వ్యాఖ్యల వీడియో ఇదిగో..
Hazarath Reddyతెలంగాణలో హైదరాబాద్ చూడడానికి ఎలా వస్తున్నారో.. పవన్ కళ్యాణ్ గెలిచాక పిఠాపురం చూడడానికి ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఒక టూర్ లాగా వస్తారు. పిఠాపురం ఎన్నికల ప్రచారంలో భాగంగా జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది సంచలన వ్యాఖ్యలు చేశారు.
Telangana: ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyధాన్యం కొనుగోళ్లల్లో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేయడానికి ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ మేరకు X (ట్విట్టర్) వేదికగా ఓ ప్రకటన విడుదల చేశారు
Telangana Elections 2024: సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వదిలి బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఎంతో దూరంలో లేదు, సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్
Hazarath Reddy2024 సార్వత్రిక ఎన్నికల ప్రారంభానికి కొద్దిరోజుల ముందు బీఆర్‌ఎస్ నేత కేటీ రామారావు మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరతారంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపణ చేశారు.
Andhra Pradesh Elections 2024: వీడియో ఇదిగో, ఒంగోలులో ఘోరంగా కొట్టుకున్న వైసీపీ, టీడీపీ కార్యకర్తలు, ఘటనపై స్పందించిన ఎమ్మెల్యే బాలినేని
Hazarath Reddyఒంగోలులో ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ, టీడీపీ కార్యకర్తలు నిన్న రాత్రి ఘోరంగా కొట్టుకున్నారు. అక్కడికి వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్థన్ చేరుకోగా.. మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఇరుపార్టీల కార్య కర్తలను చెదరగొట్టి, గాయపడిన వారిని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. దీనిపై నారా లోకేష్ ట్వీట్ చేశారు.
CBI Arrests Kavitha: తీహార్‌ జైలులో కవితను అరెస్ట్ చేసిన సీబీఐ, కేజ్రీవాల్‌లో కలిసి కవిత కుట్రలు చేశారని సీబీఐ ఆరోపణలు
Hazarath Reddyఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో తీహార్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఇప్పటి వరకు కవిత ఈడీ కస్టడీలో ఉండగా తాజాగా సీబీఐ అరెస్ట్‌ చేసింది. ఈ మేరకు కవిత అరెస్ట్‌ను అధికారికంగా సీబీఐ ప్రకటించింది.. కోర్టుకు కూడా తెలిపింది.
Ugadi Tragedy in Andhra Pradesh: ఉగాది వేళ కర్నూలులో తీవ్ర విషాదం, రథం లాగుతుండగా 15 మంది చిన్న పిల్లలకు కరెంట్ షాక్, వీడియో ఇదిగో..
Hazarath Reddyఉగాది పండగ వేళ కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉగాది సందర్భంగా రథం లాగుతుండగా విద్యుత్ షాక్ కలకలం రేపింది. ఈ ప్రమాదంలో 15 మంది చిన్నారులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరందరికి కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Andhra Pradesh Elections 2024: సీఎం జగన్ పాలన సూపర్ అంటున్న టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, వాలంటీర్ల వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమం అంటూ కితాబు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి జగన్ పాలనపై ప్రశంసలు కురిపించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి వాలంటీర్, సచివాలయాల రూపంలో ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యవస్థ‌ను తీసుకొచ్చారంటూ కితాబిచ్చారు. దీనికి సంబంధించిన వీడియోని వైఎస్సార్సీపీ తన ఎక్స్ లో షేర్ చేసింది. మళ్లీ వచ్చేది జగనే అంటూ క్యాప్షన్ జోడించింది.